Kriti Sanon: కృతి సనన్(Kriti Sanon) తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు తెలుగులో మహేష్ బాబు హీరోగా నటించిన 1 నేనొక్కడినే, నాగచైతన్య దోచేయ్ వంటి సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాలతో పెద్దగా ప్రేక్షకాదరణ నోచుకోలేకపోయింది. ఇలా తెలుగులో పూర్తిగా నిరాశ ఎదురైన నేపథ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో స్థిరపడి బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా ఓవెలుగు వెలుగుతున్నారు.. ఇక ఇటీవల ప్రభాస్(Prabhas) హీరోగా నటించిన ఆది పురుష్ (Aadi Purush)సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమెకు ప్రభాస్ కూడా సరైన సక్సెస్ అందించలేకపోయారు.ఇలా సౌత్ ఇండస్ట్రీలో సినిమాలు పెద్దగా కలిసి రాకపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యారు.
కోట్లు విలువ చసే ఖరీదైన ఫ్లాట్..
ఇదిలా ఉండగా తాజాగా ఈమెకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతూ భారీ స్థాయిలోనే కృతి సనన్ ఆస్తులను కూడా పెట్టారనే తెలుస్తుంది. ఇప్పటికే ముంబైలో ఖరీదైన ఫ్లాట్స్ కొనుగోలు చేసిన ఈమె తాజాగా మరో ఖరీదైన అపార్ట్మెంట్ కొనుగోలు చేశారని తెలుస్తోంది. ముంబైలోని బాంద్రా వెస్ట్ లోని పాలీ హిల్ ప్రాంతంలో ఖరీదైన లగ్జరీ హౌస్(Luxury House) కొనుగోలు చేసినట్టు సమాచారం. ఈ లగ్జరీ ఫ్లాట్ కోసం కృతి ఏకంగా రూ. 84.16 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది.
భారీగా ఆస్తులు కూడా పెట్టిన నటి..
ఇదివరకే ఈమెకు బాంద్రాలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 4 బిహెచ్ కే అపార్ట్మెంట్ కూడా కలిగి ఉందని తెలుస్తోంది. ఈ అపార్ట్మెంట్ విలువ సుమారు 35 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది. ఇక ఇదే ప్రాంతంలో బాలీవుడ్ స్టార్స్ అందరూ కూడా నివసిస్తున్నారు. ఈమె కూడా ఇదే ప్రాంతంలో ఖరీదైన అపార్ట్మెంట్ కొనుగోలు చేశారని తెలిసిన అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
వ్యాపార రంగంలో సక్సెస్…
ఇక కృతి సనన్ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు స్కిన్ కేర్ కి సంబంధించిన వ్యాపారాన్ని ప్రారంభించి వ్యాపారంలో కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. అలాగే పెద్ద ఎత్తున బ్రాండ్స్ ప్రమోట్ చేస్తూ కూడా భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇక ప్రస్తుతం కృతి సినిమాల విషయానికి వస్తే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తో కలిసి తేరే ఇష్క్ మే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నవంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం. ఇలా కెరియర్ పరంగా సినిమాలలో నటిస్తూనే మరోవైపు వ్యాపార రంగంలో సక్సెస్ అందుకుంటూ భారీ స్థాయిలో ఆస్తులు కూడా పెడుతున్నారు.
Also Read: Raj Kundra: స్వామీజీకి కిడ్నీ దానం చేస్తానన్న నటి భర్త.. నెటిజన్ల రియాక్షన్ ఇదే!