Bose-The Mystery Unsolved Trailer: స్వాతంత్ర్య సమర యోధుల్లో సుభాష్ చంద్రబోస్ ఒకరు. భారతీయులను ఆంగ్లేయుల బానిస సంకెళ్ల నుంచి విడిపించేందుకు ఆయన ఎన్నో పోరాటాలు చేశారు. ఆంగ్లేయులను దేశం నుండి తరిమికొట్టడానికి సాయుధ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన నాయకత్వంలో భారత జాతీయ సైన్యం (ఆజాద్ హింద్ ఫౌజ్) ఏర్పడింది. ఇది భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించింది. అలా సుభాస్ చంద్రబోస్.. నేతాజీగా కీర్తి పొందారు. గాంధీ అహింస సిద్ధాంతాలను వ్యతిరేకిస్తూనే.. స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు. అయితే రెండో ప్రపంచ యుద్ధం సమయంలో నేతాజీ చనిపోయినట్టు వార్త వచ్చిన సంగతి తెలిసిందే.
18 ఆగస్టు 1945లో విమాన ప్రమాదంలో నేతాజీ మరణించినట్టు వార్తలు ఉన్నాయి. కానీ, ఆయన చనిపోయినట్టుగా ఖచ్చితమైన ఆధారాలు లేవు. ఇప్పటికీ ఆయన మరణం మిస్టరీగానే ఉంది. 1985లో ఫైజాబాద్‌లో గుర్తు తెలియని ఒక సాధువు మరణంతో నేతాజీ మరణం చర్చనీయాంశం అయ్యింది. ఆయన చనిపోయిన ప్రాంతంలో సుభాష్ చంద్రబోస్ పేరుతో ఉన్న ఓ లేఖ, ఆయన పాత ఫోటో దొరకడంతో నేతాజీ మరణం మిస్టరీగా మారింది. దీనిపై ఎన్నెన్నో కథనాలు వచ్చాయి. నేతాజీ మరణించలేదని, బంధిగా ఉంచారంటూ ఓ వార్త ప్రచారంలో ఉంది. అయితే ఆయన జీవిత కథ ఆధారంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ, ఆయన మరణం వెనక ఉన్న రహస్యం ఏంటనేది ఎవరూ చూపించలేకపోయారు.
బోస్: ది మిస్టరీ అన్సాల్డ్వ్
అయితే ఇప్పుడు ఆయన మరణం తర్వాత ఏం జరిగిందనే కల్పిత కథ బోస్ అనే చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. బోస్: ది మిస్టరీ అన్సాల్డ్వ్ (Bose – The Mystery Unsolved) అనే టైటిల్ హిందీలో ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో సుభాస్ చంద్రబోస్, గాంధీజీ, నెహ్రులను ఏఐతో చూపించబోతున్నారు. ఈ సినిమాలోని పాత్రలన్ని ఏఐ డిజైన్ చేసి తెరపై ప్రదర్వించబోతున్నారు. దీంతో ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. నేరుగా ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 26న ఈ చిత్రం స్ట్రీమింగ్ రానుంది. జింగ్ రోల్ అనే ఓటీటీ ఫాట్ ఫాంలో బోస్ మూవీని విడుదల చేయనున్నట్టు తాజాగా మూవీ టీం ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రకటింస్తూ మూవీ ట్రైలర్ విడుదల చేశారు. హిందీలో విడుదలైన ఈ ట్రైలర్ సుభాస్ చంద్రబోస్ చనిపోయిన సంఘటనతో మొదలైంది.
ట్రైలర్ లో ఏముందంటే..
ఆ విమాన ప్రమాదం తర్వాత నేతాజీ మరణంపై అనేక వాదనలు వినిపించాయి. కొందరు విమానం గాల్లోనే పేలిపోయిందని అంటే.. మరికొందరు మాత్రం ల్యాండ్ అయినప్పుడు కూలిపోయిందని వాదించారు. కానీ, ఇప్పటివరకు ఆయన మరణించారని ఖచ్చితంగా చెప్పే ఆధారాలేవీ లేవు. మరి, ఆయన బతికే ఉంటే.. ఎక్కడ ఉన్నారు? ఇండియాకు ఎందుకు రాలేదనే సందేహాలు కూడా ఉన్నాయి. అందుకే నేతాజీ మరణం ఇప్పటికీ అన్‌సాల్వుడ్ మిస్టరీనే. అయితే.. 1985, ఫైజాబాద్‌లో గుర్తుతెలియని ఒక సాధువు మరణంతో నేతాజీ పేరు మరోసారి చర్చనీయమైంది. దానికి కారణం.. ఆ సాధువు వద్ద లభించిన కొన్ని లెటర్స్, నేతాజీ ఫొటోలు. దీంతో మరణించిన ఆ సాధువే నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చని సందేహాలు నెలకొన్నాయి. కానీ, ఆ సాధువు ఆయనే అని నిరూపించలేకపోయారు. ఈ అంశాలనే ప్రధానంగా ప్రస్తావిస్తూ.. Bose – The Mystery Unsolved మూవీని రూపొందిస్తున్నారు. ఏఐ టెక్నాలజీతో రూపొందించిన ఈ మూవీ విజువల్స్.. చాలా సహజంగా ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది.