BigTV English

Virus to Rabbits: కుందేళ్లకు కొమ్ములా.. బాబోయ్ ఇదెక్కడి విడ్డూరం?

Virus to Rabbits: కుందేళ్లకు కొమ్ములా.. బాబోయ్ ఇదెక్కడి విడ్డూరం?

Rabbits Horns: చాలా మంది చిన్నప్పుడు ఓ పద్యం చదువుకుని ఉంటారు. “తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు… దవిళ మృగతృష్ణలో నీరు త్రాగవచ్చు.. తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు..” అంటూ కంఠస్తం చేసి ఉంటారు. మూర్ఖుల గురించి విరించే ఈ పద్యంలో తిరిగితే కుందేలు కొమ్మును కూడా సాధించవ్చు అంటారు. నిజానికి కుందేలుకు కొమ్ము అనేది ఉండదు. ఆ విషయం మనందరికీ తెలుసు. కానీ, ఇప్పుడు కుందేలుకు కొమ్ములు ఉంటున్నాయని తెలిస్తే ఆశ్చర్యం కలగకమానదు. కుందేలుకు కొమ్ములు ఏంటి? అని మీరూ ఆలోచిస్తున్నారా? అయితే, మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాలి.


కుందేలుకు కొమ్ములు

తాజాగా ఫోర్ట్ కాలిన్స్, కొలరాడోలోని ఇతర ప్రాంతాలలో ఉండే ప్రజలు ఓ ఆశ్చర్యకర విషయాన్ని చూశారు. అక్కడ నివసించే కుందేళ్ల ముఖం, తలల మీద కొమ్ములు ఉన్నట్లు గుర్తించారు. నల్లటి, గోధుమ వర్ణపు కొమ్ములు పొడుచుకు వచ్చినట్లు కనిపించాయి. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. టూత్ పిక్స్, క్విల్స్ ను పోలి ఉండే నల్లటి ముళ్ల లాంటి ఆకారంలో కొమ్ములు కనిపిస్తున్నాయి.


కుందేళ్లకు కొమ్ములు ఎలా వస్తున్నాయి?

కుందేళ్లకు కొమ్ములు రావడం వెనుక ఓ వైరస్ ఉన్నట్లు వన్య ప్రాణుల నిపుణులు చెప్తున్నారు. షోప్ పాపిల్లోమా వైరస్  కారణంగానే ఈ కొమ్ములు వస్తున్నట్లు వెల్లడించారు. ఇది కుందేళ్లపై మొటిమ లాంటి కణితులకు కారణం అవుతుంది.  తల, చెవులు, కనురెప్పల చుట్టూ ఈ కొమ్ములు ఉంటాయి. ఇవి చూడ్డానికి ఆందోళనకరంగా ఉన్నా, మనుషులకు, పెంపుడు జంతువులకు, వణ్యప్రాణులకు ముప్పు కలిగించవని డాక్టర్లు వెల్లడించారు. ఈ వైరస్ కుందేళ్ళ మధ్య మాత్రమే వ్యాపిస్తున్నట్లు తెలిపారు. ఈ వైరస్ సాధారణంగా దోమలు, పేల లాంటి కీటకాల ద్వారా వ్యాపిస్తున్నట్లు తెలిపారు. ఇది మిడ్‌ వెస్ట్‌ లోని కాటన్‌ టెయిల్ కుందేళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. దేశీయ కుందేళ్ళలో వ్యాప్తి చెందుతుందని మిస్సోరి విశ్వవిద్యాలయం పరిశోధకులు వెల్లడించారు.

స్థానికులు ఏం చెప్తున్నారంటే?

ఫోర్ట్ కాలిన్స్ నివాసితులు కుందేళ్లకు కొమ్ముల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుందేళ్లకు గత 2 ఏళ్లుగా ఈ లక్షణాలు కనిపిస్తున్నట్లు వెలెల్లడించారు. రోజు రోజుకు ఈ తీవ్రత పెరుగుతున్నట్లు వెల్లడించారు. కొంతమంది స్థానికిఉలు మొదట్లో జంతువులకు ప్లేగు, మరొక ప్రమాదకరమైన వ్యాధి ఉన్నట్లు భయపడ్డారు. కానీ, ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో కాస్త రిలాక్స్ అయ్యారు.

Read Also: ఆ దేశంలో శునకానికి పూజ చేసి.. వేడుకలు చేస్తారు, ఎందుకంటే?

షోప్ పాపిల్లోమా వైరస్ గురించి..   

షోప్ పాపిల్లోమా వైరస్ అనేది అపాయం లేని మొటిమల్లాంటి కణితులను కలిగిస్తుంది. కానీ, కొన్ని సందర్భాల్లో ఇవి ప్రాణాంతకం కావచ్చంటున్నారు. సాధారణంగా కుందేలు మొత్తం ఆరోగ్యానికి హానికరం కానప్పటికీ, కణితులు నోరు, ముక్కు, కళ్ళను అడ్డుకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు చెప్తున్నారు.

Read Also: సబ్బుతో కడిగితే పోతుంది.. రెబిస్ చాలా చిన్న వైరస్.. మేనకా గాంధీ సోదరి కామెంట్స్‌ పై దుమారం!

Related News

Cinnamon: దాల్చిన చెక్కను ఇలా తయారు చేస్తారా? అస్సలు ఊహించి ఉండరు!

Loco pilot Viral Video: క్షణం ఆగి జెండాకు సెల్యూట్.. లోకో పైలట్ వీడియో వైరల్!

Maneka Gandhi Sister: సబ్బుతో కడిగితే పోతుంది.. రెబిస్ చాలా చిన్న వైరస్.. మేనకా గాంధీ సోదరి కామెంట్స్‌ పై దుమారం!

Dogs Day Celebrations: ఆ దేశంలో శునకానికి పూజ చేసి.. వేడుకలు చేస్తారు, ఎందుకంటే?

Viral video: బస్సును నడుపుతున్న యువతి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Big Stories

×