Alia Bhatt: అలియా భట్ (Alia Bhatt)తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె తెలుగులో కూడా అదే స్థాయిలో ఆదరణ సొంతం చేసుకున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన RRR సినిమా ద్వారా తెలుగులో కూడా మంచి ఆదరణ సొంతం చేసుకున్న ఆలియా అనంతరం నటించిన సినిమాలన్నీ కూడా తెలుగులో విడుదల అవుతూ ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నాయి. ఇక సెలబ్రిటీల పట్ల అభిమానులు కానీ ఫోటోగ్రాఫర్లు కానీ పెద్ద ఎత్తున ఉత్సాహం కనబరుస్తూ ఉంటారు.
ఇది మీ ఇల్లు కాదు.. బయటకు వెళ్ళండి..
కొన్నిసార్లు సెలబ్రిటీలకు ఇష్టం లేకపోయిన ఫోటోగ్రాఫర్లు చూపించే అత్యుత్సాహం సెలబ్రిటీలకు తీవ్రమైన ఆగ్రహాన్ని తెప్పిస్తూ ఉంటాయి. ఇలాంటి సమయంలోనే సెలబ్రిటీలు కూడా కాస్త అసహనం వ్యక్తం చేస్తుంటారు తాజాగా అలియా భట్ పరిస్థితి కూడా అలాగే ఉందని చెప్పాలి. తాజాగా అలియా భట్ పికిల్ బాల్ ఆడి తన ఇంటికి చేరుకున్నారు. అయితే ఈమె ఫోటోగ్రాఫర్ల దృష్టిలో పడటంతో ఏకంగా తన ఇంటి ఆవరణంలోకి వెళ్లి మరి ఆమె ఫోటోలు తీసే ప్రయత్నం చేశారు దీంతో ఆలియా కాస్త అసహనం వ్యక్తం చేశారు.”ఈ క్రమంలోనే ఆలియా దయచేసి లోపలికి రాకండి.. ఇదేమి మీ ఇల్లు కాదు కదా..బయటకు వెళ్లిపోండి” అంటూ అసహనం ప్రదర్శించారు.
కాస్త స్వేచ్ఛను ఇవ్వండి…
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. పాపం తనని అలా ఇబ్బందులకు గురి చేయకండి వారి కంటూ కాస్త స్వేచ్ఛ ఇవ్వండి అంటూ కామెంట్లు చేయగా, మరికొందరు మాత్రం పాపులర్ అయ్యేవరకు ఫోటోగ్రాఫర్ల దృష్టిలో పడతారు, కాస్త ఫేమ్ రాగానే ఇలా అందరిపై విరుచుకుపడటం ఏంటి అంటూ అలియా తీరును కూడా తప్పుపడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలియా కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె వరస ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన వార్ 2 సినిమాలో కనిపించే సందడి చేశారు. ప్రస్తుతం యశ్ రాజ్ ఫిలిమ్స్ యూనివర్స్ లో ఆల్ఫా (Alpha)అనే సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
?igsh=MW4zNnBvN3Z1eTd4YQ%3D%3D
ఇలా సినిమాలతో పాటు ఓ బోల్డ్ కంటెంట్ తో ఓ వెబ్ సిరీస్ కూడా చేయబోతున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ పనులు కూడా జరుగుతున్నట్టు సమాచారం. ఇలా సినిమాలు వెబ్ సిరీస్ లు అంటూ అలియా కెరియర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ (Ranbir Kapoor)ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ దంపతులకు రాహా కపూర్ (Rahaa Kapoor)అనే కుమార్తె కూడా ఉన్నారు. ఇలా వృత్తిపరమైన జీవితంలోనూ వ్యక్తిగత జీవితంలోనూ అలియా ఎంతో బిజీగా, సంతోషంగా గడుపుతున్నారు.
Also Read: Mrunal Thakur: క్షమాపణలు కోరిన మృణాల్… చాలా సిల్లీగా మాటాడాను అంటూ!