E-Paper
Advertisement

Raj Nidimoru -Samantha: సమంతకు అదిరిపోయే పెళ్లి కానుక ఇచ్చిన రాజ్ .. ఫిదా అయిన సామ్?

Raj Nidimoru -Samantha: సమంతకు అదిరిపోయే పెళ్లి కానుక ఇచ్చిన రాజ్ .. ఫిదా అయిన సామ్?
Advertisement

Raj Nidimoru -Samantha: సినీనటి సమంత (Santha)డైరెక్టర్ రాజ్ నిడిమోరు ( Raj nidimoru)వివాహం చేసుకోవడంతో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వీరిద్దరి పెళ్లి గురించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. సమంత రాజ్ ఇద్దరికీ ఇది రెండవ పెళ్లి అనే సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే సమంత పెళ్లిపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి . ఇక సమంత చాలా సింపుల్ గా కోయంబత్తూర్ లోని ఈషా ఫౌండేషన్ లో ఉన్న లింగ బైరవి ఆలయంలో భూత శుద్ధి పద్ధతిలో వివాహం జరుపుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ ఒకటవ తేదీ వీరి వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పెళ్ళికానుకగా లగ్జరీ హౌస్..

ఇక ఈ పెళ్లి ఫోటోలలో భాగంగా సమంతకు రాజ్ తొడిగిన రింగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సమంత కోసం స్పెషల్ గా డిజైన్ చేయించిన ఈ డైమండ్ రింగ్ సుమారు రూ. 1.5 కోట్ల రూపాయల విలువ చేస్తుందని తెలుస్తోంది. ఇలా సమంతకు ప్రత్యేకమైన డైమండ్ రింగ్ మాత్రమే కాకుండా మరొక ఖరీదైన కానుకను కూడా రాజ్ పెళ్లి సందర్భంగా సమంతకు ఇచ్చినట్టు తెలుస్తుంది.. సమంత కోసం హైదరాబాదులో ఎంతో విలాసవంతమైన లగ్జరీ హౌస్ (Luxury House)సమంతకు రాజ్ కానుకగా ఇచ్చినట్టు సమాచారం. ఈ ఇల్లు కొన్ని కోట్ల విలువ చేస్తుందని తెలుస్తోంది.

న్యూ బిగినింగ్స్ అంటూ..

Advertisement

సమంత దీపావళి పండుగ సందర్భంగా తన కొత్త ఇంటికి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఈ ఇంటిని స్వయంగా రాజ్ తనకు కానుకగా ఇచ్చారని తెలుస్తోంది . ఇక పెళ్లి తర్వాత సమంత రాజ్ ఇద్దరూ కూడా ఇదే ఇంట్లో ఉండబోతున్నారని సమంత అభిరుచులకు అనుగుణంగా ఈ ఇంటిని రాజ్ డిజైన్ చేయించి తనకు పెళ్లికి కానుకగా ఇచ్చినట్టు సమాచారం. ఈ ఇంటి ఫోటోలను కూడా సమంత సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ న్యూ బిగినింగ్ అంటూ గతంలో ఫోటోలు షేర్ చేసిన సంగతి తెలిసిందే.

అత్తారింట్లో అడుగుపెట్టిన సామ్..

Advertisement

ఇక సమంత పెళ్లి తర్వాత తన అత్తగారింటిలో అడుగుపెట్టినట్టు తెలుస్తోంది . రాజ్ సోదరి సమంతతో తన కుటుంబం దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. సమంత తన కుటుంబంలో భాగమైనందుకు సంతోషం వ్యక్తం చేస్తూ తనకు గ్రాండ్ వెల్కమ్ తెలియచేశారు. ఇలా సమంత అత్తారింటికి సంబంధించిన ఫోటోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సమంత కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె నటిగా నిర్మాతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలా ఇండస్ట్రీలో బిజీగా ఉంటూనే మరోవైపు ఈమె పర్ఫ్యూమ్ బ్రాండ్ బిజినెస్ ప్రారంభించారు. అలాగే క్లోత్స్ బిజినెస్ కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. కొంతకాలం పాటు తన వ్యక్తిగత కారణాల వల్ల ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సమంత ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

Also Read: Akhanda 3: అఖండ 3 కన్ఫర్మ్… టైటిల్ లీక్ చేసిన తమన్..

Related News

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

Big Stories

Advertisement
×