E-Paper
Advertisement

Redmi Note 15 Pro: రెడ్‌మీ నోట్ 15 ప్రో మ్యాక్స్ భారీ డిస్కౌంట్‌.. ధర తగ్గడంతో టెక్ మార్కెట్ షేక్

Redmi Note 15 Pro: రెడ్‌మీ నోట్ 15 ప్రో మ్యాక్స్ భారీ డిస్కౌంట్‌.. ధర తగ్గడంతో టెక్ మార్కెట్ షేక్
Advertisement

Redmi Note 15 Pro: రెడ్‌మీ నోట్ సిరీస్‌కు మార్కెట్లో ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. అదే సిరీస్‌లో ఇప్పుడు భారీ అంచనాల మధ్యకి వచ్చిన మోడల్ రెడ్మీ నోట్ 15 ప్రో మ్యాక్స్. లాంచ్ వెంటనే టెక్ వరల్డ్‌లో పెద్ద చర్చ మొదలైంది. ఎందుకంటే ఈ ఫోన్‌లో ఇచ్చిన 180W అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ వినగానే చాలా మంది ఆశ్చర్యపోయారు. కేవలం 15 నిమిషాల టైమ్ చాలు, ఫోన్ పూర్తిగా ఛార్జ్ అయిపోతుందన్న కన్ఫర్మేషన్ బయటకు రావడంతో సోషల్ మీడియా మొత్తం ఇదే టాపిక్‌గా మారింది. రోజూ  గంటల తరబడి ఛార్జింగ్ కోసం వేచి ఉండలేని యూజర్లు, హై స్పీడ్ వర్క్ చేసేవాళ్లు ఈ ఫీచర్‌ను చూస్తే వెంటనే కొనాలనుకునే క్రేజ్ క్రియేట్ అయింది.

ప్రీమియమ్ లెవెల్‌లో డిజైన్

Advertisement

డిజైన్ సైడ్ చూస్తే ఈ సారి రెడ్మీ పూర్తిగా ప్రీమియమ్ లెవెల్‌లో తీసుకెళ్లింది. అప్‌డేటెడ్ లుక్‌తో, గ్లాస్ ఫినిష్‌తో, హ్యాండ్‌లో పట్టుకుంటే స్పెషల్ ఫీలింగ్ వచ్చేలా తయారు చేశారు. బిల్డ్ క్వాలిటీ బలంగా, ఫినిష్ క్లాసిగా, పక్కదారి మోడల్స్‌కి కఠిన పోటీగా ఉంది.

అమోలెడ్ స్క్రీన్ డిస్‌ప్లే క్వాలిటీ

Advertisement

డిస్‌ప్లే క్వాలిటీ కూడా ఈ ఫోన్‌లో హైలైట్. అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిసి స్క్రోల్ చేస్తే బటర్‌లాంటి స్మూత్ ఫ్లో, మూవీస్ చూస్తే వీయింగ్ ఎక్స్‌పీరియన్స్ హై లెవెల్, గేమింగ్ చేస్తే రియలిస్టిక్ విజువల్స్ ఇచ్చే అవుట్‌పుట్ ఇస్తున్నాయి. డిస్ప్లే విషయంలో రెడ్మీ ఈసారి ఏ మాత్రం రాజీ పడలేదు.

డైమెన్సిటీ ప్రాసెసర్

పర్‌ఫార్మెన్స్ సైడ్‌లో మీడియా టెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ ఉపయోగించారు. ఇది హై స్పీడ్ మల్టీ టాస్కింగ్‌కి, గేమింగ్‌కి, హెవీ యూజ్‌కి సులభంగా హ్యాండిల్ చేసే స్థాయి పవర్ అందిస్తుంది. 8 జీబి, 12 జీబి ర్యామ్ వేరియంట్స్‌తో రావడం వల్ల ఏ పని చేసినా ల్యాగ్ అనిపించదు. 128 జీబి, 256 జీబి స్టోరేజ్ ఆప్షన్స్‌తో ఎక్కువ ఫైల్స్ ఉంచుకోవచ్చు.

200 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్

కెమెరా సెగ్మెంట్‌లో 200 మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్ ప్రధాన ఆకర్షణ. డీటైల్ రిచ్ ఫోటోలు, నైట్ షాట్స్, మాక్రో షాట్స్ అన్నింటిలోనూ క్వాలిటీ కనిపిస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ అదనపు సెన్సర్ సపోర్ట్‌తో విభిన్న యాంగిల్స్‌లో ఫోటోలు తీసుకోవచ్చు. సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇవ్వడం వల్ల సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలు మరింత నేచురల్‌గా కనిపిస్తాయి.

5100mah బ్యాటరీ

5100mah బ్యాటరీతో రావడం కూడా ఈ ఫోన్‌కు పెద్ద ప్లస్ పాయింట్. స్పీడ్ ఛార్జ్ మాత్రమే కాదు, లాంగ్ లాస్టింగ్ పర్‌ఫార్మెన్స్ కూడా అందించేలా ఈ బ్యాటరీ ఆప్టిమైజ్ చేసింది. ఓసారి ఛార్జ్ చేస్తే ఒక రోజు ఈజీగా వర్క్ అయ్యే స్థాయిలో రిజల్ట్ ఇస్తుంది. కనెక్టివిటీ సైడ్‌లో 5జి, వై-ఫై 6, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సి వంటి మోడర్న్ టెక్నాలజీ అందించారు. ఇవన్నీ కలిపి ఫ్యూచర్ యూజ్‌కి చాలా స్ట్రాంగ్ ప్యాకేజ్‌గా కనిపిస్తున్నాయి.

అసలు ధర.. ఆఫర్ ధర ఎంత తగ్గింది?

ఇండియాలో ధర విషయానికి వస్తే ఈ ఫోన్ అసలు ప్రైస్ 43999 రూపాయలు. అయితే ప్రారంభ ఆఫర్‌గా 2000 తగ్గింపు ఇచ్చి ప్రస్తుతం 41999కి అందుబాటులో ఉంది. పరిమిత కాలం ఆఫర్ కావడంతో కొనాలనుకునేవాళ్లు త్వరగా నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్ సెల్స్‌లో భారీ డిమాండ్ వచ్చింది. ఇవన్నీ కలిపి మిడ్ రేంజ్ మార్కెట్లో ఈ ఫోన్‌ను గేమ్ ఛేంజర్‌గా నిలబెట్టాయి. రాబోయే వారాల్లో సేల్స్ రికార్డులు బ్రేక్ చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×