E-Paper
Advertisement

Jagga Reddy: కేటీఆర్.. మాటలు జాగ్రత్త! రాహుల్ గాంధీపై ఇష్టంవచ్చినట్టు మాట్లాడితే.. జగ్గారెడ్డి మాస్ వార్నింగ్

Jagga Reddy: కేటీఆర్.. మాటలు జాగ్రత్త! రాహుల్ గాంధీపై ఇష్టంవచ్చినట్టు మాట్లాడితే.. జగ్గారెడ్డి మాస్ వార్నింగ్
Advertisement

Jagga Reddy: రాహుల్ గాంధీకి దేశ భవిష్యత్‌పై విజన్ లేదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు జగ్గారెడ్డి. కేటీఆర్ వయసుకు మించి మాట్లాడుతున్నాడు. రాహుల్ గాంధీని విమర్శించే పర్సనాలిటీ నీది కాదు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేటీఆర్ నువ్వు మాజీ సీఎం కేసీఆర్ కొడుకువి. రాజకీయాల్లో నువ్వు ఎదగడంలో త్యాగాల కంటే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. కానీ రాహుల్ గాంధీ కుటుంబం ఆస్తులు మాత్రమే కాదు, దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన చరిత్ర కలిగిన కుటుంబం. మీకు, వారి కుటుంబానికి ఉన్న తేడా ముందుగా తెలుసుకో అంటూ జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.

Advertisement

రాహుల్ గాంధీని ప్రశ్నించే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదని జగ్గారెడ్డి సూటిగా అన్నారు. రాహుల్ గాంధీ ఎంత గొప్పవాడో చెబుతా విను. తెలంగాణ విభజన చేయవద్దని ఎంతోమంది నాయకులు ఆయనపై ఒత్తిడి తెచ్చినప్పటికీ, మా ప్రజలు అమాయకులు, తెలంగాణ ఇస్తే రాజకీయంగా నష్టపోతాం, ఏపీ లీడర్లు రాజకీయంగా చనిపోతారు, పార్టీ ఔట్ అవుతుంది అంటూ అనేక హెచ్చరికలు వచ్చినా, ఆయన ఒక్కటే మాట చెప్పారు.. తెలంగాణ నిర్ణయం జరిగిపోయింది అని గుర్తుచేశారు.

మేము రాజకీయంగా ఏమవుతామో చూడటం లేదు, యువత ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ప్రజల భవిష్యత్తే మా ముందున్న లక్ష్యం అని రాహుల్ గాంధీ చెప్పాడు. అలాంటి త్యాగపూరిత నిర్ణయానికి నువ్వు విలువ కట్టగలవా కేటీఆర్? అని సూటిగా ప్రశ్నించారు.

Advertisement

నువ్వు సీఎం కొడుకువైనావంటే అది రాహుల్ గాంధీ బిక్షే. కేసీఆర్ తెలంగాణ సీఎం అయ్యాడంటే అది కూడా రాహుల్ గాంధీ బిక్షే. ప్రజలు ఎవరైనా సాయం చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. తెలంగాణ ఇవ్వకపోయి ఉంటే నీ ఇంట్లో పవర్ కొట్లాట, పైసల కొట్లాట కూడా జరిగేది కాదని మర్చిపోయావా? అంటూ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతేకాకుండా, మీ కుటుంబం మొత్తం ఒకప్పుడు సోనియా గాంధీ ఇంటికి వెళ్లిందని, ఆ విషయాన్ని కేటీఆర్ ఇప్పుడు మరిచిపోయినట్టు ప్రవర్తిస్తున్నాడని వ్యాఖ్యానించారు. విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. పవర్ అవసరమే కానీ మాటకు విలువ ఉండాలి, రాజకీయం విలువలతో నడవాలి అంటూ హితవు పలికారు.

కేటీఆర్ గురించి మొదట కొంత పద్ధతి ఉన్న నాయకుడనుకున్నానని చెప్పిన జగ్గారెడ్డి, కానీ రాహుల్ గాంధీ గురించి మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి. ఒకసారి నోరు అదుపులో పెట్టుకో. మళ్లీ రాహుల్ గాంధీ గురించి మాట్లాడితే కేటీఆర్‌ను వదిలిపెట్టేది లేదు అంటూ హెచ్చరించారు.

తన రాజకీయ జీవితం గురించి కూడా జగ్గారెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. నన్ను బీజేపీలో రాజకీయంగా ఎదగనివ్వకుండా అడ్డుకున్నప్పుడు కేసీఆర్ పిలిచి చట్టసభలకు పంపాడు. కేసీఆర్ ఇచ్చిన బీ-ఫారంతోనే సంగారెడ్డికి ఎమ్మెల్యే అయ్యాను. రాజకీయంగా సక్సెస్ కోసమే టీఆర్‌ఎస్‌లో చేరినా, నాకు విలువలు ఉన్నాయి కాబట్టే కేసీఆర్‌తోనే సభలోకి వచ్చానని గర్వంగా చెబుతున్నాను అని తెలిపారు.

ఇక దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను బీజేపీ వక్రీకరిస్తోందని కూడా జగ్గారెడ్డి ఆరోపించారు. ప్రజల మధ్య మతపరమైన, ప్రాంతీయ చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఇలాంటి రాజకీయాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, ప్రజలు ఈ అంశాలను గమనించి తగిన తీర్పు ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు.

 

Related News

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

సీఎం హైదరాబాద్‌కు రాకముందే.. మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా? కాసేపట్లో మీడియా ముందుకు..

Big Stories

Advertisement
×