BigTV English

Samantha: డైరెక్టర్‌తో సమంత రిలేషన్‌.. పోస్ట్ పై రాజ్ భార్య రియాక్షన్!

Samantha: డైరెక్టర్‌తో సమంత రిలేషన్‌.. పోస్ట్ పై రాజ్ భార్య రియాక్షన్!

Samantha:ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు (Raj nidimoru) తో చట్టపట్టలేసుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా సమంత అతడితో చనువుగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో స్వయంగా పోస్ట్ చేయడంతో.. రూమర్స్ కి మరింత ఆజ్యం పోసినట్టు అవుతోంది. దీనికి తోడు గత కొద్ది రోజులుగా వీరిద్దరూ ఎక్కడపడితే అక్కడ కనిపిస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇక వీరిద్దరి బంధం పై ఇన్ డైరెక్ట్ గా రాజ్ నిడిమోరు భార్య శ్యామలి దే (Shyamali dey) ఇన్ డైరెక్ట్ గా కౌంటర్లు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరొకసారి సమంత, రాజ్ నిడిమోరికి ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చింది రాజ్ భార్య..


రాజ్ తో రిలేషన్ కన్ఫర్మ్ చేసిన సమంత..

అసలు విషయంలోకి వెళ్తే.. సమంత తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక పోస్ట్ పంచుకుంది. అందులో రాజ్ నిడిమోరు సమంత భుజంపై చేయి వేసుకొని నడుస్తున్న ఫోటోని ఆమె షేర్ చేయడంతో.. సమంత తన రిలేషన్ ను కన్ఫర్మ్ చేసింది. త్వరలోనే రాజ్ తో ఏడడుగులు వేయబోతోంది అంటూ వార్తలు అయ్యాయి.


ధర్మం అంటూ మళ్ళీ సమంతకు కౌంటర్ వేసిన రాజ్ భార్య..

ఇక దీంతో రాజ్ భార్య శ్యామలి తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా ధర్మం అంటూ పెట్టిన పోస్ట్ మరొకసారి వైరల్ అవుతోంది. తాజాగా శ్యామలీదే తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక పోస్టు పంచుకుంది. అందులో.. కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న ఫోటోని పంచుకుంటూ.. “మతం ఏదైనా సరే మన చర్యలతో ఇతరులను బాధించవద్దు. అదే మన జీవితంలో పాటించాల్సిన గొప్ప నియమం” అంటూ పోస్ట్ పెట్టింది. ఇక ప్రస్తుతం ఇది చూసిన నెటిజన్స్ మళ్లీ సమంతకు కౌంటర్ గానే శ్యామలి ఇలాంటి పోస్ట్ పెట్టింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా సమంత స్పందిస్తుందో లేదో చూడాలి.

సమంత వ్యక్తిగత జీవితం..

నిజానికి సమంత ‘ఏ మాయ చేసావే’ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాలో నటించిన నాగచైతన్య (Naga Chaitanya ను దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించి, పెళ్లి చేసుకుంది. 2017లో పెళ్లి చేసుకున్న ఈ జంట కలిసి యాడ్స్ చేశారు. అలాగే సినిమాలు కూడా చేశారు. ఎంతో అన్యోన్యంగా, ఆదర్శంగా, క్యూట్ జంటగా పేరు దక్కించుకున్నారు. అయితే ఏమైందో తెలియదు కానీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో పెళ్లైన నాలుగేళ్లకే విడాకులు తీసుకొని విడిపోయారు. నాగచైతన్య ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఏడడుగులు వేయగా.. సమంత మాత్రం ఇప్పుడు రాజ్ తో తిరుగుతోందని అతనితో ప్రేమలో ఉందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ఇప్పటికైనా సమంత ఈ రూమర్స్ పైకి స్పందించి చెక్ పెడుతుందేమో చూడాలి.

ALSO READ:Actress Poojitha : ఆ పెద్ద హీరో తొడపై చేయి వేసి… ఛీ ఛీ మరీ ఇంత అసభ్యకరంగానా ?

Related News

2026 summer movies: 2026 సమ్మర్ అంతా భలే సెట్ చేసారు, బట్ చెప్పిన డేట్ కి వస్తారా

Anushka-Allu Arjun: అల్లు అర్జున్ – అనుష్క కాంబోలో మూవీ… రెండు పార్ట్స్, ఇద్దరు డైరెక్టర్స్..!

Balakrishna: అఖండ 2 రిలీజ్ పై బాలయ్య క్లారిటీ.. సోషల్ మీడియాపై మండిపాటు!

OG Movie : రిలీజ్‌కి ముందే ఓజీ విధ్వంసం… పుష్ప 2, కల్కి రికార్డులు బద్దలు

Lavanya – Raj Tarun: శేఖర్ భాషను కలుద్దామని కోరిన లావణ్య.. కట్ చేస్తే.. మరీ ఇంత దారుణమా?

Prabhas: ప్రభాస్‌కి ఏం తెలీదు… డార్లింగ్‌ను తేజ సజ్జా అలా అన్నాడేంటి ?

Big Stories

×