BigTV English

Actress Poojitha : ఆ పెద్ద హీరో తొడపై చేయి వేసి… ఛీ ఛీ మరీ ఇంత అసభ్యకరంగానా ?

Actress Poojitha : ఆ పెద్ద హీరో తొడపై చేయి వేసి… ఛీ ఛీ మరీ ఇంత అసభ్యకరంగానా ?

Actress Poojitha :తెలుగు సీనియర్ నటీమణులలో పూజిత (Poojitha ) కూడా ఒకరు.ఈమె తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 138 సినిమాల్లో నటించింది. ఇక తెలుగులో 70 కి పైగా సినిమాల్లో చేయగా.. ఇందులో ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు (Iddari Pellala Muddula Mogudu) అనే సినిమాతో పూజిత కి మంచి గుర్తింపు వచ్చింది. అయితే అలాంటి సీనియర్ నటి పూజిత ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.


ఆ స్టార్ హీరో నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు – పూజిత

రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పూజిత (Poojitha) మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన టైం లో ఒక బడా స్టార్ హీరో కారులో ఎక్కాను. అయితే ఆ హీరో ప్రస్తుతం చనిపోయారు. ఆయన పేరు బయట చెప్పడం ఇష్టం లేదు.అయితే నేను ఆయనతో కారులో కూర్చున్న టైం లో నా తొడల మీద చేయి వేసి గోకారు. ఎన్నిసార్లు చేయి తీసివేసినా మళ్లీ మళ్లీ అలాగే గోకారు. దాంతో కార్ దిగి ఇంటికి వచ్చి మా నాన్నకి అసలు విషయం చెప్పాను. ఎందుకు నాన్న అలా చేస్తున్నాడని చెప్పగా.. ఏం లేదు నువ్వు ఇంట్లోకి వెళ్లి స్నానం చేసి పడుకో అని చెప్పారు.ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మా ఇంటి ముందు కొత్త కార్ వచ్చింది. అంతే కాదు మా నాన్న ఆ కారులో ఎవరిని ఎక్కించుకోవద్దని చెప్పారు. ఇప్పటికి కూడా నా కారులో నేను, మా అబ్బాయి వెనకాల పెట్ డాగ్ తప్ప ఎవరిని ఎక్కించుకోము” అంటూ తెలిపింది.


క్యాస్టింగ్ కౌచ్ పై పూజిత సంచలన వ్యాఖ్యలు..

ఇక ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్(Casting Couch) గురించి మాట్లాడుతూ.. అన్ని రంగాలలో లాగే సినిమా రంగంలో కూడా ఉంటుంది. అయితే గ్లామర్ ఫీల్డ్ కావడంతో ఇది ఎక్కువగా వినిపిస్తుంది. అయితే చాలామంది కొత్తగా వచ్చే అమ్మాయిలకు ఇండస్ట్రీలో ఏం జరుగుతుందనేది తెలియదు. తెలియకుండానే వచ్చేస్తారు అంటూ చెప్పింది.ఇక యాంకర్ మీ ముందు ఎవరైనా అలా పల్లెటూరి నుండి వచ్చి ఇండస్ట్రీలో ఇబ్బంది పడ్డారా అంటే..నేను బంజారాహిల్స్(Banjarahills) పోలీసులకు చాలా ఫేమస్.ఎందుకంటే ఎవరైనా అమ్మాయిల్ని రోడ్డు మీద వేధిస్తే వాళ్లని కాలర్ పట్టుకొని కొడతాను. వినకపోతే పోలీస్ స్టేషన్ దాకా లాక్కొని పోతా.

డబ్బుంటే చాలు హీరోయిన్ అవుదాం అనుకుంటారు..

అయితే తణుకు (Tanuku)నుండి ఒక అమ్మాయి ట్రంకు పెట్టే పట్టుకొని హీరోయిన్ అవుదామని వచ్చిందట. అయితే ఆమె పెట్టె లాక్కోవడానికి కొంతమంది దొంగలు వెంట పడడంతో పోలీసులు పట్టుకున్నారు. ఇక ఆ అమ్మాయి ఎంత అడిగినా డీటెయిల్స్ చెప్పకపోవడంతో చీకటి పడటంతో పోలీసులు నాకు ఫోన్ చేసి విషయం చెప్పి నన్ను తీసుకెళ్ళమన్నారు.కానీ పోలీసుల్ని ఇంటికి తీసుకు రమ్మని చెప్పాను. ఆ తర్వాత అమ్మాయిని ఎందుకు వచ్చావని అడిగితే..నా పేరు కనకమహాలక్ష్మి(Kanaka Mahalaskhmi) హీరోయిన్ అవుదామని వచ్చాను.నా పెట్టెలో డబ్బు, బంగారం ఉంది. హీరోయిన్ అవుతాను అని చెప్పింది. దాంతో నేను షాకయ్యి హీరోయిన్ అవ్వాలంటే డబ్బులు కాదు.ఇలా ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఒకరు వచ్చి డైరెక్టర్ అని తీసుకెళ్తారు. ఇంకొకరు వచ్చి హీరో అని రూమ్ కి తీసుకెళ్తాడు.అన్ని పనులు చేయించుకున్నాక నీకు అవకాశం ఇస్తారని చెప్పాను. దాంతో ఆ అమ్మాయి నేను పద్ధతి గల కుటుంబంలో పుట్టాను.ఇలాంటి తలదించుకునే పనులు చేయను.నా దగ్గర డబ్బు ఉంది నేను హీరోయిన్ అవుతాను అని ఒకే మాట చెబుతుంది. దాంతో ఆమె మైండ్ సెట్ అర్థం చేసుకొని వెంటనే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి కబురు చేశాను. ఇక ఉదయాన్నే వాళ్లు వచ్చి తీసుకెళ్లిపోయారు.

హీరోయిన్ అవడం కోసం ఏం చేయడానికైనా సిద్ధం..

అలా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చే వాళ్ళు ఏమీ తెలియకుండానే డబ్బు ఉంటే చాలనుకొని వస్తారు.ఇక అవకాశాల కోసం కొంతమంది హీరోయిన్లు బరితెగించి వాళ్లే లొంగిపోతున్నారు. ఇంకొంతమందేమో అవకాశాలు లేకపోయినా పర్వాలేదని ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతున్నారు అంటూ ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్లు చేసింది సీనియర్ నటి పూజిత..

ALSO READ:Alia Bhatt: అలియాభట్ పీఏ అరెస్ట్.. రూ.77 లక్షలు స్వాహా చేసిన ఖిలాడి!

Related News

War 2 Pre Release Event : ఇప్పుడు అసలైన వార్… ఈ ఒక్క దాంతో కూలీని దాటేసింది

NTR: కాళ్ళ మీద పడ్డ అభిమాని.. ఎన్టీఆర్ ఏం చేసాడంటే

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

War 2 Pre release: అభిమానులపై కోప్పడిన తారక్.. ఇక్కడి నుంచి వెళ్లిపోనా అంటూ!

War 2 Pre release: నన్ను ఎవరూ ఆపలేరు.. పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చిన తారక్!

War 2 Pre release: తారక్ మీకు అన్న… నాకు తమ్ముడు.. స్పీచ్ అదరగొట్టిన హృతిక్!

Big Stories

×