Raj Tarun – Lavanya : రీసెంట్ టైమ్స్ లో చాలా విషయాలు మీడియా కంటే ముందు ఆడియన్స్ కి తెలిసిపోతుంది. ఎందుకంటే కారణం సోషల్ మీడియా. ఒకప్పుడు మీడియా వరకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం అనిపించిన విషయాలను డైరెక్ట్ గా ఫోన్ ఆన్ చేసి సోషల్ మీడియాలో పెడితే చాలు. అది కాంట్రవర్షియల్ అయితే క్షణాల్లో వైరల్ అయిపోతుంది. అలా రీసెంట్ టైమ్స్ లో బాగా వైరల్ అయిన వివాదం రాజ్ తరుణ్ లావణ్య ది.
షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలుపెట్టి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా మంచి పేరు సంపాదించుకున్నాడు రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ నటించిన మొదటి సినిమా ఉయ్యాల జంపాల మంచి సక్సెస్ అయింది. ఆ సినిమా తర్వాత కూడా రాజ్ తరుణ్ కు వరుస అవకాశాలు వచ్చాయి. సినిమా చూపిస్తా మామ, కుమారి 21ఎఫ్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించాయి.
మరోసారి లావణ్య వ్యవహారం
లావణ్య రాజ్ తరుణ్ గత కొంతకాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నారు అంటూ లావణ్య మీడియాకి వచ్చిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ కెరియర్ స్టార్టింగ్ లో వీరిద్దరూ కలిసి ఉండినట్లు ఆమె తెలిపారు. అలానే మరోవైపు రాజ్ తరుణ్ కూడా తన వెర్షన్ చెప్పుకొచ్చాడు. ఈ వివాదం భారీ స్థాయికి వెళ్లిపోయింది. కొన్ని రోజులు మీడియా ఇవే వార్తలను చూపించడం మొదలుపెట్టింది. ఇక ప్రస్తుతం మరోసారి లావణ్య వ్యవహారం తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో లావణ్య ఆడియోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీడియోలో ఓ ప్యాకెట్ చూపిస్తూ బుక్‌లో పెట్టిన లావణ్య. కళ్లద్దాల బాక్స్‌లో పెట్టమంటూ చెబుతున్నట్లున్న మరో ఆడియో. లావణ్య డ్రగ్స్ దందా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వివాదం సద్దుమణిగింది
మొదట రాజ్ తరుణ్ తనను మోసం చేశాడు అంటూ లావణ్య మీడియాకు వచ్చింది. ఆ తర్వాత తను ఏ విధంగా నష్టపోయాను అంటూ రాజ్ తరుణ్ కూడా తన వెర్షన్. మొత్తానికి కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ వివాదం సర్దుమనిగిపోయింది. ఇక ప్రస్తుతం రాజ్ తరుణ్ సినిమాలు చేస్తూ తన కెరియర్లో బిజీ అయిపోయాడు. రీసెంట్ టైమ్స్ లో రాజ్ తరుణ్ సక్సెస్ చూసి కూడా చాలా రోజులైంది. కుమారి 21ఎఫ్ సినిమా తర్వాత ఇప్పటివరకు చెప్పుకోదగ్గ హిట్ సినిమా రాజ్ తరుణ్ కు పడలేదు. కుమారి 21ఎఫ్ సినిమాను రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ప్రస్తుతం లభిస్తుంది.
మళ్లీ తెరపైకి లావణ్య వ్యవహారం
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆడియోలు, వీడియోలు
వీడియోలో ఓ ప్యాకెట్ చూపిస్తూ బుక్‌లో పెట్టిన లావణ్య.
కళ్లద్దాల బాక్స్‌లో పెట్టమంటూ చెబుతున్నట్లున్న మరో ఆడియో.
లావణ్య డ్రగ్స్ దందా చేస్తున్నట్లు ఆరోపణలు. pic.twitter.com/NO5ZCXjA6c— ChotaNews App (@ChotaNewsApp) July 10, 2025