Rajamouli: టాలీవుడ్ దర్శకతీయుడు ఎస్ ఎస్ రాజమౌళి(S.S.Rajamouli) సినిమా అంటే అంతర్జాతీయ స్థాయిలో ఆ సినిమాపై అంచనాలు ఉంటాయి. ఇక సినిమాల విషయంలో రాజమౌళి ప్రతి చిన్న విషయాన్ని ఎంత స్పష్టంగా చిత్రీకరిస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంటారు. ఇలా సినిమా చిత్రీకరణ విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తారో ఆ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్లడంలో కూడా జక్కన్నకు ఎవరు సాటిరారు. ప్రమోషన్ల కోసమే వందల కోట్లు ఖర్చు చేస్తారు అంటే ఈయన ఏ రేంజ్ లో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువెళ్తారో స్పష్టమవుతుంది. ఇక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు హీరోగా వారణాసి సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
ఈ సినిమా షూటింగ్ మరికొన్ని నెలలలో పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలోనే రాజమౌళి మరోవైపు ప్రమోషన్లను కూడా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. మెక్సికోలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించారు. ఇలా ఈ సినిమాని గ్లోబల్ రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న నేపథ్యంలో అదే స్థాయిలో ప్రమోషన్లను కూడా నిర్వహిస్తున్నారు. ఇకపోతే వారణాసి ప్రమోషన్ల విషయంలో రాజమౌళి సరికొత్త స్ట్రాటజీ ఉపయోగించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా సబ్ స్క్రిప్షన్ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఇక రాజమౌళి కూడా వారణాసి సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ సబ్ స్క్రిప్షన్ ట్రెండ్ ఉపయోగించబోతున్నారని తెలుస్తుంది. సాధారణంగా ఒక సినిమా షూటింగ్ సమయంలో మేకింగ్ వీడియోలు షూటింగ్ విశేషాలు లేదా సెలబ్రిటీల ఇంటర్వ్యూలను ప్రమోషన్ల కోసం ఉపయోగించుకుంటారు. ఉచితంగా ఇలాంటి వీడియోలనువిడుదల చేసేవారు కానీ రాజమౌళి మాత్రం ఈ విషయంలో కాస్త రూట్ మార్చారని, ట్రెండ్ ఫాలో అవుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా సబ్ స్క్రిప్షన్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో రాజమౌళి కూడా వారణాసి విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
రూ.199 లకు ప్రత్యేక ప్యాకేజ్..
ఈ సినిమాకు సంబంధించి తెరు వెనుక సెలబ్రిటీల కష్టాన్ని అలాగే బి టి ఎస్ వీడియోలను చూడాలనుకునే అభిమానుల కోసం 199 రూపాయల ధరతో ఒక ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకురాబోతున్నట్టు సమాచారం. ఇక ఇందులో ప్రియాంక చోప్రా మహేష్ బాబులకు సంబంధించిన కొన్ని ఇంటర్వ్యూలతో పాటు వారికి సంబంధించిన వీడియోలు ఫోటోలను , బయట ఎక్కడ ప్రేక్షకులకు దొరకని టెడ్ బిట్స్ వంటి వాటిని ఈ ప్యాకేజీలో తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రాజమౌళి సినిమా ప్రమోషన్లలో భాగంగా సరి కొత్త విధానాన్ని తీసుకువస్తున్నారు అంటూ కొంతమంది కామెంట్లు చేయగా మరి కొంతమంది మాత్రం ఇప్పటికే సినిమా టికెట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి సమయంలో మరి సబ్ స్క్రిప్షన్ పేరుతో డబ్బులను పోగు చేసుకోవడం ఏంటీ అంటూ మరికొందరు కూడా విమర్శలు కురిపిస్తున్నారు . మరి రాజమౌళి స్ట్రాటజీ ఎంతవరకు సక్సెస్ సక్సెస్ అవుతుందనేది తెలియాల్సి ఉంది.