Film industry: అప్పట్లో జగన్.. ఇప్పట్లో విజయ్ గెలుపుకి సంగీత ప్రముఖుల హస్తం ఏంటి? వినడానికి విడ్డూరంగా ఉందే అనే కామెంట్లు టైటిల్ చూసిన తర్వాత ఎవరికైనా అనిపిస్తుంది. కానీ అసలు నిజం తెలిస్తే మాత్రం నిజంగా అవుననే అనిపిస్తుంది. ముఖ్యంగా ఓటర్లను ఉత్తేజితం చేయాలి అంటే నాయకులు తమ ప్రసంగాలతో ప్రేక్షకులను మెప్పించడమే కాదు గీతాలతో వారి హృదయాలలోకి చొచ్చుకు పోవాలి. అలా నాయకుల తరఫున ప్రజలలో వీరికంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకురావడంలో సంగీత ప్రముఖులు పెద్ద పీట వేశారు. అందుకే నాడు జగన్ విషయంలోనూ ఇప్పుడు విజయ్ విషయంలోనూ ఇదే జరిగిందని నిపుణులు కూడా అంచనా వేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే.. నాడు 2019 ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి సింగర్ మంగ్లీ, మధుప్రియ పాడిన పాటలు ఏ విధంగా ప్రభావాన్ని చూపాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా వారిద్దరూ పాడిన పాటలు ప్రజలను చైతన్యవంతం చేశాయి. ఆ పాటలే ప్రజలలో ఉత్తేజితాన్ని నింపడమే కాకుండా జగన్ కి ఒక అవకాశం ఇవ్వాలి అనే ఆలోచనను కల్పించాయి అనే కామెంట్లు అప్పట్లో వినిపించాయి. ఇక ఆ సమయంలో జగన్ విజయకేతనం ఎగరవేసిన విషయం తెలిసిందే. 175 స్థానాలకు గానూ ఏకంగా 151 యొక్క స్థానాలను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు.
ఇక ఇప్పుడు విజయ్ కూడా అదే సంచలనం సృష్టించారనే చెప్పాలి. 2026 తమిళనాడులో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అనూహ్యంగా విజయ్ టీవీకే అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఈ ఘన విజయాన్ని పలువురు పలు విధాలుగా కీర్తిస్తున్నారు. అందులో భాగంగానే ఈ సక్సెస్ క్రెడిట్ లో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కి కూడా వాటా ఉంది. అది ఎలా అంటే దళపతి విజయ్ హీరోగా రూపొందిన తమిళ, తెలుగు చిత్రం వారసుడు. ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా 2023 సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. పైగా విజయ్ సినిమాకి సంగీతం అందించడం అదే మొదటిసారి. ఆ తర్వాత వారిద్దరి కాంబినేషన్లో మళ్లీ సినిమా రాలేదు.
అయితే విజయ్ హీరోగా వారసుడు చిత్రాన్ని తమిళంలో వారిసు పేరిట రిలీజ్ చేయగా.. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. పైగా అందులోని పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక 2024 ఫిబ్రవరి 2న విజయ్ పార్టీని స్థాపించారు. రెండేళ్లకు అంటే 2026 లో తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పోటీపడ్డారు. అయితే ఈ మధ్యకాలంలో తమన్ మాత్రం విజయ్ కి జనాల్లో ఉన్న క్రేజ్ కి తగ్గ బాణీలను సమకూర్చారు. ఆ పాటలే విజయ్ టీవీకే పార్టీ ప్రచారంలో విశేషంగా పాలుపంచుకున్నాయి.
also read:హీరో విజయ్ కారు నెంబర్ వెనుక ఉన్న రహస్యం అదేనా?
ముఖ్యంగా విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ కోసం మూడు పాటలకు బాణీలు కట్టారట థమన్ . ఆ ట్యూన్స్ కి తమిళ గీత రచయిత వివేక్ పాటలు రాయడం జరిగింది. ఇందులో “టీవీకే ఫ్లాగ్ ఆంథెం” , అలాగే “టీవీకే విజిల్ ఆంథెం”, ఇక మూడవది “ఐ యాం యువర్..విజయ్ ఐ యాం కమింగ్” ఈ మూడు పాటలకి యువత పులకించి పోయేవారు. అదే తీరున విజయ్ పార్టీని గెలిపించారు .ఇక అలా విజయ్ టీవీకే పార్టీ విజయంలో తమన్ బాణీల్లో రూపొందిన పాటలకు స్థానం ఉందని పరిశీలకులు అంటున్నారు. మొత్తానికైతే ఇలా నాయకుల గెలుపులో సంగీత ప్రముఖుల హస్తం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.