E-Paper
Advertisement

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?
Advertisement

Mithun Reddy: అన్నమయ్య జిల్లా పుంగనూరు ఘటనలపై మూడు వేర్వేరు కేసులలో ఎంపీ మిథున్‌రెడ్డి పేరును పోలీసులు నమోదు చేశారు. దీంతో మూడు కేసుల్లోనూ ఎంపీ మిథున్‌రెడ్డి పేరు ఉంది. మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ మున్సిపల్ ఛైర్మన్ కొండవీటి నాగభూషణం పేర్లు కూడా ఎఫ్‌ఐఆర్‌లలో ఉన్నట్టు సమాచారం.

రాళ్లతో దాడి..

ఇక కేసు–1 విషయానికోస్తే.. జంపాల మోహన్ నాయుడుపై దాడి చేసినందుకు మొత్తం 56 మంది పేర్లతో పోలీసులు కేసు నమోదు చేశారు. కర్రలు, ఇనుప రాడ్లు, రాళ్లతో దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కోన్నారు. ఈ ఘటనలో మోహన్ నాయుడుకు తలకు తీవ్ర గాయం అవగా మరో ఇద్దరి వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయని పోలీసులు పూర్కోన్నారు.

అనుచరులపైనా దాడి..

Advertisement

కేసు 2లో టీడీపీ నేత మధుసూదనరాయల్‌పై దాడి చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీనితో పాటుగా మరో 57 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మధుసూదనరాయల్ భార్య, అనుచరులపైనా దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నామినేషన్ పత్రాలు లాక్కున్నారని ఆము వారిపై ఫిర్యాదు చేశారు.

Also read: తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

నిషేధిత పరిధిలో..

Advertisement

కేసు–3 కి వస్తే నామినేషన్ కేంద్రం వద్ద ఫైరింగ్ ఘటనపై పోలీసుల మరో కేసు నమోదు చేశారు. ఎంపీ మిథున్‌రెడ్డి, ఆయన భద్రతా సిబ్బంది సహా మరో 49 మందిపై ఎఫ్‌ఐఆర్ పోలీసులు నమోదు చేశారు. నామినేషన్ కేంద్రం 100 మీటర్ల నిషేధిత పరిధిలోకి ప్రవేశించి.. బారికేడ్లు, గేటు ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పరిస్థితి అదుపు తప్పడంతో లాఠీఛార్జ్.. అనంతరం గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులను పోలీసులు జరిపారు. మదనపల్లె ఎస్‌డీపీవో బెతపూడి ప్రసాద్ సర్వీస్ పిస్టల్‌తో కాల్పులు జరిపినట్లు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. ఈ కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.

మూడో కేసులో..

మోత్తం ఈ మూడు కేసుల్లోనూ హత్యాయత్నం, అల్లర్లు, గాయపరచడం, బెదిరింపులకు సంబంధించిన సెక్షన్లు క్రింద మిథున్ రెడ్డి మరియు అతని వ్యక్తులపై పోలీసులు కేసు నమొదు చేశారు. మూడో కేసులో ప్రజా ఆస్తుల ధ్వంసం, పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఆరోపణలు చేశారు. మూడో కేసులో PDPP చట్టం, పోలీస్ యాక్ట్ నిబంధనల కింద కూడా కేసు నమోదనట్టు సమాచారం.

Also read: వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

Tags

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×