E-Paper
Advertisement

వారణాసి కథ లీక్ చేసిన రాజమౌళి.. సైన్స్ ఫిక్షన్ మాత్రమే కాదంటూ!

వారణాసి కథ లీక్ చేసిన రాజమౌళి.. సైన్స్ ఫిక్షన్ మాత్రమే కాదంటూ!
Advertisement

Rajamouli -Varanasi Film: టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘వారణాసి’ (Varanasi). రాజమౌళి (Rajamouli )దర్శకత్వంలో మహేష్ బాబు(Mahesh Babu) ప్రియాంక చోప్రా (Priyanka Chopra)హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా దాదాపు షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా 2027 ఏప్రిల్ ఏడవ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్లను కూడా ప్రారంభించారు. తాజాగా ఒక అంతర్జాతీయ మీడియా సమావేశంలో పాల్గొన్న రాజమౌళి వారణాసి సినిమా కథ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

వారణాసి సైన్స్ ఫిక్షన్ మాత్రమే కాదు..

వారణాసి సినిమాకు సంబంధించి ఇదివరకు వచ్చిన అప్డేట్స్ చూస్తే మాత్రం ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అలాగే ఈ సినిమాలో కొంత భాగం రామాయణ నేపథ్యంలో మైథాలజికల్ సినిమాగా కూడా ఉండబోతుందని ప్రేక్షకులు భావించారు. కానీ ఈ సినిమా కేవలం సైన్స్ ఫిక్షన్, మైథాలజికల్ మూవీ మాత్రమే కాదని ఇదొక అందమైన ప్రేమ కథ సినిమా అంటూ రాజమౌళి ఈ సందర్భంగా తెలియజేశారు.

బ్యూటిఫుల్ లవ్ స్టోరీ మూవీ..

Advertisement

ఈ సినిమా తెరపై చూస్తే సైన్స్ ఫిక్షన్ సినిమాలా అనిపించినా, ఇందులో పౌరాణిక అంశాలతో కూడిన ఫాంటసీ కథ ఉంటుందని చెప్పారు. తండ్రీకొడుకుల మధ్య అనుబంధంతో పాటు ఓ యువకుడు, యువతి మధ్య అందమైన ప్రేమకథ కూడా సినిమాలో కీలకంగా ఉంటుందని వివరించారు. దీంతో యాక్షన్, విజువల్ ఎఫెక్ట్స్‌కే పరిమితం కాకుండా భావోద్వేగాలకు కూడా పెద్దపీట వేస్తున్నట్లు రాజమౌళి తెలిపారు. ఇక ఈ సినిమా కేవలం 10 రోజులు షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది అంటూ ఈ సందర్భంగా రాజమౌళి సినిమా షూటింగ్ కి సంబంధించిన అప్డేట్ కూడా తెలియజేశారు. ఇలా ఈ సినిమాలో లవ్ స్టోరీ కూడా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేయడంతో సినిమా పట్ల మంచి అంచనాలు కూడా పెరిగిపోయాయి.

హాలీవుడ్ రేంజ్ లో పెరిగిన అంచనాలు..

ఇక మహేష్ బాబు సినీ కెరియర్ లో మొట్టమొదటిసారి రాజమౌళితో కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇదివరకు రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన RRR సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడంతో వారణాసి సినిమాకి కూడా హాలీవుడ్ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు రుద్ర అనే పాత్రలో కనిపించగా ఈయనకు విలన్ గా కుంభ పాత్రలో పృథ్విరాజ్ సుకుమారన్ సందడి చేయబోతున్నారు. ఇక మందాకిని పాత్రలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. రాజమౌళి డైరెక్షన్లో ఆయన కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ, కేల్ నారాయణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మరి ఏప్రిల్ ఏడవ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వారణాసి ఎలాంటి సంచలనాలను సృష్టిస్తుందో తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: ఖరీదైన టెస్లా కారు కొన్న సింగర్ రాహుల్.. ధర ఎంతంటే?

Related News

పెళ్లి పీటలు ఎక్కబోతున్న నటుడు తేజ సజ్జా.. అమ్మాయి ఎవరంటే?

ఖరీదైన టెస్లా కారు కొన్న సింగర్ రాహుల్.. ధర ఎంతంటే?

ఘనంగా భూమి పూజతో మొదలైన వరుణ్ తేజ్ ‘ బరి’!

ఇట్స్ అఫీషియల్.. ‘ఆదర్శ కుటుంబం’ కొత్త రిలీజ్ డేట్ లాక్!

ఆస్కార్ వేదికపై రామాయణ వరల్డ్ ప్రీమియర్.. ఎప్పుడంటే?

ఇండస్ట్రీలో విషాదం.. దేవా సోదరుడి కొడుకు మృతి!

ఆగిపోయిన ‘ప్రేమలు 2’.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్!

Big Stories

Advertisement
×