Singer Rahul Sipligunj: దసరా పండుగ అంటేనే ప్రతి ఒక్కరూ ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకుంటారు అయితే దసరా పండుగ రోజు ఏదైనా కొత్త పనులు ప్రారంభించినా, కొత్త వస్తువులు కొనుగోలు చేసిన అంతా శుభమే కలుగుతుందని భావిస్తారు. ఈ నేపథ్యంలోనే దసరా పండుగ సందర్భంగా కొత్త పనులకు శ్రీకారం చుడుతూ ఉంటారు. తాజాగా ఇండస్ట్రీకి సంబంధించి ఎన్నో కొత్త సినిమాలు పూజా కార్యక్రమాలను జరుపుకున్నాయి. అదేవిధంగా సెలబ్రిటీలు ఖరీదైన కొత్త కార్లను కూడా కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆస్కార్ అవార్డు గ్రహీత, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ (Rahul Sipligunj)సైతం కొత్త కారును కొనుగోలు చేశారు.
దసరా పండుగ సందర్భంగా ఈయన తన భార్య హరిణ్య రెడ్డి(Harinya Reddy)తో కలిసి కొత్త కారుతో దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక రాహుల్ సిప్లిగంజ్ టెస్లా కారు(Tesla Car)ను కొనుగోలు చేశారని స్పష్టమవుతుంది. ఇలా కొత్త కారుతో కలిసి ఫోటోలు దిగిన ఈ జంట ఈ ఫోటోలను తమ ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తూ…”దుర్గామాత ఆశీస్సులతో ఈ ప్రత్యేకమైన సందర్భంలో కొత్త కారును కొనుగోలు చేశామని.. అందరికీ దసరా శుభాకాంక్షలు” అంటూ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.
ఇలా రాహుల్ సిప్లిగంజ్ కొత్త కారు కొనుగోలు చేసిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడంతో సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా ఈయనకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇలా రాహుల్ కొనుగోలు చేసిన ఈ టెస్లా కారు సుమారు 70 లక్షల వరకు విలువ చేస్తుందని తెలుస్తోంది. ఇక రాహుల్ విషయానికి వస్తే గత ఏడాది హరిణ్య రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరి వివాహం గత ఏడాది నవంబర్ 27వ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. రాహుల్ కెరియర్ విషయానికి వస్తే..
రాహుల్ ప్రస్తుతం సింగర్ గా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ప్లే బ్యాక్ సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాహుల్ ఏకంగా నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు(Oscar Award) సైతం అందుకున్న సంగతి తెలిసిందే. ఇలా సింగర్ గా మంచి సక్సెస్ అందుకున్న ఈయన ప్రస్తుతం సింగింగ్ కాంపిటీషన్ కార్యక్రమాలకు జడ్జిగా వ్యవహరిస్తూనే మరోవైపు స్పెషల్ ఆల్బమ్స్ చేస్తున్నారు. అదేవిధంగా పలు వ్యాపారాలను కూడా రాహుల్ ప్రారంభించారని తెలుస్తుంది. ఇక ఈయన రెస్టారెంట్ బిజినెస్ లోకి కూడా అడుగు పెట్టబోతున్నారని ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులలో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: బాలకృష్ణతో జాగ్రత్తగా ఉండాలి..తేడా వస్తే దబిడి దిబిడే అంటున్న హీరో!