E-Paper
Advertisement

ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? బ్యాటరీ గురించి ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి!

ఎలక్ట్రిక్ కారు కొనాలనుకుంటున్నారా? బ్యాటరీ గురించి ఈ 5 విషయాలు తప్పక తెలుసుకోండి!
Advertisement

Electric Car Battery: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది ఎలక్ట్రిక్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ మెయింటెనెన్స్ ఖర్చులు, ఇంధన ఖర్చు లేకపోవడం లాంటి బెనిఫిట్స్ ఈ కార్లపై ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే, ఎలక్ట్రిక్ కారు కొనేముందు దాని బ్యాటరీ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి.  అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1.బ్యాటరీ వారంటీ ఎంతకాలం ఉంటుంది?

ఎలక్ట్రిక్ కారులో బ్యాటరీ అత్యంత ముఖ్యమై భాగం. అందుకే, కారు కొనుగోలు చేసే ముందు కంపెనీ అందించే బ్యాటరీ వారంటీని పరిశీలించాలి. కొన్ని కంపెనీలు బ్యాటరీకి నిర్దిష్ట సంవత్సరాలు, కిలోమీటర్ల వరకు వారంటీ ఇస్తాయి. ఈ వివరాలు మోడల్‌ను బట్టి మారుతాయి. వారంటీ సమయంలో బ్యాటరీలో సమస్య వస్తే ఏ పరిస్థితుల్లో ఉచితంగా రిపేర్ లేదంటే ఛేంజ్ చేస్తారో తెలుసుకోవాలి. బ్యాటరీ సామర్థ్యం ఎంత తగ్గితే వారంటీ వర్తిస్తుందనే నిబంధనలను కూడా చదవాలి.

2.ఛార్జింగ్‌కు ఎంత ఖర్చవుతుంది?

Advertisement

ఎలక్ట్రిక్ కారును నడపడానికి అయ్యే ఖర్చు ఛార్జింగ్ విధానంపై ఆధారపడి ఉంటుంది. ఇంట్లో ఛార్జింగ్ చేసుకుంటే సాధారణంగా ఖర్చు తక్కువగా ఉండవచ్చు. అయితే, మీ ప్రాంతంలోని విద్యుత్ టారిఫ్‌ను బట్టి మొత్తం ఖర్చు మారుతుంది. పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లలో ఛార్జింగ్ చేయడం సౌకర్యంగా ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఇంటి ఛార్జింగ్‌తో పోలిస్తే ఖర్చు ఎక్కువ కావచ్చు. అందువల్ల రోజూ ఎంత దూరం ప్రయాణిస్తారు? నెలకు ఎన్ని యూనిట్ల విద్యుత్ అవసరమవుతుంది? అనే విషయాలను ముందుగానే లెక్కించుకోవాలి.

3.బ్యాటరీ సామర్థ్యం ఎంత ముఖ్యం?

బ్యాటరీ సామర్థ్యాన్ని కిలోవాట్ అవర్స్ (kWh)లో కొలుస్తారు. సాధారణంగా సామర్థ్యం ఎక్కువగా ఉంటే ఒక్కసారి ఛార్జింగ్‌తో ఎక్కువ దూరం వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే, కారు బరువు, డ్రైవింగ్ వేగం, ఏసీ వినియోగం, రోడ్డు పరిస్థితులు, వాతావరణం లాంటి అంశాలు కూడా రేంజ్‌పై ప్రభావం చూపుతాయి. కంపెనీ ప్రకటించే రేంజ్‌తో పాటు వాస్తవ పరిస్థితుల్లో ఎంత దూరం ప్రయాణించవచ్చో తెలుసుకోవడం మంచిది.

4.ఇంట్లో ఛార్జింగ్ సదుపాయం ఉందా?

Advertisement

ఎలక్ట్రిక్ కారు కొనేముందు ఇంట్లో ఛార్జింగ్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందో లేదో చూడాలి. సొంత ఇల్లు లేదంటే ప్రత్యేక పార్కింగ్ స్థలం ఉంటే ఛార్జింగ్ సదుపాయం ఏర్పాటు చేయడం సులభంగా ఉండవచ్చు. అపార్ట్‌ మెంట్‌ లో నివసించే వారు మాత్రం అసోసియేషన్ అనుమతి, విద్యుత్ కనెక్షన్, పార్కింగ్ స్థలం లాంటి అంశాలను ముందుగా పరిశీలించాలి.

5.వారంటీ తర్వాత బ్యాటరీ మార్చాలంటే?

బ్యాటరీ సామర్థ్యం కాలక్రమేణా తగ్గవచ్చు. వారంటీ ముగిసిన తర్వాత బ్యాటరీని రిపేర్ చేయడం లేదంటే మార్చడం అవసరమైతే ఖర్చు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అయితే, కచ్చితమైన ఖర్చు కారు మోడల్, బ్యాటరీ మోడల్, అవసరమైన మరమ్మతులపై ఆధారపడి ఉంటుంది.

Read Also: పండుగ సీజన్ తర్వాత కార్ల ధరలు పెరుగుతాయా? కొనుగోలుదారులకు కీలక అలర్ట్..

Tags

Related News

పెట్రోల్ బైక్ మంచిదా? ఎలక్ట్రిక్ బైక్ మంచిదా? ఐదేళ్ల ఖర్చు లెక్క ఇదే!

పండుగ సీజన్ తర్వాత కార్ల ధరలు పెరుగుతాయా? కొనుగోలుదారులకు కీలక అలర్ట్..

సెప్టెంబర్‌లో అత్యధికంగా అమ్ముడైన బైక్‌లు ఇవే.. నంబర్ వన్ ఏదంటే?

పెట్రోల్ కారా? హైబ్రిడ్ కారా? ఏది కొంటే డబ్బు మరింత సేవ్ చేసుకోవచ్చు?

టీవీఎస్ To బజాజ్.. ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాల్లో టాప్‌ ఎవరంటే?

ఇండియాలో టెస్లా రోడ్‌స్టర్ బుకింగ్స్.. వామ్మో.. రిజర్వేషన్ కోసం రూ.2.50 కోట్లా?

మారుతి జిమ్నీ To మహీంద్రా థార్.. రూ.20 లక్షల లోపు పవర్‌ఫుల్ 4×4 SUVలు ఇవే!

Big Stories

Advertisement
×