E-Paper
Advertisement

Globe Trotter Event Guests : గ్లోబల్ టచ్‌తో గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్.. ఎంత మంది గెస్ట్‌లంటే ?

Globe Trotter Event Guests : గ్లోబల్ టచ్‌తో గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్.. ఎంత మంది గెస్ట్‌లంటే ?

Globe Trotter Event Guests : ఈ రోజు కోసం మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ఎస్ ఎస్ రాజమౌళి ఫ్యాన్స్ మాత్రమే కాదు.. తెలుగు సినీ లవర్స్ మాత్రమే కాదు… యావత్ భారతీయ సినిమా ఇండస్ట్రీ వెయిట్ చేస్తుంది. ఎందుకంటే.. ఈ రోజు రాజమళి – మహేష్ బాబు కాంబోలో వస్తున్న SSMB 29 మూవీ టైటిల్ లాంచ్ అండ్ మహేష్ బాబు లుక్ లాంచ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్‌ను గ్లోబ్ ట్రోటర్ అనే పేరుతో నిర్వహిస్తున్నారు.

మూవీ టీజర్ కోసం ఇప్పటికే రామోజీ ఫిల్మ్ సిటీలో ఇప్పటికే 30 ft వెడల్పు x 100 ft ఎత్తు స్క్రీన్‌తో ఓ భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. అలాగే మరిన్ని సర్ప్రైజ్‌లు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇవి పక్కన పెడితే.. ఈ ఈవెంట్‌కి ఎంత మంది గెస్టులు వస్తున్నారన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.

ఈవెంట్ కి వచ్చే గెస్టుల గురించి మాట్లాడితే… చాలా రోజుల నుంచి ఓ పేరు వినిపిస్తుంది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఈవెంట్‌కు వస్తున్నట్టు తెలుస్తుంది. అతనే వస్తే.. SSMB 29 మూవీకి హాలీవుడ్ స్థాయిలో గుర్తింపు దొరుకుతుంది. అలాగే ఇతర దేశాల సినీ లవర్స్ కన్ను కూడా ఈ సినిమాపై పడుతుంది.

గెస్టులు ఎక్కువే…

జేమ్స్ కామెరూన్‌ను పక్కన పెడితే… మన తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా చాలా మంది గెస్టులు వస్తున్నట్టు తెలుస్తుంది. రాజమౌళికి తెలుగులో చాలా మంది డైరెక్టర్లు సన్నిహిత్యంగా ఉంటారు. వాళ్లు అందరూ వస్తున్నట్టు తెలుస్తుంది. పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్, రామ్ గోపాల్ వర్మతో పాటు మరి కొంత మంది డైరెక్టర్లు కూడా ఈ స్టేజ్‌పైన కనిపించే ఛాన్స్ ఉందని సమాచారం.

ఒక తెలుగు ఇండస్ట్రీ నుంచి మాత్రమే కాదు… బాలీవుడ్‌తో పాటు ఇతర సినిమా ఇండస్ట్రీస్ నుంచి కూడా పలువురు డైరెక్టర్లు ఈ ఈవెంట్‌కి (Globe Trotter Event Guests) వస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.

మొత్తంగా ఈ ఒక్క ఈవెంట్‌తో… SSMB 29 మూవీ గ్లోబల్ రేంజ్‌లో ఉంటుందని… జక్కన్న చెప్పబోతున్నట్టు అర్థమవుతుంది. అందుకు తగినట్టు గానీ, జక్కన్న స్టైల్‌లో భారీగా ప్లాన్స్ చేస్తున్నాడు.

SSMB 29 టైటిల్ ఇదే…

ఇదిలా ఉండగా, ఈ రోజు జరిగే ఈ గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో ఇప్పటి వరకు SSMB 29 అంటూ వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ టైటిల్ ను అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారు.

మూడు నిమిషాల ఓ వీడియోలో టైటిల్ తో పాటు హీర మహేష్ బాబు లుక్‌ను కూడా రివీల్ చేయబోతున్నారు. ఇప్పటికే మహేష్ బాబు లుక్ గురించి ఓ క్లూ వచ్చింది. గతంలో మహేష్ బాబు మెడలో ఓ లాకెట్ వేసిన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ఆధారంగా మహేష్ బాబు లుక్ ఎలా ఉంటుందో… అని ఇప్పటికే కొన్ని పోస్టర్లు ఫ్యాన్స్ తయారు చేశారు.

అలాగే ఇక టైటిల్ విషయానికి వస్తే… గతంలో ఈ సినిమాకు టైటిల్‌గా గ్లోబ్ ట్రోటర్, సంచారీ, వారణాసి లాంటి పదాలు వినిపించాయి. అయితే గ్లోబ్ ట్రోటర్ అనేది సినిమా టైటిల్ కాదు… ఈవెంట్ నేమ్ అని అర్థమైంది. అలాగే సంచారీ అనేది సాంగ్. ఇక మిగిలింది వారణాసి మాత్రమే. ఇక మూవీ టైటిల్ వారణాసినే అని అంతా ఫిక్స్ అయిపోయారు. నిజానికి ఈ రోజు సాయంత్రం మూవీ నేమ్ వారణాసి అనే ఉంటుంది తెలుస్తుంది.

Related News

పెద్ది’ మూవీ రివ్యూ: రామ్ చరణ్ ఊరమాస్ జాతర.. బుచ్చిబాబు హిట్ కొట్టాడా?

పెద్ది ఓటీటీ లాక్….అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ పై క్లారిటీ వచ్చేసిందిగా!

ప్రభాస్ ‘స్పిరిట్’ లొకేషన్ సెల్ఫీ లీక్.. లుక్ చూస్తే పూనకాలే!

బన్నీ-లోకేష్ కనగారాజ్ సినిమా క్యాన్సిల్ అయిందా? …. అసలు నిజం తెలిస్తే షాకవ్వాల్సిందే!

చరణ్ ‘పెద్ది’ బాక్సాఫీస్ బ్యాటింగ్ స్టార్ట్.. సమంత, వరుణ్ తేజ్ రివ్యూస్ వైరల్.. ‘మెగా 158’ టీమ్ స్పెషల్ విష్

పెద్ది’ రిలీజ్ వేళ రచ్చ.. రామ్ చరణ్ విగ్రహంపై దారుణంగా ట్రోల్స్, క్షమాపణలు చెప్పిన ఫ్యాన్స్!

ఇది కదా క్యారెక్టర్ డెడికేషన్ అంటే! ‘పెద్ది’ గెటప్‌లో రోడ్లపై తిరిగిన జగ్గూభాయ్..

షూటింగ్ సెట్‌లో భారీ పేలుడు.. ఎస్‌జే సూర్య డ్రీమ్ ప్రాజెక్ట్‌లో ఘోర విషాదం!

Big Stories

×