Varanasi Movie:మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘వారణాసి’ నుంచి సరికొత్త అప్‌డేట్ వచ్చింది. యస్… ఏప్రిల్ 24 నుంచి 26 వరకు మెక్సికో సిటీలోని సెంట్రో బనామెక్స్‌లో జరగనున్న ‘కామిక్ కాన్ ఎక్స్‌పీరియన్స్’ (CCXP 2026) ఈవెంట్‌లో “వారణాసి టు ద వరల్డ్” (Varanasi to the World) అనే పేరుతో ఒక ప్రత్యేక విజువల్ గ్లింప్స్‌ను ప్రదర్శించనున్నాడట మన జక్కన్న.
స్పెషల్‌గా డిజైన్ చేసిన కంటెంట్
అయితే ఇది మనం రెగ్యులర్‌గా చూసే టీజర్, ట్రైలర్ లాంటిది కాదట. వరల్డ్‌వైడ్‌గా ఉండే ఆడియన్స్ కోసం స్పెషల్‌గా డిజైన్ చేసిన కంటెంట్ అని సమాచారం. పైగా దీంట్లో మనమెప్పుడూ చూడని హై క్వాలిటీ బిహైండ్ ది సీన్స్ (BTS) వీడియోలను తొలిసారిగా ఈ ఈవెంట్‌లో ప్లే చేయబోతున్నారట.ఇక ఈ ఈవెంట్‌లో జరగబోయే మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా… ‘వారణాసి’లో నటిస్తున్న హీరో, హీరోయిన్‌లతో పాటు కీలక పాత్రలు పోషించే వారి గురించి ఇందులో మరింత డీటైల్డ్‌గా వివరించబోతున్నారట. దీంతో పాటు సినిమాలో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్‌ను కూడా ఇందులో స్క్రీన్ చేసే అవకాశం ఉందట. అంటే మన కన్నా ముందే మెక్సికన్ ఆడియన్స్ మన సూపర్ స్టార్ మహేశ్ బాబు మేకోవర్‌ను చూడబోతున్నారన్న మాట.
బిజీగా ఉన్నప్పటికీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా
ఇక ఇదే విషయాన్ని లేటెస్ట్‌గా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నిమిషాల్లో వైరల్ కావడం విశేషం.ఇక ఈ క్రేజీ ఈవెంట్ కోసం స్వయంగా రాజమౌళి కొడుకు ఎస్.ఎస్ కార్తికేయ మెక్సికోలో పనులు దగ్గరుండి చూస్తున్నాడని సమాచారం. మరోవైపు జక్కన్న షూటింగ్‌లో బిజీగా ఉన్నప్పటికీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పెషల్‌గా ఫ్యాన్స్‌తో ముచ్చటించి సినిమా విశేషాలను ఎక్స్‌ప్లెయిన్ చేయనున్నాడని తెలుస్తోంది.చూడాలి మరి ఆడియన్స్ అనుకున్నట్టుగా ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సినిమాకు ఉన్న ‘టైమ్ ట్రావెల్’, ‘మైథలాజికల్’ కనెక్షన్ గురించి ఏమైనా హింట్స్ ఇస్తాడేమో.
వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా
ఇక సినిమా విషయానికి వస్తే దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె.ఎల్ నారాయణ దాదాపు 1200 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మహేశ్ బాబుకి జోడీగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా మందాకినీ పాత్రలో కనిపించనుంది.ఇక ఈ క్రేజీ ప్రాజెక్టులో మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ నెగటివ్ షేడ్ ఉన్న పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా IMAX ఫార్మాట్‌లో రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు కూడా.
మొత్తానికి నా టార్గెట్ 5000 కోట్లు అని ఫిక్స్ అయిన జక్కన్న ఇలా మెక్సికో నుంచి సినిమాకి గ్లోబల్ టచ్ ఇచ్చేలా మాస్టర్ ప్లాన్ రెడీ చేశాడన్న మాట.
also read:మురుగదాస్‌కే చుక్కలు చూపించిన సల్మాన్.. వంశీ పైడిపల్లి తట్టుకుంటాడా ?
Hola Mexico… 🇲🇽#VARANASI makes its first global appearance at #CCXPMX26 with an exclusive panel on April 24 at the Thunder Stage.
We will be showcasing our “Varanasi to the World” glimpse on the big stage…
An exclusive video message from @ssrajamouli and never seen before… pic.twitter.com/AUPyzcjNB0
— Varanasi (@VaranasiMovie) April 23, 2026