E-Paper
Advertisement

మురుగదాస్‌కే చుక్కలు చూపించిన సల్మాన్.. వంశీ పైడిపల్లి తట్టుకుంటాడా ?

మురుగదాస్‌కే చుక్కలు చూపించిన సల్మాన్.. వంశీ పైడిపల్లి తట్టుకుంటాడా ?
Advertisement

Salman Khan:  ‘సల్మాన్ ఖాన్ గనుక నా పని సరిగ్గా చేసుకోనిస్తే సికిందర్ సూపర్ హిట్ అయ్యేది’…ఇదీ సినిమా రిజల్ట్ వచ్చాక మురుగదాస్ చేసిన కామెంట్స్. ఒక టాప్ డైరెక్టర్ అంత ఓపెన్‌గా కామెంట్ చేశాడంటే సల్లూ బాయ్ డైరెక్టర్స్‌కు ఎంత ఫ్రీడమ్ ఇస్తాడో అర్థమవుతుంది. అలాంటిది ఏరి కోరి మరీ వంశీ పైడిపల్లి ఇప్పుడు సల్మాన్ ఖాన్‌తో సినిమా మొదలు పెట్టిన పరిస్థితి. దీంతో వంశీ నైనా తన పనిని తాను చేసుకోనిస్తాడా లేక అలవాటు ప్రకారమే అన్నింట్లో దూరతాడా అన్న ప్రశ్న ఫిలిం సర్కిల్స్‌లో గట్టిగానే వినిపిస్తుంది.

అందరి కళ్లు సల్మాన్ ఖాన్ మీదే.

Advertisement

నిజానికి సినిమా సెట్ అయి మొదలైందని దిల్ రాజు అండ్ కో బయటికి హ్యాపీగానే ఫీల్ అవుతున్నా, లోపల ఎక్కడో సినిమా జరిగే ప్రాసెస్ ఎలా ఉంటుందా అంటూ తెగ టెన్షన్ పడిపోతున్నారట. ఇక తాజాగా ఈరోజే ముంబై గోరేగావ్‌లోని ఎస్.ఆర్.పి.ఎస్ గ్రౌండ్స్‌లో రెగ్యులర్ షూటింగ్ గ్రాండ్‌గా మొదలైంది. మొదటి రోజే ఒక భారీ ఇంటి సెట్‌లో కీలక సన్నివేశాలు ప్లాన్ చేశాడట వంశీ. ఇందులో నయనతార, అనిల్ కపూర్ వంటి భారీ స్టార్ క్యాస్ట్ ఉన్నప్పటికీ అందరి కళ్లు సల్మాన్ ఖాన్ మీదే ఉన్నాయి.

అసలే టాలీవుడ్ టైమింగ్స్‌కు బాలీవుడ్ టైమింగ్స్‌కు చాలా తేడా ఉంటుంది. పైగా సల్మాన్ షూటింగ్స్‌కు ఆన్ టైమ్ రాడన్న పేరుంది. ఇక మొదటి రోజు పర్లేదనిపించిన సల్మాన్ ఇలాగే రెగ్యులర్‌గా టైమ్‌కు వస్తాడా? వంశీ చెప్పినట్టు యాక్ట్ చేస్తాడా? అన్నది ఇప్పుడు మేకర్స్‌ను వేదిస్తున్న పెద్ద ప్రశ్న.

Advertisement

సల్మాన్ దొరకడం వరమా? శాపమా?

నిజానికి మన స్టార్ డైరెక్టర్స్ ఎవరైనా అనుకుని ఉంటే ఈపాటికే సల్లూ భాయ్‌తో ఓ సినిమా తీసేసేవారు. అలాంటిది ఎవరూ కనీసం సినిమా తీయాలన్న ఆలోచన చేయకపోవడం బట్టి చూస్తే వారందరికీ సల్లూ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో ఒక క్లారిటీ వచ్చేసి ఉండాలి. అయితే మూడేళ్లు బాలీవుడ్ బాబులే నాక్కావాలి అంటూ భీష్మించుకుని కూర్చున్న వంశీకి సల్మాన్ దొరకడం వరమా శాపమా అన్నది సినిమా పూర్తయి బయటికి వస్తే కాని తెలీదు.

సినిమా కోసం ఏకంగా 500 కోట్లకు పైగా బడ్జెట్

నిజానికి వంశీకి పర్ఫెక్షన్ ఎక్కువ. ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో జాగ్రత్తగా చెక్కుతాడు. కానీ సల్మాన్ స్టైల్ వేరు. తను అనుకున్నాడంటే అది జరిగి తీరాలి. మురుగదాస్ లాంటి కమర్షియల్ డైరెక్టర్ కూడా సల్మాన్‌ను హ్యాండిల్ చేయలేక చేతులెత్తేస్తే, వంశీ పైడిపల్లి పరిస్థితి ఏంటి? అన్న చర్చ ఇండస్ట్రీలో జోరుగా సాగుతోంది.

మరోవైపు దిల్ రాజు ఈ సినిమా కోసం ఏకంగా 500 కోట్లకు పైగా బడ్జెట్ పెడుతున్నాడని ఇండస్ట్రీలో టాక్. పైగా వచ్చే 2027 ఈద్ నాటికి రిలీజ్ చేయాలనేది టార్గెట్ కూడా ఫిక్స్ చేశారట. అసలే వరుస ఫ్లాపులతో సల్లూ భాయ్ మార్కెట్ ఫుల్ డల్‌గా కనిపిస్తుంది. అలాంటిది ఈ సమయంలో దిల్ రాజు ఇంత భారీ బడ్జెట్‌తో సినిమా ప్లాన్ చేయడమంటే అది పెద్ద రిస్కే.

చూడాలి సల్లూ భాయ్ మారిపోయి వంశీకి సహకరిస్తాడా, లేక అలవాటు ప్రకారం అన్నింట్లో వేలెడతాడా అన్నది కాలమే డిసైడ్ చేయాలి.

.

also read :చిత్ర పరిశ్రమలో తీరని విషాదం.. గుండెపోటుతో 30 ఏళ్లకే ప్రముఖ నటి మృతి!

Related News

టాలీవుడ్ లో నేషనల్ అవార్డు అందుకున్న తొలి చైల్డ్ ఆర్టిస్ట్ ఎవరంటే?

భాయ్ చిక్కిపోయాడని ఏడ్చేసిన ఫ్యాన్స్.. రివర్స్ సెటైర్ వేసిన సల్మాన్ !

రికార్డుల వేటలో ‘ది ఒడిస్సీ’..మన మేకర్స్ ఇప్పటికైనా మారతారా?

విదేశాల్లో షాట్లు.. ఏపీలో ఓట్లు! టాలీవుడ్ స్టార్స్‌పై అంబికా కృష్ణ మార్కు కౌంటర్లు!

‘టాక్సిక్’ దెబ్బకి ప్లాన్స్ ఛేంజ్? రవితేజ ‘ఇరుముడి’ రిలీజ్ డేట్‌పై లేటెస్ట్ అప్‌డేట్!

మగాళ్ల హత్యల పై షాకింగ్ కామెంట్స్.. కొడుకు కోసం ఆందోళన పడుతున్న కాజల్..

నేను దేశ ద్రోహిని కాదు.. బీజేపీ తీరుపై నటుడు నరేష్ ఫైర్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

Big Stories

Advertisement
×