E-Paper
Advertisement

Telangana Budget 2026: తెలంగాణ బడ్జెట్‌లో కొత్త పథకం.. విద్యార్థులకు తీపి కబురు, ఆపై ఇంటర్, ఐటీఐల్లో

Telangana Budget 2026: తెలంగాణ బడ్జెట్‌లో కొత్త పథకం.. విద్యార్థులకు తీపి కబురు,  ఆపై ఇంటర్, ఐటీఐల్లో
Advertisement

Telangana Budget 2026: 2026 ఏడాదికి తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన విద్యార్థులకు తీపి కబురు చెప్పింది. అందుకోసం కొత్త పథకం ప్రవేశ పెట్టింది. దీనివల్ల ఇంటర్, ఐటీఐ, ఏటీసీలలో చదివే విద్యార్థులకు చల్లటి కబురు చెప్పేసింది. నెలకు రూ. 2000 చొప్పున ఉపకార వేతనాలు ఇవ్వనుంది.

తెలంగాణ బడ్జెట్‌లో ఇంటర్, ఐటీఐ విద్యార్థులకు కొత్త పథకం

Advertisement

మొత్తం రూ.3,24,234 లక్షల కోట్లతో బడ్జెట్‌లో ఈసారి విద్యాశాఖకు పెద్దపీట వేసింది ప్రభుత్వం. ఈసారి విద్యాశాఖకు రూ.26,674 కోట్లను కేటాయించింది. అంతేకాదు విద్యార్థుల సంక్షేమం కోసం కొత్త పథకాలను ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఇంటర్, ఐటీఐ చదువుతున్న విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.

తమ ప్రభుత్వంలో యువతకు మంచి చదువు అందిస్తామని పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. అందుకు తగిన విధంగా 2026 బడ్జెట్‌లో రెండు పథకాలు అందజేస్తున్నట్లు ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలకు పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని, రానున్న రోజుల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

Advertisement

ఐటీఐ విద్యార్థులకు నెలకు 2 వేలు స్కాలర్ షిప్

అంతేకాదు ఐటీఐ, ఏటీసీలలో చదివే విద్యార్థులకు ప్రతీ నెలా రూ.2,000 చొప్పున స్కాలర్ షిప్‌లు అందించనున్నట్లు తెలిపారు. ఒకవిధంగా చెప్పాలంటే చదువుకునే విద్యార్థులకు తీపి కబురు అని చెప్పాలి. విద్యార్థులకు భరోసా కల్పించేలా  రెండు పథకాలను ఆయన ప్రకటించారు. తెలంగాణ వ్యాప్తంగా 430 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి.

అందులో 1.72లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు పెరిగేలా ఇంటర్ బోర్డు ప్రత్యేక దృష్టి సారించింది.ఈ విద్యా సంవత్సరంలో గతేడాదితో పోలిస్తే దాదాపు 11వేల అడ్మిషన్లు పెరిగాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ కాలేజీల్లో అడ్మిషన్లు పెంచేందుకు అప్పుడే కసరత్తు మొదలు పెట్టింది. ఈలోగా బడ్జెట్‌లో భోజనం పథకాన్ని ఇంటర్ వరకు పొడిగిస్తున్నట్లు చెప్పారు ఆర్థికమంత్రి.

ALSO READ: వాళ్ళ పని ఆపడం.. మా పని పూర్తి చేయడమే!

తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ ఐటీఐలు 30 వరకు ఉన్నాయి. దీనికి రెట్టింపుగా ప్రైవేటు ఐటీఐలు ఉన్నాయి. దాదాపు వేలాది మంది విద్యార్థులు అందులో చదువుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన స్కాలర్ షిప్ వారికి లబ్ది చేకూరనుంది. దీనివల్ల ఈ ఏడాది అడ్మిషన్లు అందులో పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.

https://twitter.com/bigtvtelugu/status/2034910358193012975

 

Related News

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

గవర్నర్‌కు సీఎం రేవంత్ లేఖ.. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ

Big Stories

Advertisement
×