E-Paper
Advertisement

Kavitha New Party: కవిత పెట్టబోయే పార్టీ పేరు ఇదే.. ఈ వారంలో జెండా, గుర్తులపై క్లారిటీ?

Kavitha New Party: కవిత పెట్టబోయే పార్టీ పేరు ఇదే.. ఈ వారంలో జెండా, గుర్తులపై క్లారిటీ?
Advertisement

Kavitha New Party: స్వేచ్ఛ, బ్యూరో: కవిత ప్రకటించబోయే పార్టీపేరు ఖరారైంది. పలుపేర్లు కేంద్ర ఎలక్షన్ కమిషన్ కు పంపగా అందులో తెలంగాణ ప్రజాజాగృతి పేరు ఫిక్స్ అయింది. ఇక ప్రకటనే తరువాయి.ఈ పేరుకు కవిత సమూకంగా ఉండటంతో ఈసీ సైతం ఫైనల్ చేసినట్లు జాగృతి నేతలు అభిప్రాయపడుతున్నారు. జెండా, ఎజెండాకోసం కవిత కసరత్తు ప్రారంభించారు. ప్రతి రోజూ జాగృతి అనుంబంధ సంఘాలతో భేటీ అవుతూ అభిప్రాయాలను స్వీకరిస్తున్నారు. మరోవైపు మేధావుల నుంచి సైతం సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. వారంలో జెండా ఖరారు కానున్నట్లు విశ్వసనీయ సమాచారం.

తెలంగాణలో మరో పార్టీ ఆవిర్భవించబోతుంది. బీఆర్ఎస్ పార్టీ కవితను గతేడాది సెప్టెంబర్ 2న సస్పెండ్ చేసింది. కవిత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు, బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించింది. దీనిని సీరియస్ గా తీసుకున్న కవిత జాగృతి యాక్టివిటీస్ ను స్పీడప్ చేసింది. మరోపార్టీ పార్టీని పెడుతున్నట్లు ప్రకటించింది. జాగృతి జనంబాటయాత్రకు శ్రీకారం చుట్టింది. ప్రజాసమస్యలపై పోరాటకార్యక్రమాలు నిర్వహిస్తుంది. అయితే ఆమె ఇప్పటికే మే ఫస్ట్ వారంలో లేక సెకండ్ వారంలో పార్టీని ప్రకటించబోతున్నట్లు ఇప్పటికే పలు సందర్భాల్లోనూ ప్రకటించారు. కొత్త పార్టీ ఏర్పాటు విషయంలో వేగంగా అడుగులు వేస్తున్నారు. కవిత స్థాపించనున్న కొత్త రాజకీయ పార్టీ పేరు ఖరారైంది.

Advertisement

Also ReadGundeninda GudiGantalu Today episode: తాగొచ్చి ఇంటిముందు అన్నదమ్ముల రచ్చ.. ప్రభావతికి దిమ్మతిరిగే షాక్.. రోహిణి ప్లాన్ అట్టర్ ప్లాప్..

23న ఈ పార్టీ పేరిట రిజిస్ట్రేషన్

‘తెలంగాణ ప్రజా జాగృతి’ పేరుతో పొలిటికల్ పార్టీని ఆమె ఏర్పాటు చేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ జనజాగృతి ఇలా మరో రెండుపేర్లను ఎన్నికల సంఘానికి ఈ ఏడాది జనవరి 23న ఈ పార్టీ పేరిట రిజిస్ట్రేషన్ కోసం కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తును పరిశీలించిన ఎన్నికల సంఘం.. అందులో పలు సాంకేతిక లోపాలు ఉన్నాయని అభ్యంతరం తెలిపింది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951‌లోని సెక్షన్ 29ఎ కింద రాజకీయ పార్టీ నమోదు కోసం చేసిన దరఖాస్తును కేంద్ర ఎన్నికల సంఘం వేగంగా పరిశీలించి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ కల్వకుంట్ల కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కానీ, కవిత చేసుకున్న దరఖాస్తులో పలు లోపాలు ఉన్నాయని ఫిబ్రవరి 23నే ఆమెకు సమాచారం పంపించినట్లు ఈసీఐ తరుపు న్యాయవాది ఫిబ్రవరి 27న విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. కవిత తరుపు లాయర్ గైర్హాజరీ కారణంగా విచారణను వాయిదా వేయాలని కోరడంతో కేసు గురువారం (మార్చి 19)కి వాయిదా పడగా.. విచారణ చేసిన కోర్టు ఈసీఐని తక్షణమే పార్టీపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. దీంతో పార్టీ రిజిస్ట్రేషన్ సుగమం అయింది.కేంద్ర ఎన్నికల సంఘానికి 151 మంది కార్యకర్తల అపిడవిట్లను అందజేసింది. జనరల్ బాడీ సమావేశం వివరాలను సైతం అందజేశారు. అయితే త్వరలోనే అఫిడవిట్లు దాఖలు చేసిన కార్యకర్తల నుంచి సైతం ఈసీఐ వివరాలు తీసుకోనున్నట్లు సమాచారం.

ఎజెండా ఖరారుకు కసరత్తు

Advertisement

పార్టీపేరుదాదాపు ఖరారు కావడంతో పార్టీ జెండా, ఎజెండా ఎలా ఉండాలనేదానిపై కవిత కసరత్తు ప్రారంభించారు. జాగృతి 50 అనుబంధ కమిటీల నుంచి రిపోర్టు తెప్పించుకొని అధ్యయనం చేస్తున్నారు. ఏయే వర్గాలకు సంబంధించిన అంశాలు పార్టీ ఎజెండాలో ఉండాలనేదానిపై అనుబంధ కమిటీ సభ్యుల నుంచి సలహాలు, సూచనలు తెలుసుకుంటున్నారు. ప్రతి రోజూ కమిటీలతో భేటీ అవుతున్నారు. మరోవైపు మేధావులతోనూ సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ మేనిఫెస్టో ఎలా ఉండాలి.. బైలాస్.. విధివిధానాలపై అధ్యయనం చేస్తున్నారు. గతంలో పార్టీల్లో క్రీయాశీలకంగా పనిచేసిన సీనియర్ నేతల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తున్నారు. అన్నిపార్టీల మాదిరిగా కాకుండా క్షేత్రస్థాయిలో అన్ని వర్గాల ప్రజల ఇబ్బందులు పరిష్కరించేలా ఉండాలని ఎజెండాకోసం ముమ్మర కసరత్తు చేస్తున్నారు.

ఆకుపచ్చ జెండా..రైతునాగలి

కవిత పార్టీకి జెండా ఆకుపచ్చకలర్ లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఆ జెండాపై రైతు..నాగలి, మహిళ ప్రతిబింబం సైతం ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు సమచారం. ఈ వారం..పది రోజుల్లో జెండాపై క్లారిటీ రానున్నట్లు సమాచారం. తెలంగాణలో రైతులు , మహిళలు ఎక్కువగా ఉండటంతో వారి కేంద్రంగానే పార్టీ జెండా రూపొందిస్తున్నట్లు సమాచారం. మే ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ లో పార్టీని కవిత ప్రకటిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.

నాకు ఎవరితోనూ రాజీ లేదు..  కవిత

మా కొత్త పార్టీ సక్సెస్ అవుతుంది..పార్టీ అజెండాపై కసరత్తు జరుగుతుంది అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మీడియాతో గురువారం చిట్ చాట్ చేశారు. మంచి ముహూర్తం చూసుకుని కొత్త పార్టీ ప్రకటిస్తానన్నారు. గాంధీజీ సర్వోదయ సిద్దాంతాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. డాడీ,మోడీ, చిన్న మోడీపై నా పోరాటం ఉంటుందని ప్రకటించారు. నాకు ఎవరితోనూ రాజీ లేదని స్పష్టం చేశారు. పార్టీ పేరు విషయంలో టెక్నికల్ అంశాలు అన్ని సెట్ అవుతాయని, బీఆర్ఎస్ పార్టీతో నా ఇష్యూను కాంగ్రెస్,సీఎం రేవంత్ అడ్వాంటేజ్ గా తీసుకొంటున్నారన్నారు. అసెంబ్లీలో సైతం కాంగ్రెస్ నేతలు నా ఇష్యూను వాడుకుంటున్నారన్నారు.

శ్రీరామనవమి తర్వాత కొత్త పార్టీ ప్రకటన ముందే జాతీయ స్థాయి నేతలను కలవాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు. చాలా మంది జాతీయ నేతలతో నాకు మంచి పరిచయాలు ఉన్నాయని, నూతన పార్టీ కేంద్ర కార్యాలయం కోసం ల్యాండ్ చూస్తున్నామన్నారు. నాకు బేషజాలు లేవు. అందరిని కలుపుకుపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మంలో మా కొత్త పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. ఉద్యమంలో పనిచేసిన యువతకు అవకాశం ఇస్తామన్నారు. కొత్త పార్టీలో కొత్త తరాన్ని ప్రోత్సహిస్తామన్నారు. దక్షిణ తెలంగాణనా,ఉత్తర తెలంగాణనా కాదు.. చాలా చోట్ల నుంచి నన్ను పోటీ చేయాలని కోరుతున్నారన్నారు. రీసెంట్ గా వనపర్తి నుంచి పోటీ చేయాలని జాగృతి కార్యకర్తలు కోరినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో మా పార్టీ ప్రభావం ఉంటుందన్నారు. నేను బీఆర్ఎస్ కు దూరం అయిన తర్వాత నిజామాబాద్ జిల్లాలో గులాబీ పూర్తిగా నష్టపోయిందన్నారు.భవిష్యత్తులో విశారదన్,ప్రజా సంఘాలు,సీపీఎం,సీపీఐఎం ఎల్ న్యూడెమొక్రసీ పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని ప్రకటించారు. భవిష్యత్తులో మా పోరాటాలు వెలుగుమట్ల తరహాలో ఉంటాయని వెల్లడించారు.

Also ReadRohith Reddy Drug Case: రోహిత్ రెడ్డి డ్రగ్స్ కేసులో బీఆర్ఎస్‌కు తలనొప్పి.. షోకాజ్‌తో సరిపెడతారా? లేక సస్పెండ్ చేస్తారా?

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×