E-Paper
Advertisement

Mangli Controversy: మంగ్లీకి ‘మైక్రో’ సెగ! సింగర్ పేరుతో కోట్లలో వసూళ్లు..అసలు గుట్టు ఇదేనా!

Mangli Controversy: మంగ్లీకి ‘మైక్రో’ సెగ! సింగర్ పేరుతో కోట్లలో వసూళ్లు..అసలు గుట్టు ఇదేనా!
Advertisement

Mangli Controversy: టాలీవుడ్ సెన్సేషనల్ సింగర్ మంగ్లీ ఇప్పుడు ఒక భారీ వివాదంలో చిక్కుకుంది. తన పాటలతో స్టేజిని ఊపేసే ఈ జానపద గాయని, ఇప్పుడు ‘మైక్రో ఫైనాన్స్’ మోసాల వ్యవహారంతో వార్తల్లో నిలిచింది. మంగ్లీ పేరు చెప్పి కొందరు కేటుగాళ్లు అమాయక ప్రజల దగ్గర అడ్డగోలుగా డబ్బులు వసూలు చేశారనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తోంది. ఈ వ్యవహారం ముదురుతుండటంతో, మంగ్లీ హుటాహుటిన ఒక బహిరంగ లేఖను విడుదల చేసి తన ‘క్లీన్ చిట్’ ఇచ్చుకునే ప్రయత్నం చేసింది.

also read:Dhurandhar 2: టాలీవుడ్‌కి ‘ధురంధర్ 2’ చెక్! బాహుబలి, RRR రికార్డులు గాల్లో దీపాలేనా?

Advertisement

కరెన్సీ కట్టల వీడియోలు.. మంగ్లీ ఫ్యామిలీకి లింక్?
సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా కరెన్సీ కట్టలకు సంబంధించిన కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ డబ్బుకు, మంగ్లీ ఇంటికి సంబంధం ఉందంటూ నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. దీనిపై మంగ్లీ ఫైర్ అయ్యింది. “ఆ వీడియోలకు, మా ఇంటికి ఏమాత్రం సంబంధం లేదు” అంటూ తెగేసి చెప్పింది. అయితే, అసలు ఫైనాన్స్ వ్యాపారులతో మంగ్లీకి ఉన్న రిలేషన్ ఏంటి? కేవలం ఈవెంట్ల కోసమే కలిశారా? లేక లోపల ఇంకేదైనా జరిగిందా? అనే అనుమానాలు మాత్రం ఆగడం లేదు.

తమ్ముడి పేరు బయటకి.. కావాలనే టార్గెట్ చేస్తున్నారా?
ఈ వివాదంలో మంగ్లీ తన తమ్ముడి పేరును కూడా ప్రస్తావించడం గమనార్హం. “ప్రొఫెషనల్ ఈవెంట్స్ కోసం నన్ను, నా తమ్ముడిని రోజు చాలా మంది సంప్రదిస్తుంటారు.. అంతకు మించి మాకు ఎవరితోనూ పర్సనల్ బిజినెస్ డీలింగ్స్ లేవు” అని మంగ్లీ స్పష్టం చేసింది. తన పేరు ప్రఖ్యాతులకు భంగం కలిగించేలా కొందరు పనిగట్టుకుని ఈ దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. కానీ, ఒక సెలబ్రిటీ పేరు చెప్పి కోట్లు వసూలు చేస్తున్నారంటే, ఆ కేటుగాళ్లకు మంగ్లీతో ఉన్న యాక్సెస్ ఏంటనేది ఇప్పుడు హాట్ టాపిక్!

Advertisement

పోలీసులకు రిక్వెస్ట్.. మోసపోయిన వారి పరిస్థితి ఏంటి?
“నా పేరు చెప్పి ఎవరైనా డబ్బులు అడిగితే నమ్మకండి.. అలా మోసపోయిన వారికి న్యాయం చేయాలని పోలీస్ డిపార్ట్‌మెంట్‌ను కోరుతున్నాను” అంటూ మంగ్లీ రిక్వెస్ట్ చేసింది. అంటే, ఇప్పటికే మంగ్లీ పేరు మీద పెద్ద ఎత్తున వసూళ్లు జరిగాయని ఆమె పరోక్షంగా ఒప్పుకున్నట్టేనా? అన్న చర్చ మొదలైంది. ఒకవైపు స్టార్ సింగర్‌గా వెలుగుతున్న సమయంలో ఇలాంటి ‘చిల్లర’ ఫైనాన్స్ గొడవల్లో పేరు రావడం మంగ్లీ కెరీర్‌కు పెద్ద మైనస్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.మొత్తానికి మంగ్లీ అయితే లెటర్ రాసి తన గోడు వెళ్లబోసుకుంది. కానీ, బాధితులు మాత్రం మంగ్లీని చూసే డబ్బులు ఇచ్చామని గగ్గోలు పెడుతున్నారు. పోలీసులు రంగంలోకి దిగితే తప్ప ఈ ‘మైక్రో ఫైనాన్స్’ మాయాజాలంలో అసలు దొంగలెవరో, మంగ్లీ పాత్ర ఎంత ఉందో తేలదు. ఈ వివాదం మంగ్లీ ఇమేజ్‌ను ఎంతవరకు డ్యామేజ్ చేస్తుందో వేచి చూడాలి!

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×