Rajashekhar: టాలీవుడ్ సినిమా సీనియర్ హీరోగా అద్భుతమైన సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో యాంగ్రీ హీరో రాజశేఖర్ (Rajashekhar)ఒకరు. ఈయన ఒకానొక సమయంలో వరుస సూపర్ హిట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓ వెలుగు వెలిగారు. ఇటీవల కాలంలో రాజశేఖర్ సినిమాలను పూర్తిగా తగ్గించారని చెప్పాలి. అయితే ఈయన మొదటిసారి హీరోగా కాకుండా ఒక కీలక పాత్రలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బైకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజశేఖర్ ఈ సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్నాయి.
బైకర్ సినిమా మంచి సక్సెస్ కావడంతో రాజశేఖర్ ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన తన కెరియర్ లో మిస్ చేసుకున్న సినిమాల గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు. అయితే రాజశేఖర్ మిస్ చేసుకున్న సినిమాలలో చిరంజీవి(Chiranjeevi) నటించిన బ్లాక్ బస్టర్ సినిమా ఉండటం విశేషం. మరి చిరంజీవి నటించిన ఏ సినిమాని రాజశేఖర్ వదులుకున్నారు అనే విషయానికి వస్తే..
చిరంజీవి శ్రేయ హీరో హీరోయిన్లుగా నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ఠాగూర్(Tagore). ఈ సినిమా లంచగొండినీ రూపుమాపే నాయకుడు నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇలాంటి సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాని రాజశేఖర్ మిస్ చేసుకున్నారనే విషయాన్ని తెలియజేయడంతో అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అసలు రాజశేఖర్ ఇలాంటి సినిమాని ఎందుకు మిస్ చేసుకున్నారనే విషయానికి వస్తే.. ఠాగూర్ సినిమా తమిళ రీమేక్ సినిమా కావటం విశేషం.
మోసం చేసిన నిర్మాత..
తమిళంలో రమణ అనే పేరుతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తెలుగు హక్కుల కోసం రాజశేఖర్ అడ్వాన్స్ ఇచ్చినప్పటికీ ఈ సినిమా నిర్మాత తన స్నేహితుడు కావడంతో అగ్రిమెంట్ కుదుర్చుకోలేదట. ఇదే అదునుగా భావించిన నిర్మాత మధు రాజశేఖర్ ఇచ్చిన దానికంటే మరింత ఎక్కువ డబ్బులు ఇచ్చి ఈ సినిమా హక్కులను కైవసం చేసుకున్నారట.. ఇలా అగ్రిమెంట్ చేసుకోని నేపథ్యంలో ఠాగూర్ సినిమా కాస్త రాజశేఖర్ చేతుల నుంచి వేరే నిర్మాత చేతికి వెళ్లడంతో ఈ సినిమాలో చిరంజీవి నటించి సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఇలా స్నేహితుడని నమ్మినందుకు సదురు నిర్మాత రాజశేఖర్ ను మోసం చేయటం వల్లే ఠాగూర్ సినిమా చేయలేకపోయారని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన రాజశేఖర్ అభిమానులు నిజంగా బ్యాడ్ లక్ ఈ సినిమా కనుక రాజశేఖర్ చేసి ఉంటే ఆయన కెరియర్ మరోలా ఉండేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: కామెడీ చేయడానికి నేను కమెడియన్ కాదు… సత్య జెట్లీ ట్రైలర్ రిలీజ్!