Jetlee Trailer: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో సత్య ఒకరు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో స్టార్ హీరోలతో కలిసి నటించిన ఈయన తన కామెడీతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించారు. ఇలా కమెడియన్ గా కొనసాగుతున్న సత్య త్వరలోనే వెండితెరపై హీరోగా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే. సత్య, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలలో జెట్లీ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మైత్రి మూవీ మేకర్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రితేష్ రానా(Ritesh Rana) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందం తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.1:51 నిమిషాల నిడివితో ఉన్న ఈ ట్రైలర్ అధ్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ వీడియోలో సత్య కామెడీ టైమింగ్స్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నాయని చెప్పాలి. ఇక ఈ ట్రైలర్ భాగంగా మతిమరుపు ఉన్న వ్యక్తిగా సత్య చేసే కామెడీ, ముఖ్యంగా ఈ చిత్ర కథ మొత్తం విమానంలో జరగడంతో అందులో సత్య ఎలాంటి ఫన్ ఇవ్వబోతున్నారనేది ట్రైలర్ ద్వారా చూపించారు. ఇందులో సత్య కామెడీ చేయడానికి నేనేమైనా కమెడియన్ నా అంటూ చెప్పే డైలాగ్ కూడా ఆకట్టుకుంది.
ఈ ట్రైలర్ చూస్తుంటే ఇదొక అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా అనిపిస్తోంది. కాల భైరవ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉందని చెప్పాలి. ఈ సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది. ఈ ట్రైలర్ వీడియో చూస్తుంటే సత్య హీరోగా మంచి సక్సెస్ అందుకోబోతున్నారని స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమా మే ఒకటవ తేదీ ఏ విధమైనటువంటి పెద్ద సినిమాలతో పోటీ లేకుండా విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ విషయం కాస్త కలిసొచ్చే అంశం అని చెప్పాలి. ఈ సినిమాకు పూర్తిగా పెద్ద సినిమాలు విడుదల కాకపోయినా తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం మాత్రం పోటీగా విడుదల కాబోతోంది.
ఇలా ఎన్నో అంచనాల నడుమ సత్య హీరోగా నటించిన జెట్లీ ప్రేక్షకుల ముందుకు వస్తూ సమ్మర్లో ఫుల్ ఎంటర్టైన్ అందించబోతుందని అభిమానులు భావిస్తున్నారు.ఈ సినిమాతో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఫన్ గ్లింప్స్, సత్య ఈజ్ నాట్ జెట్లీ ప్రమోషనల్ సాంగ్స్ మంచి అంచనాలను పెంచాయి. ఇక ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్ కూడా కీలక పాత్రలో కనిపించబోతుండడం విశేషం. మరి కమెడియన్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ప్రేక్షకులను మెప్పించిన సత్య హీరోగా ఎలాంటి సక్సెస్ అందుకుంటారు అనేది తెలియాల్సింది.
Also Read: స్టార్ హీరోలు తమ కూతుర్లను ఇండస్ట్రీకి అందుకే పంపరా? షాకింగ్ విషయాలు చెప్పిన జేడీ!