E-Paper
Advertisement

కమెడియన్ సునీల్ కూతురికి పునర్జన్మనిచ్చిన హీరో రాజశేఖర్.. అసలేం జరిగిందంటే?

కమెడియన్ సునీల్ కూతురికి పునర్జన్మనిచ్చిన హీరో రాజశేఖర్.. అసలేం జరిగిందంటే?
Advertisement

Rajashekhar: సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాను అంటూ చెబుతూ ఉంటారు కానీ కొంతమంది డాక్టర్లు మాత్రం తమ వృత్తిని కాస్త పక్కన పెట్టి యాక్టర్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలా డాక్టర్ చదువు చదివి ఎంతో మంది ప్రాణాలను కాపాడి ప్రస్తుతం వెండితెరపై తమ నటనతో ప్రేక్షకులను మెప్పిస్తున్న వారిలో సీనియర్ నటుడు రాజశేఖర్ ఒకరు. ఈయన వృత్తిపరంగా వైద్యుడు అనే సంగతి మనకు తెలిసిందే. కొన్ని సంవత్సరాల పాటు డాక్టర్ గా ప్రాక్టీస్ చేసిన రాజశేఖర్ నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

సునీల్ కుమార్తెకు పునర్జన్మ..

ఇలా ఈయన ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నప్పటికీ అవసరమైనప్పుడు తన వైద్యవృత్తిని నిర్వహిస్తూ వచ్చేవారు. ఇక రాజశేఖర్ కెరియర్ విషయానికి వస్తే హీరోగా ఒకానొక సమయంలో వరుస హిట్ సినిమాలలో నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇటీవల హీరోగా సినిమాలను పక్కనపెట్టి కీలక పాత్రలలో నటిస్తున్నారు. శర్వానంద్ హీరోగా నటించిన బైకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరో తండ్రి పాత్రలో రాజశేఖర్ నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది ఈ నేపథ్యంలోనే రాజశేఖర్ వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.

నోట్లో నుంచి నురుగా.. బ్యాడ్ కండిషన్..

Advertisement

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజశేఖర్ తనకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియజేశారు. ప్రముఖ నటుడు కమెడియన్ సునీల్ (Sunil)కుమార్తెను తాను కాపాడాను అంటూ రాజశేఖర్ తెలిపారు. తాము చెన్నైలో ఉన్నప్పుడు ఒక క్లినిక్ పెట్టుకున్నామని తెలిపారు. అయితే ఓ రోజు సాయంత్రం నటుడు సునీల్ తన 16 సంవత్సరాల కూతురిని నా దగ్గరకు తీసుకువచ్చారు. ఆ సమయంలో ఆ అమ్మాయి ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. నోట్లో నుంచి నురగ కూడా వస్తుంది. తన కండిషన్ చూస్తే చాలా బాడ్ స్టేజ్ లో ఉంది అయితే లక్కీగా ఆ జబ్బుకు సంబంధించిన ఇంజక్షన్ నా దగ్గర ఉండడంతో వెంటనే తనకు ఇంజక్షన్ వేసానని తెలిపారు.

వైద్యవృత్తికి న్యాయం..

Advertisement

ఎమర్జెన్సీ ఇంజక్షన్ సేఫ్ సైడ్ కోసం నా దగ్గర పెట్టుకున్నాను ఆ రోజు అలా అమ్మాయికి ఉపయోగపడింది. ఇంజక్షన్ వేయగానే ఒక గంటకు మామూలు స్థితికి వచ్చిందని తెలిపారు. అలా ఆరోజు సునీల్ కుమార్తెను తాను కాపాడటంతో ఇప్పటికీ ప్రతి ఏడాది అదే తేదీ నా దగ్గరకు వచ్చి నా చేత కేక్ కట్ చేయిస్తుందని ఈ సందర్భంగా రాజశేఖర్ తెలిపారు. చావు బతుకుల్లో ఉన్న సునీల్ కుమార్తెను కాపాడటంతో ఆ చిన్నారికి రాజశేఖర్ పునర్జన్మను ప్రసాదించారని చెప్పాలి. ఇలా ఈ విషయాన్ని ఇప్పుడు బయట పెట్టడంతో రాజశేఖర్ తన వృత్తికి 100% న్యాయం చేసి ఒక ప్రాణాన్ని కాపాడారు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Also Read: కోట్లు విలువచేసే 3 అపార్ట్మెంట్లు కొన్న షారుఖ్  మేనేజర్ పూజ.. ఈమె ముందు హీరోయిన్లు కూడా వేస్టే!

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×