E-Paper
Advertisement

మీరు Airtel యూజర్లా? ఈ సరికొత్త చీపెస్ట్ ప్లాన్స్ తెలుసుకోండి.. డబ్బులు ఊరికే రావు కదా!

మీరు Airtel యూజర్లా? ఈ సరికొత్త చీపెస్ట్ ప్లాన్స్ తెలుసుకోండి.. డబ్బులు ఊరికే రావు కదా!
Advertisement

Airtel Plans: ప్రముఖ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్ టెల్.. తన వినియోగదారుల కోసం తాజాగా కొన్ని ఆకర్షణీయమైన రీఛార్జ్ ప్లాన్ లను ప్రవేశపెట్టింది. రూ.109, రూ.111, రూ.128, రూ.131 ధరల్లో చౌకైన ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే వీటిలో ఎలాంటి అపరిమిత కాల్స్, 5G డేటా లభించదు. కానీ ఈ బడ్జెట్ ప్లాన్స్ ను రీఛార్జ్ చేసుకోవడం ద్వారా మరో విధంగా యూజర్ కు ప్రయోజనాలు కలుగనున్నాయి. అవేంటో ఈ కథనంలో పరిశీలిద్దాం.

రూ. 109 ప్లాన్

ఎయిర్ టెల్ ఈ ప్లాన్ ను 30 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. దీనిని రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 200MB డేటాతో పాటు రూ.99 టాక్ టైమ్ లభిస్తుంది. లోకల్, STD, ల్యాండ్ లైన్ వాయిస్ కాల్స్ కు సెకనుకు 2.5 పైసలు చొప్పున ఖర్చవుతుంది. లోకల్ SMS అయితే రూ.1, STD ఎస్ఎంఎస్ అయితే రూ.1.5 బ్యాలెన్స్ అమౌంట్ నుంచి కట్ అవుతుంది.

రూ. 111 ప్లాన్

Advertisement

నెల రోజుల వ్యాలిడిటీ కలిగిన ఈ రీఛార్జ్ ప్లాన్ పై రూ.99 టాక్ టైమ్, 200MB డేటా లభిస్తుంది. ఈ ప్లాన్ లోనూ కాల్స్ కు సెకనుకు రూ.2.5 పైసలు చొప్పున ఛార్జ్ చేస్తారు. లోకల్ ఎస్ఎంఎస్ రూ.1, ఎస్టీడీ ఎస్ఎంఎస్ అయితే రూ.1.5 చొప్పున వాసులు చేయనున్నారు.

రూ. 128 ప్లాన్

ఈ ప్లాన్ కూడా 30 రోజుల వ్యాలిడిటీతో వచ్చింది. అయితే ఈ ప్లాన్ పై ఎలాంటి టాక్ టైమ్ ఉండదు. అయితే లోకల్, STD కాల్స్ కు సెకనుకు రూ.2.5, నేషనల్ వీడియో కాల్స్ కు సెకనుకు రూ.5 చొప్పున ఛార్జ్ చేస్తారు. అలాగే వినియోగించిన మెుబైల్ డేటాకు గాను ప్రతీ 1MBకి రూ.0.50 చొప్పున ఛార్జ్ చేస్తారు.

Advertisement

Also Read: శాంసంగ్ నుంచి ఏఐ ఏసీ.. ఫ్యూజులు ఎగిరే ఫీచర్లు.. ఇంటిని హిమాలయాలు చేసేయెుచ్చు!

రూ.131 ప్లాన్..

ఈ నెల రోజుల ప్లాన్ సైతం పైన పేర్కొన్న దాని తరహాలోనే ఉంటుంది. లోకల్, STD కాల్స్ కు సెకనుకు రూ.2.5, నేషనల్ వీడియో కాల్స్ కు సెకనుకు రూ.5 ఛార్జ్ చేస్తారు. లోకల్ ఎస్ఎంఎస్ రూ.1, STD ఎస్ఎంఎస్ రూ.1.5, ప్రతీ 1MBకి రూ.0.50 ఎయిర్ టెల్ ఛార్జ్ చేస్తుంది.

Also Read: జియో యూజర్లకు గుడ్ న్యూస్.. 84 రోజుల వ్యాలిడిటీతో వచ్చిన.. చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ ఇవే!

Related News

Nothing Phone 3 ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం.. ఏకంగా రూ.27,000 తగ్గింపు!

కెమెరా అక్కర్లేదు, ఫోనే చాలు! మీ ఫస్ట్ వ్లాగ్ వైరల్ అవ్వాలంటే ఇవి మస్ట్

స్మార్ట్‌ఫోన్ మీ చేతిలోనే ఉంది.. కానీ ఈ అమేజింగ్ సెట్టింగ్స్ ఇప్పటివరకు ఎందుకు ట్రై చేయలేదు?

వర్షంలో తడిచినా పాడవ్వవు, రూ.20వేలలోపు టాప్-6 వాటర్‌ప్రూఫ్ ఫోన్లు!

రోజూ గిన్నెలు కడిగి విసుగొస్తుందా? ఒకేసారి 20 ప్లేట్ల సెట్ క్లీన్ చేసే కొత్త డిష్‌వాషర్ లాంచ్!

ఒక్కసారి ఛార్జ్ చేస్తే 45 రోజుల బ్యాటరీ బ్యాకప్..అదిరిపోయే ఫిట్‌నెస్ బ్యాండ్ లాంచ్!

జస్ట్ రూ.1,000కే బెస్ట్ ఇయర్ బడ్స్.. త్వరలో మార్కెట్లోకి రాబోతున్న టాప్ బ్రాండ్స్ ఇవే!

రూ.1,004కే 750W పవర్‌ఫుల్ మిక్సర్ గ్రైండర్..ఈ ఆఫర్ అస్సలు మిస్ కావద్దు!

Big Stories

Advertisement
×