E-Paper
Advertisement

Vithika Seru: గుడ్ న్యూస్ చెప్పిన వితికా .. మా జీవితంలోకి సంతోషం వచ్చిందంటూ!

Vithika Seru: గుడ్ న్యూస్ చెప్పిన వితికా .. మా జీవితంలోకి సంతోషం వచ్చిందంటూ!
Advertisement

Vithika Seru: వితికా షేరు టాలీవుడ్ హీరోయిన్ గా అందరికీ ఎంతో సుపరిచితమే. నటిగా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈమె క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటించి సందడి చేశారు. ఇలా పలు సినిమాలలో నటించినప్పటికీ అనుకున్న స్థాయిలో సక్సెస్ రాని నేపథ్యంలో ఇటీవల పూర్తిగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఇలా సినిమాలకు దూరంగా ఉన్న వితికా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మా హృదయాలు ప్రేమతో నిండిపోయాయి

ఈ క్రమంలోనే ఈమె తన ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులకు శుభవార్తను తెలియజేశారు. తన చెల్లెలు కృతిక (Kritika)ఇటీవల మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. అయితే తన చెల్లెలు కొడుకుతో కలిసి ఉన్న ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ తమ ఆనందాన్ని తెలియజేశారు .తమ జీవితంలోకి సంతోషం వచ్చిందని, మేము పెద్దమ్మ పెద్దనాన్న అయ్యామని సంతోషం వ్యక్తం చేశారు. ఇలా మగ బిడ్డ మా జీవితంలోకి అడుగు పెడుతూ ప్రేమ ఆనందాన్ని తీసుకొచ్చారు. ఈ ఆనందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవటం లేదని, నీ రాకతో మా హృదయాలు ప్రేమతో నిండిపోయాయి అంటూ తమ సంతోషాన్ని తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ప్రేమ వివాహం చేసుకున్న వరుణ్, వితికా..

Advertisement

కృతిక 2022వ సంవత్సరంలో కృష్ణ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లిని వితిక వరుణ్ సందేశ్ ఎంతో ఘనంగా నిర్వహించారు.ఇక వితికా విషయానికి వస్తే సినీ నటుడు వరుణ్ సందేశ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం జరిగి దాదాపు పది సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఈ జంటకు ఇప్పటివరకు పిల్లలు మాత్రం లేరు. ఇలా ఈమెకు పిల్లలు లేకపోయినా తమ చెల్లెలికి కొడుకు పుట్టడంతో సొంత బిడ్డగా భావించి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు.

Advertisement

ఇక వీరిద్దరి కెరియర్ విషయానికి వస్తే పెళ్లికి ముందు పలు సినిమాలలో నటించిన వితిక పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. ఇక పెళ్లయిన తర్వాత వీరిద్దరూ బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని సందడి చేశారు. బిగ్ బాస్ తర్వాత వితికా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించగా, వరుణ్ సందేశ్ మాత్రం పలు సినిమాలలోను, వెబ్ సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీ అవుతున్నారు. ఇక ఇటీవల ఈయన నయనం అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సిరీస్ జీ 5 ఓటీటీలో ప్రసారమవుతుంది.

Also Read: Anasuya Bhardwaj: ఆంటీ ట్రోల్స్ పై కౌంటర్ ఇచ్చిన అనసూయ.. చెవిటోడు ముందు శంఖం ఊదినట్టే!

Related News

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

Big Stories

Advertisement
×