E-Paper
Advertisement

Rajinikanth: స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్.. అసలేమైందంటే?

Rajinikanth: స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్.. అసలేమైందంటే?
Advertisement

Rajinikanth: కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగి తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో సూపర్ స్టార్ గా పేరు దక్కించుకున్నారు రజినీకాంత్ (Rajinkanth). భాషతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రజినీకాంత్ ఏడుపదుల వయసులో కూడా యాక్షన్ చిత్రాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ముఖ్యంగా టి.రాజేందర్ (T.Rajendre) చేసిన కామెంట్ల వల్లే ఆయన ఎమోషనల్ అయ్యారు.మరి అసలు ఏమైందో ఇప్పుడు చూద్దాం.

స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న రజినీకాంత్..

ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు, గాయకుడు, స్వరకర్త, నిర్మాత మాత్రమే కాదు ప్రముఖ స్టార్ హీరో శింబు తండ్రిగా మరింత నేటితరం యువతలో కూడా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు టి రాజేందర్. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న ఈయన.. ఈసారి రజనీకాంత్ పై, ఆయన వ్యక్తిత్వం పై కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు. ఇటీవల జరిగిన ఒక వేడుకలో రజనీకాంత్ గొప్పతనాన్ని, సంస్కారాన్ని కొనియాడుతూ టి.రాజేందర్ చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి. టి.రాజేందర్ మాట్లాడుతూ.. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు రజనీకాంత్ దంపతులు అందించిన నైతిక మద్దతును ఆయన గుర్తు చేసుకున్నారు. ఇక రాజేందర్ చేసిన మాటలకు చలించిపోయిన రజనీకాంత్ స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకొని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ ఇద్దరి ఆత్మీయ అనుబంధానికి 40 ఏళ్ళు కావడం విశేషం. మొత్తానికైతే రాజేందర్ , రజనీకాంత్ గొప్పతనాన్ని గుర్తుచేసుకొని చేసిన కామెంట్లకు రజనీకాంత్ ఎమోషనల్ అయ్యారు.

Advertisement

ALSO READ:Anasuya: బాంబు పేల్చిన అనసూయ.. ఇండస్ట్రీ గుట్టు రట్టు చేస్తుందా?

రజనీకాంత్ సినిమాలు..

ఇక రజనీకాంత్ సినిమాల విషయానికి వస్తే.. యాక్షన్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. గతంలో రజనీకాంత్ పని అయిపోయింది. ఇక వయసు అయిపోయింది .ఇండస్ట్రీకి దూరం కావాల్సిందే అంటూ కొంతమంది యాంటీ ఫ్యాన్స్ వ్యతిరేకంగా కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే అందుకు దీటుగా జైలర్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చి తన సత్తా ఏంటో నిరూపించారు. ఇక తర్వాత గత ఏడాది కూలీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకేష్ కనగరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. కానీ అనూహ్యంగా ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు జైలర్ 2 సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు రజినీకాంత్ . మరి ఈ జైలర్ 2 చిత్రంతో ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.

టీ.రాజేందర్..

Advertisement

టిరాజేందర్ విషయానికి వస్తే.. ఈయన గత కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అందులో భాగంగానే హీరోయిన్ ధన్సిక ను స్టేజ్ పైనే అందరి ముందు అవమానించాడు. నేను హన్సిక , ధన్సికకు భయపడను. ఎందుకంటే హన్సిక గతంలో నా కొడుకుతో డేటింగ్ చేసింది అంటూ ధన్సిక పరువు తీశారు. అలా ఎప్పటికప్పుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే ఈయన ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు.

Related News

టాక్సిక్ ..500కోట్లు అయ్యే పనేనా ?

మా ఆయన కోసమే గాయమైనట్టుంది… పెళ్లి తర్వాత మూడు నెలలు కలవలేదంటూ!

శ్రీకృష్ణుడిగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. దిల్ రాజు క్రేజీ రీమేక్ ప్లాన్

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

డెనిమ్‌లో మాల్వి మల్హోత్రా.. బ్లూ బ్యూటీని చూస్తే చూపు తిప్పుకోవడం కష్టమే!

ఇరుముడి బాక్సాఫీస్ రన్.. రూ.300 కోట్లు సాధ్యమేనా?

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కొడుకు కేసులో బిగ్ ట్విస్ట్…

ఇరుముడి సీక్వెల్ సినిమాలో రామ్ చరణ్.. ఫాన్స్ కు పూనకాలే!

Big Stories

Advertisement
×