E-Paper
Advertisement

KH×RK Promo: కమల్ హాసన్ రజనీకాంత్ సినిమా ప్రోమో రిలీజ్.. స్టైలిష్ లుక్ లో స్టార్ హీరోలు!

KH×RK Promo: కమల్ హాసన్ రజనీకాంత్ సినిమా ప్రోమో రిలీజ్.. స్టైలిష్ లుక్ లో స్టార్ హీరోలు!
Advertisement

KHxRK Promo: దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఎంతోమంది సినీప్రియలో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మల్టీ స్టార్లర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఎంతో పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్న నటుడు రజినీకాంత్(Rajinikanth), కమల్ హాసన్(Kamal Hassan) మరోసారి ఒకే తెరపై ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీ స్టార్ సినిమాని ఇటీవల అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilip Kumar) దర్శకత్వంలో ఈ ఇద్దరు హీరోలు కలిసి నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక స్పెషల్ వీడియోని చిత్ర బృందం విడుదల చేశారు. ఈ వీడియోలో భాగంగా రజనీకాంత్ కమల్ హాసన్ లుక్స్ పెద్ద ఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

46 ఏళ్ల తర్వాత కమల్ రజిని మూవీ..

ఈ తమిళ ప్రోమో వీడియోలో భాగంగా రజనీకాంత్ కమల్ హాసన్ ఇద్దరూ ఫోటో పోటీగా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇందులో హీరో ఎవరు అని వీరిద్దరూ అడగడం చాలా సరదాగా అనిపిస్తుంది. నెల్సన్ దర్శకత్వం వహించగా అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ చిత్తాన్ని రెడ్ జైంట్ మూవీస్ భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 46 ఏళ్ల తర్వాత ఈ ఇద్దరు హీరోలు ఓకే తెరపై కనిపించబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.

కమల్ హాసన్ నిర్మాణంలో రజనీకాంత్ మూవీ..

Advertisement

ఇక ఈ సినిమా త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ పనులను జరుపుకోబోతున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ రజనీకాంత్ తమ సినిమాల పనులలో ఎంతో బిజీగా ఉన్నారు .రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న జైలర్ 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా జూన్ నెలలో విడుదల కాబోతోంది సమాచారం ఈ సినిమా పూర్తి అయిన తర్వాత తన 173 వ సినిమాని శిబి చక్రవర్తి దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరించటం విశేషం.

Advertisement

ఈ ప్రాజెక్టు పూర్తి అయిన అనంతరమే కమల్ హాసన్ రజనీకాంత్ సినిమా షూటింగ్ పనులు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. మరోవైపు కమల్ హాసన్ కల్కి 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈయన రాజకీయాలపై దృష్టి సారించిన నేపథ్యంలో సినిమాలను కూడా కాస్త పక్కన పెట్టారని చెప్పాలి. రజనీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్లో సినిమా అనే విషయం తెలియగానే అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తే ఎలాంటి ఆదరణను సొంతం చేసుకుంటుందో తెలియాల్సి ఉంది.

Also Read: Saraswathi Trailer: ప్రతి అమ్మాయి ‘సరస్వతి’లా ఉండదు.. మిస్టరీగా వరలక్ష్మి సినిమా ట్రైలర్!

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×