E-Paper
Advertisement

Rajinikanth -Kamal Hassan: రజిని కమల్ మూవీ నుంచి బిగ్ అప్డేట్.. ప్రోమో ముహూర్తం పిక్స్!

Rajinikanth -Kamal Hassan: రజిని కమల్ మూవీ నుంచి బిగ్ అప్డేట్.. ప్రోమో ముహూర్తం పిక్స్!
Advertisement

Rajinikanth -Kamal Hassan: సౌత్ సినీ ప్రేక్షకులు ముఖ్యంగా కోలీవుడ్ సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. తమిళ చిత్ర పరిశ్రమలో హీరోలుగా మంచి గుర్తింపు సంపాదించుకున్న రజినీకాంత్ కమల్ హాసన్ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని అభిమానులు భావించారు. అయితే త్వరలోనే అభిమానుల కోరిక నెరవేరబోతుందని తెలుస్తోంది. కమల్ హాసన్ రజనీకాంత్ కాంబినేషన్ లో సినిమా వస్తుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే చిత్ర బృందం తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ తెలియజేశారు.

ప్రోమో విడుదలకు ముహూర్తం ఫిక్స్..

రజనీకాంత్ కమల్ హాసన్ హీరోలుగా నటిస్తున్న సినిమాకు సంబంధించి ప్రోమో వీడియో త్వరలోనే రాబోతుందని చిత్ర బృందం తెలియచేశారు. ఫిబ్రవరి 21వ తేదీ శనివారం మధ్యాహ్నం 12:07 నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించిన ప్రోమో విడుదల కాబోతోందని అధికారికంగా తెలియజేశారు. దీంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాని రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ఈ క్రేజీ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.

కొందరు రూల్స్ సెట్ చేస్తారు.. కొందరు పాలిస్తారు..

Advertisement

తాజాగా రజనీకాంత్ కమల్ హాసన్ చేతికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేస్తూ.. ”ప్రపంచం సాక్ష్యం ఇవ్వడానికి మ్యాజిక్ ఓపెన్ చేస్తుంది” అనే కామెంట్‌తో సినిమా పట్ల భారీ హైప్ క్రియేట్ చేశారు. ‘కొందరు రూల్స్ సెట్ చేస్తే… కొందరు మాత్రమే పాలిస్తారు’ అంటూ పోస్టర్‌లో స్టోరీ హింట్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా పట్ల భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి శనివారం రిలీజ్ కాబోయే ప్రోమో ఎలా ఉండబోతుందనేది తెలియాల్సి ఉంది. ఇక నెల్సన్ దిలీప్ కుమార్ ప్రస్తుతం జైలర్ 2 సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు.

Advertisement

నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ జైలర్ సినిమాలో నటించి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో జైలర్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మూడోసారి నెల్సన్ డైరెక్షన్ లో రజనీకాంత్ కమల్ హాసన్ తో కలిసిన నటించడం విశేషం. ఈ సినిమా రజనీకాంత్ కెరియర్ లో 174వ సినిమాగా రాబోతుంది. కమల్ హాసన్ రజనీకాంత్ కాంబినేషన్లో సినిమా చూడాలని అభిమానులు ఎంతో ఆరాటపడుతున్నారు. త్వరలోనే అభిమానుల కోరిక నెరవేరబోతుంది. అయితే రజనీకాంత్ తన 173 వ సినిమాని కమల్ హాసన్ నిర్మాణంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు మొదట సుందర్ సి దర్శకత్వం వహించబోతున్నట్లు తెలిపారు. కొన్ని కారణాలవల్ల ఈయన తప్పుకోవడంతో శిబి చక్రవర్తి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.

Also Read: Prabhas: పక్కరాష్ట్రాల నుంచి ఫుడ్ ఆర్డర్ చేసిన ప్రభాస్.. ఫుడ్ అంటే అంత ఇష్టం ఏంటయ్యా బాబు!

Related News

పవన్ ఫ్యాన్స్‌కి పూనకాలే.. OG యూనివర్స్ నుంచి అదిరిపోయే ట్రీట్!

‘రోమాంచకం’కు రెండో రోజే షాక్.. కలెక్షన్లు ఇలా పడిపోయాయేంటి?

డాన్సర్స్ అసోసియేషన్‌లో మళ్లీ రచ్చ.. సుమలతపై రఘు మాస్టర్ కౌంటర్!

డ్రాగన్ పై ప్రశాంత్ నీల్ బిగ్ అప్డేట్…స్పీడుమీదున్న తారక్!

ఏంటి నాని.. ఇంత హైప్ అవసరమా? ‘ది ప్యారడైజ్’పై అప్పుడే డౌట్స్!

సినిమాలోనే మ్యాజిక్ ఉంది…ఆకట్టుకుంటున్న ఎపిక్ ట్రైలర్!

రూ.10 లక్షల ఇన్సూరెన్స్.. రూ.5 వేల పెన్షన్.. నట్టి కుమార్ ఆఫర్ ఇదే!

సమ్మర్ హీట్‌లో ప్రగ్యా జైస్వాల్ స్పెషల్ ట్రీట్.. నెట్టింట వైరల్!

Big Stories

Advertisement
×