E-Paper
Advertisement

Rajinikanth: 12 ఏళ్ల తర్వాత యానిమేషన్ మూవీగా సూపర్ స్టార్ మూవీ.. అప్పుడే రికార్డులు!

Rajinikanth: 12 ఏళ్ల తర్వాత యానిమేషన్ మూవీగా సూపర్ స్టార్ మూవీ.. అప్పుడే రికార్డులు!
Advertisement

Rajinikanth:సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ అంటేనే ఫాన్స్ కు పూనకాలు వస్తాయి. అలాంటిది ఇప్పుడు యానిమేషన్ మూవీ అంటే ,ఇక చెప్పకర్లేదు. ఇక ఆయన నటించిన ‘కొచ్చాడయాన్’ అప్పట్లో మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో సంచలనం సృష్టించినా, బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయితే, ఇప్పుడు 12 ఏళ్ల తర్వాత ఏఐ (AI) టెక్నాలజీతో ఈ సినిమాకు సరికొత్త జీవం పోస్తున్నారు. తాజాగా విడుదలైన ఏఐ టీజర్ తలైవా అభిమానులను ఊర్రూతలూగిస్తోంది. కేవలం టీజర్‌తోనే రికార్డులు సృష్టిస్తున్న ఈ ప్రాజెక్ట్, పాత విమర్శలను చెరిపివేసి విజువల్ వండర్‌గా నిలవబోతోంది అంటున్నారు ఫాన్స్ ..వివరాలు ఇలా వున్నాయి..

నాడు ట్రోల్స్.. నేడు ట్రెండ్:

అప్పట్లో ఒక పెద్ద ప్రయోగం గా వచ్చిన మూవీ కొచ్చాడయాన్. ఇది 2014లో విడుదలైనది. సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలో, దీపికా పదుకొణె హీరోయిన్‌గా వచ్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండేవి. కానీ, అప్పటి టెక్నాలజీ పరిమితుల వల్ల విజువల్స్ కార్టూన్ సినిమాల్లా ఉన్నాయంటూ విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు కాలం మారింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వచ్చింది. తాజాగా ఈ సినిమాను ఏఐ సాయంతో రీ-జనరేట్ చేసిన టీజర్ చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. రజినీకాంత్ మ్యానరిజమ్స్, ఆయన లుక్ ఇప్పుడు అచ్చం రియలిస్టిక్ మూవీలా కనిపిస్తున్నాయి. అప్పట్లో నిరాశ చెందిన అభిమానులు ఇప్పుడు ఈ ఏఐ టీజర్‌ను చూసి ఫిదా అయిపోతున్నారు.

సౌందర్య రజినీకాంత్ ప్లాన్:

Advertisement

తండ్రి రజినీకాంత్‌ను వెండితెరపై ఒక గొప్ప యోధుడిగా చూపించాలని సౌందర్య రజినీకాంత్ చేసిన ప్రయత్నం అప్పట్లో సగం విజయం మాత్రమే సాధించింది. కానీ ఇప్పుడు ఏఐ టెక్నాలజీని వాడుకుని సినిమా మొత్తాన్ని సరికొత్తగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ టీజర్‌లో గ్రాఫిక్స్ క్వాలిటీ, రజనీ సర్ వాయిస్ బేస్, యాక్షన్ సీక్వెన్స్ అన్నీ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ టీజర్ రిలీజ్ అయిన కొద్దిసేపటికే మిలియన్ల వ్యూస్ సాధించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే పాత సినిమాలకు కొత్త హంగులు అద్దే సరికొత్త ట్రెండ్‌కు ఇది నాంది కానుంది.

ALSO READ:Alia Bhatt: అరుదైన గౌరవం అందుకున్న ఆలియా భట్!

తలైవా మేనియా మళ్లీ షురూ:

Advertisement

రజినీకాంత్ సినిమా అంటేనే ఒక సెన్సేషన్, అలాంటిది విజువల్స్ పరంగా వెనుకబడిన ఒక సినిమాను ఇప్పుడు మోడ్రన్ టెక్నాలజీతో రీ-రిలీజ్ చేయడం మామూలు విషయం కాదు. ఏఐ పుణ్యమా అని ‘కొచ్చాడయాన్’ ఇప్పుడు అసలైన విజువల్ వండర్‌గా రాబోతోంది. అభిమానుల చిరకాల కోరికను నెరవేరుస్తూ, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన పాత లెక్కలను సరిచేసుకుంటుందని అందరూ భావిస్తున్నారు. ఇక ఈ ఏఐ వెర్షన్ ఎప్పుడు థియేటర్లలోకి వస్తుందా అని ఇండియా మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

Related News

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

ఎన్టీఆర్ డ్రాగన్ లో బాలీవుడ్ స్టార్స్… ఏం ప్లాన్ చేస్తున్నావ్ నీల్?

RC16పై మాస్ అప్డేట్..చరణ్–సుకుమార్ మూవీ గ్రాండ్ లాంచ్ ఎప్పుడో తెలుసా?

క్యాస్టింగ్ కౌచ్ పై పొలిమేర బ్యూటీ హాట్ కామెంట్స్.. చాలా ఇబ్బంది పెట్టేవారు?

ప్రమాదానికి గురైన అలీ..కాలికి పెద్ద కట్టుతో అలా..ఏమైందంటే?

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అక్కడైనా సక్సెస్ అయ్యేనా?

అరుదైన ఘనత సాధించిన రష్మిక మందన్న!

అన్నపూర్ణ స్టూడియోస్ పై అల్లరి నరేష్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×