E-Paper
Advertisement

Fridges Under Rs 30,000: తక్కువ బడ్జెట్‌లో.. టాప్-5 ఫ్రిడ్జ్‌లు ఇవే.. మెరుగైన కూలింగ్, అత్యాధునిక ఫీచర్లు!

Fridges Under Rs 30,000: తక్కువ బడ్జెట్‌లో.. టాప్-5 ఫ్రిడ్జ్‌లు ఇవే.. మెరుగైన కూలింగ్, అత్యాధునిక ఫీచర్లు!
Advertisement

Fridges Under Rs 30,000: ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఇంట్లోను రిఫ్రిజిరేటర్లు తప్పనిసరిగా మారిపోయాయి. ముఖ్యంగా వేసవి కాలంలో వీటి అవసరం మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఫ్రిడ్జ్ లలో ప్రధానంగా ఎదురయ్యే సమస్యల్లో ఐస్ గడ్డకట్టడం ఒకటి. అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఫ్రోస్ట్-ఫ్రీ ఫ్రిడ్జ్‌లు (Frost-free refrigerators) మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి చాలా ఖరీదైనవిగా చాలా భావిస్తుంటారు. కానీ రూ.30,000 లోపు బడ్జెట్ లో ప్రముఖ కంపెనీలకు చెందిన టాప్ – 5 frost-free ఫ్రిడ్జ్ లను ఇక్కడ అందించడం జరుగుతోంది. మీ అభిరుచులకు అనుగుణంగా వాటిని ఈ వేసవిలో ట్రై చేయండి.

Haier 237L 3 Star Frost Free Double Door

హైయర్ కంపెనీకి చెందిన ఈ రిఫ్రిజిరేటర్.. ఫ్రీజర్ ను కింది భాగంలో కలిగి ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్ లో మంచు పేరుకుపోకుండా సాయపడుతుంది. ఇందులో సాధారణ వినియోగం కోసం అవసరమయ్యే సెట్టింగ్స్, సెలవులు, కాలానుగుణ మార్పులతో పనిచేసేందుకు వీలుగా విభిన్నమైన ఆపరేటింగ్ మోడ్స్ ఉంటాయి. 3 స్టార్ రేటింగ్ ను కలిగి ఉండటం వల్ల విద్యుత్ వినియోగాన్ని సైతం ఆదా చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫ్రిడ్జ్ ధర రూ.24,989గా ఉంది.

Samsung 236 L 2 Double Door Refrigerator

Advertisement

రూ.30,000 లోపు శాంసంగ్ కు చెందిన ఫ్రోస్ట్-ఫ్రీ ఫ్రిడ్జ్ ను కోరుకునే వారు దీనిని పరిశీలించవచ్చు. 236 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ ఫ్రిడ్జ్.. డిజిటల్ ఇన్వర్టర్ కంప్రెసర్ తో మార్కెట్ లోకి వచ్చింది. మూవబుల్ ఐస్ మేకర్, LED లైటింగ్, టఫ్డ్ గ్లాస్ షెల్ఫ్‌లు, బయటి నుంచి వచ్చే స్వచ్ఛమైన గాలిని లోనికి పంపించే కార్బన్ ఫిల్టర్లు ఇందులో ఉన్నాయి. అమెజాన్ లో ఈ ఫ్రిడ్జ్ రూ. 24,690కు సేల్ అవుతోంది.

Godrej 600 L Frost Free Side-by-Side Refrigerator

గోద్రేజ్ కంపెనీకి చెందిన ఈ ఫ్రిడ్జ్ లో కూలింగ్ ను అందించడానికి మల్టీ ఎయిర్‌ఫ్లో సిస్టమ్‌ను వినియోగించారు. ఇది మాన్యువల్ డీఫ్రాస్టింగ్ అవసరాన్ని తగ్గిస్తుంది. 2-8 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతను సర్దుబాటు చేయడానికి ఫ్రిడ్జ్ డోర్ పై ఎల్ఈడీ డిస్ ప్లే ప్యానెల్ సైతం ఉంటుంది. అధిక షెల్ఫ్ లు, విశాలమైన కాంపార్ట్ మెంట్లు.. పెద్ద మెుత్తంగా ఆహారపదార్థాలను నిల్వ చేయడానికి ప్రయోజనకరంగా ఉంటాయి.

Whirlpool 235 L Double Door

Advertisement

వర్ల్ పూల్ కంపెనీకి చెందిన ఈ ప్రిడ్జ్ కు ఇన్వర్టర్ టెక్నాలజీతో పాటు 235 లీటర్ల సామర్థ్యం, డబుల్ డోర్స్ ఉన్నాయి. పండ్లు, కూరగాయాలు భద్రపరుచుకునేందుకు ఇందులో అల్మారాలు ఉన్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిన సమయంలోనూ ఈ ఫ్రిడ్జ్.. గంటల కొద్ది చల్లదనాన్ని అట్టిపెట్టి ఉంచగలదు. ప్రస్తుతం అమెజాన్ లో ఈ ఫ్రిడ్జ్ రూ.21,990కు సేల్ అవుతోంది.

Also Read: GHMC: బల్దియా కొత్త కార్పొరేషన్‌లలో 100 డేస్ యాక్షన్ ప్లాన్.. ముఖ్యంగా జరిగే మార్పులివే..?

LG 272 L 3 Star Double Door Refrigerator

తక్కువ బడ్జెట్ లో ఎల్జీ కంపెనీ ఫ్రిడ్జ్ కోరుకునేవారు.. దీనిని పరిశీలించవచ్చు. ఫ్రిడ్జ్ లో చల్లదనం కోసం ఇందులో మల్టీ ఎయిర్ ఫ్లో కూలింగ్ వ్యవస్థ (Multi-airflow cooling)ను అమర్చారు. అమెజాన్, ఫ్లిప్ కామర్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థల్లో ఈ ఫ్రిడ్జ్ రూ.28,990కు సేల్ అవుతోంది.

Also Read: Isha OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ ’ఇషా‘ .. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Related News

90% మంది చేసే అతిపెద్ద పొరపాటు.. కొత్త స్మార్ట్‌ఫోన్లలో మార్చాల్సిన ఆ 7 సెట్టింగ్స్ ఇవే!

ఇంట్లో పాత స్మార్ట్‌ఫోన్ ఉందా? దాన్ని క్యాష్‌గా మార్చుకోండిలా!

వాట్సప్‌లో Bill Payments ఫీచర్.. కరెంట్, ఫాస్టాగ్, క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎలా కట్టాలో తెలుసా?

బ్యాటరీ తీయలేం, ఇయర్‌ఫోన్ పెట్టలేం..మోడర్న్ ఫోన్ల రూపు రేఖలు ఎందుకు మారాయ్ !

రూ.200లకే యూట్యూబ్ ప్రీమియం, ప్రైమ్ వీడియో.. జియో ఊహించని ధమాకా ఆఫర్!

సిగ్నల్ ఉన్నా.. కాల్స్ కట్ అవుతున్నాయా? అసలు కారణాలు ఇవే!

డ్యూయల్ డ్రైవర్స్,ఆర్జీబీ లైట్స్..బడ్జెట్‌లో బెస్ట్ పార్టీ టవర్ స్పీకర్ !

పళ్ల సందుల్లో ఏముందో ఫోన్‌లో లైవ్ చూడొచ్చు.. డైసన్ కొత్త ఏఐ టూత్ బ్రష్ ధరెంతో తెలుసా?

Big Stories

Advertisement
×