E-Paper
Advertisement

ఆర్.బి. చౌదరి ఆఖరి కోరిక తీరకుండానే మరణించారా.. అసలు విషయం చెప్పిన రజనీకాంత్!

ఆర్.బి. చౌదరి ఆఖరి కోరిక తీరకుండానే మరణించారా.. అసలు విషయం చెప్పిన రజనీకాంత్!
Advertisement

R.B.Choudary: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించి నిర్మాతగా మంచి సక్సెస్ అందుకున్న వారిలో ఆర్. బి చౌదరి ఒకరు. ఈయన తన నిర్మాణంలో ఎంతోమంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేయడమే కాకుండా తెలుగు తమిళ భాషలలో స్టార్ హీరోలు అందరితో బ్లాక్ బస్టర్ సినిమాలను చేశారు. ఇలా సూపర్ గుడ్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన ఆర్ బి చౌదరి ఇటీవల రాజస్థాన్ లో రోడ్డు ప్రమాదానికి గురి అయ్యి మరణించిన సంగతి తెలిసిందే. ఈ విధంగా ఆర్.బి చౌదరి మరణ వార్త చిత్ర పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ కొట్టిందని చెప్పాలి.

నిర్మాతగా రిటైర్మెంట్ అవుతా..

చౌదరి రోడ్డు ప్రమాదంలో మరణించారనే విషయం తెలియడంతో సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తూ పోస్టులు చేస్తున్నారు. అలాగే తమిళ నటీనటులు చౌదరి చివరి చూపుకు తరలి వెళ్తూ ఆయనకు నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలోనే తమిళ స్టార్ హీరో రజనీకాంత్(Rajinikanth) ఆర్.బి చౌదరి (R.B.Choudary)గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని తెలియచ. జైలర్2 సినిమా షూటింగ్ సమయంలో ఆర్.బి చౌదరి తనతో మాట్లాడుతూ ఇప్పటివరకు తాను తన నిర్మాణంలో 99 సినిమాలను చేశాను 100వ సినిమా మీతో చేసి తాను నిర్మాతగా రిటైర్డ్ అవుతానని చెప్పారట.

100వ సినిమా రజినీకాంత్ తో..

Advertisement

ఇలా ఆర్.బి చౌదరి చెప్పడంతో రజనీకాంత్ కూడా సూపర్ గుడ్ ఫిలిం బ్యానర్ లో 100వ సినిమా చేయడానికి సానుకూలంగా స్పందించారని అలాగే రజనీకాంత్ గారి కోసం రెండు మూడు స్క్రిప్ట్లను కూడా సిద్ధం చేయించారని తెలియజేశారు. అయితే తనతో 100వ సినిమా చేయాలనకున్న చౌదరి చివరి కోరిక నెరవేరకుండానే మరణించారనే విషయం తెలిసి అభిమానులు కూడా షాక్ అవుతున్నారు. ఇలా వంద సినిమాలు చేసి నిర్మాతగా రిటైర్మెంట్ అవుతానని చెప్పిన చౌదరి 99వ సినిమాని కూడా పూర్తి చేయకుండానే మరణించారని, సినిమాల పరంగా ఆయన ఆఖరి కోరిక నెరవేరలేదని అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

చెన్నైలో అంత్యక్రియలు పూర్తి..

Advertisement

ఇక ఆర్. బి. చౌదరి తన 99వ సినిమాని నటుడు విశాల్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. మకుటం(Makutam) అనే పేరుతో ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా నిర్మాణ దశలో ఉండగానే ఆర్ బి చౌదరి మరణించారు. ఈ మకుటం సినిమా అనంతరం చౌదరి తన వందవ సినిమాని రజనీకాంత్ తో చేయాలనుకున్నట్టు తెలుస్తోంది. ఇలా ఆర్.బి. చౌదరి మరణం తర్వాత సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ బాధ్యతలను ఆయన కుమారులు తీసుకుంటారని తెలుస్తుంది. ఇక చౌదరి కుమారులలో ఒకరైన జీవా నటుడిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. చౌదరికి నలుగురు కుమారులని తెలుస్తుంది. ఇక చౌదరి మరణించడంతో నేడు చెన్నైలో ఈయన అంత్యక్రియలను నిర్వహించారు.

Also Read: ప్యారడైజ్ ఎఫెక్ట్ నాని ‘బ్లడీ రోమియో’ ఆలస్యం.. పవన్ సినిమా పై ఫోకస్ చేసిన సుజీత్

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×