E-Paper
Advertisement

కెమెరా లవర్స్ కోసం వివో సంచలనం.. X300 అల్ట్రా , X300 FE ధర, ఫీచర్ల ఫుల్ డిటెయిల్స్

కెమెరా లవర్స్ కోసం వివో సంచలనం.. X300 అల్ట్రా , X300 FE ధర, ఫీచర్ల ఫుల్ డిటెయిల్స్
Advertisement

Vivo X300 Ultra: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు వివో అంటేనే గుర్తొచ్చేది ఆ కెమెరా క్వాలిటీ! ఇప్పుడు వివో తన కొత్త ‘X300’ సిరీస్‌తో ఇండియాలో ప్రకంపనలు సృష్టించడానికి సిద్ధమైంది. అల్ట్రా ప్రీమియం ఫీచర్లతో Vivo X300 Ultra , ధరకి తగ్గ ఫీచర్లతో X300 FE మోడల్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ముఖ్యంగా ఫోటోగ్రఫీలో సరికొత్త బెంచ్‌మార్క్‌లు సెట్ చేయడమే లక్ష్యంగా ఈ ఫోన్లు వచ్చాయి. మరి ఈ ‘కెమెరా కింగ్’ ఫోన్లలో ఉన్న ఆ ప్రత్యేకతలు ఏంటి? వీటి ధరలు ఎంత ఉండబోతున్నాయి? పూర్తి వివరాలు మీ కోసం!

వివో X300 అల్ట్రా & X300 FE: స్మార్ట్‌ఫోన్ లోకంలో కొత్త విప్లవం:

Advertisement

వివో తన X-సిరీస్‌తో ఎప్పుడూ కెమెరా సెగ్మెంట్‌లో అగ్రస్థానంలో ఉంటుంది. ఈసారి X300 సిరీస్‌లో అల్ట్రా వేరియంట్ తో పాటు, అందరికీ అందుబాటులో ఉండేలా ‘FE’ మోడల్‌ను కూడా రంగంలోకి దించింది.

1. Vivo X300 Ultra: ఫోటోగ్రఫీలో రారాజు:
ఈ ఫోన్ చూస్తుంటే స్మార్ట్‌ఫోన్‌లా కాకుండా ఒక ప్రొఫెషనల్ డిజిటల్ కెమెరాలా కనిపిస్తుంది.

Advertisement

కెమెరా అదిరిపోయింది: ఇందులో 200MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను అమర్చారు. అంటే మీరు కిలోమీటర్ దూరంలో.. ఉన్న వస్తువును కూడా ఎంతో స్పష్టంగా షూట్ చేయవచ్చు. Zeiss లెన్స్‌లతో కలిసి వివో చేసిన ఈ ప్రయోగం కచ్చితంగా అద్భుతమే.

పర్ఫార్మెన్స్: ఇందులో లేటెస్ట్ ప్రాసెసర్ ఉంటుంది. మీరు హెవీ గేమ్స్ ఆడినా, 8K వీడియో ఎడిటింగ్ చేసినా ఫోన్ అస్సలు తగ్గదు.

డిస్ప్లే: 6.8 ఇంచుల క్వాడ్ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్ప్లే, 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది. ఎండలో చూసినా క్లారిటీ అదిరిపోతుంది.

2. Vivo X300 FE (Fan Edition): తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్ ఫీల్:
అందరూ లక్ష రూపాయలు పెట్టి అల్ట్రా కొనలేరు కదా, అందుకే వారి కోసం వచ్చిన స్మార్ట్ ఛాయిస్ ఇది.

కెమెరా: అల్ట్రా అంత కాకపోయినా, ఇందులో కూడా 50MP మెయిన్ కెమెరాతో అదిరిపోయే పోర్ట్రెయిట్స్ తీసుకోవచ్చు. వివో సిగ్నేచర్ ఆరా లైట్ ఫీచర్ కూడా దీనికి ప్లస్.

డిజైన్: చాలా స్లిమ్ గా, స్టైలిష్ గా ఉంటుంది. యువతను ఆకట్టుకోవడానికి రంగురంగుల షేడ్స్ లో దీన్ని తీసుకొచ్చారు.

బ్యాటరీ: 5500mAh బ్యాటరీతో పాటు 80W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. అంటే కేవలం 30 నిమిషాల్లో ఫోన్ ఫుల్ చార్జ్ అయిపోతుంది.

3. సాఫ్ట్‌వేర్, కనెక్టివిటీ:
ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 16ఫన్ టచ్‌తో వస్తున్నాయి. ఇందులో ఏఐ ఫీచర్లు పుష్కలంగా ఉన్నాయి. మీ ఫోటోలోని అవసరం లేని వస్తువులను తొలగించడం, వాయిస్ నోట్స్ ని టెక్స్ట్ గా మార్చడం వంటివి ఎంతో సులభంగా చేయవచ్చు.

వీటి ధర ఎంత ఉండొచ్చు?
Vivo X300 Ultra: దీని ధర సుమారు రూ. 95,000 నుంచి రూ. 1,05,000 మధ్యలో ఉండవచ్చు. ఇది నేరుగా Samsung S26 Ultra, iPhone 17 Pro లతో పోటీ పడుతుంది.

Vivo X300 FE: ఇది కొంచెం అఫర్డబుల్ గా రూ.45,000 నుంచి రూ.55,000 రేంజ్ లో ఉండే అవకాశం ఉంది.

మీరు గనుక ఫోటోగ్రఫీ పిచ్చోళ్లయితే లేదా బెస్ట్ డిస్ప్లే కావాలనుకుంటే.. Vivo X300 Ultra కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు. బడ్జెట్ లో మంచి బ్రాండ్ వాల్యూ, కెమెరా కావాలనుకుంటే X300 FE బెస్ట్ ఆప్షన్. మార్కెట్లోకి ఇవి త్వరలోనే రాబోతున్నాయి. కాబట్టి మీ పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయడానికి సిద్ధంగా ఉండండి.

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×