Yellamma Movie: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ ఒకరు. తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) ఇకపై తెరపై హీరోగా సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈయన ఎల్లమ్మ (Yellamma)అనే సినిమాలో హీరోగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.
ప్రస్తుతం ఎల్లమ్మ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇకపోతే నేడు దసరా పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి మేకర్స్ బిగ్ అప్డేట్ తెలియజేశారు. ఎల్లమ్మ సినిమాని 2027 మార్చి 5వ తేదీ విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాతలు అధికారక పోస్టర్ ద్వారా తెలియచేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎల్లమ్మ సినిమా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఒక శక్తివంతమైన మ్యూజికల్, ఎమోషనల్ సోషల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సమాజంలో అణచివేతపై పోరాడుతూ, తమ కలలను సాకారం చేసుకోవడానికి ఒక గ్రామీణ గాయక బృందం పడే కష్టాలు, వారి జీవితాల్లోని ఆధ్యాత్మికతను ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమా నిజ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు బలగం సినిమా డైరెక్టర్ వేణు(Venu) దర్శకుడిగా వ్యవహరించబోతున్న సంగతి తెలిసిందే. బలగం సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న వేణు తదుపరి ఎల్లమ్మ సినిమాని ప్రకటించడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా కథకు ఎంతోమంది టాలీవుడ్ హీరోలను సంప్రదించగా ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాని రిజెక్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాలో హీరోగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.
A powerful story emerging from the roots of our land, ready to find its voice across the nation! 🔥#Yellamma ~ Grand Worldwide Theatrical Release on MARCH 5th, 2027! ❤️🔥
In Telugu, Tamil, Hindi, Kannada & Malayalam.💥#YellammaFromMarch5th
Rockstar 🌟 @ThisIsDSP… pic.twitter.com/Zrf2us1poj
— Sri Venkateswara Creations (@SVC_official) October 20, 2026
ఇక దేవి శ్రీ ప్రసాద్ జోడిగా అనంతిక సనిల్ కుమార్ హీరోయిన్ పాత్రలో సందడి చేయబోతున్నారు అదేవిధంగా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో రుక్మిణి వసంత్ కూడా కనిపించబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటివరకు చిత్ర బృందం ఎక్కడ అధికారకంగా ప్రకటించలేదు. ఏది ఏమైనా ఎన్నో అవంతరాలను దాటుకుంటూ ఎల్లమ్మ సినిమా మార్చ్ 5వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. మరి హీరోగా దేవిశ్రీపసాద్ ఎల్లమ్మ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాకు దిల్ రాజు (Dil Raju)నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: రణబాలి 2 మూవీ పై రాహుల్ బిగ్ అప్డేట్.. ఫాన్స్ కు పూనకాలు గ్యారెంటీ!