E-Paper
Advertisement

Rajinikanth: 35 ఏళ్ల తర్వాత సూపర్ హిట్ కాంబో రిపీట్.. ఈసారి ఫలితం సంగతేంటి?

Rajinikanth: 35 ఏళ్ల తర్వాత సూపర్ హిట్ కాంబో రిపీట్.. ఈసారి ఫలితం సంగతేంటి?
Advertisement

Rajinikanth:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒక జంట తెరపై కనిపించి సూపర్ సక్సెస్ అందుకుంది అంటే.. మళ్ళీ ఆ జంటతోనే సినిమాలు చేయడానికి దర్శక నిర్మాతలు కూడా ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. అయితే ఒక కాంబో మళ్లీ తెరపైకి రావాలి అంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఒక్కొక్కసారి మళ్లీ తెరపైకి రావడానికి ఆ కాంబోలకి కుదరకపోయినా..అలాంటి మ్యాజిక్ మళ్ళీ తెరపై కనిపించదు అనడంలో సందేహం లేదు. అలా ఒక్కొక్కసారి ఆ కాంబో రిపీట్ అవ్వడానికి సంవత్సరాల సమయం కూడా పట్టొచ్చు. ఈ క్రమంలోనే గతంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న రజినీకాంత్ మళ్లీ 35 ఏళ్ల తర్వాత ఆమెతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడానికి సిద్ధం అయిపోయారు. మరి రజినీకాంత్ తో జతకట్టబోతున్న ఆ హీరోయిన్ ఎవరు? అది ఏ చిత్రం అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

35 ఏళ్ల తర్వాత ఆ కాంబో రిపీట్..

అసలు విషయంలోకి వెళ్తే.. సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నుంచి వస్తున్న చిత్రాలలో సీనియర్ హీరోయిన్లను గత కొంతకాలంగా రిపీట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ‘నరసింహా’ లో నీలాంబరిగా రజనీకాంత్ తో పోటీపడి మరీ నటించిన రమ్యకృష్ణతో ఆయన మళ్లీ నటించలేదు. కానీ ఈ జోడీ సాధ్యమా అనుకున్న సమయంలోనే సుసాధ్యమే అని ప్రూవ్ చేశారు నెల్సన్ దిలీప్ కుమార్.. జైలర్ లో భార్యాభర్తలుగా నటించారు. ఇక అలాగే ఈ కాంబో జైలర్ 2లో కూడా రిపీట్ అవుతున్న విషయం తెలిసిందే. జైలర్ 2 సినిమా తరువాత రజినీకాంత్ తన 173వ సినిమా షూటింగ్లో బిజీగా మారబోతున్నారు.

Advertisement

ALSO READ:Devi Sri Prasad: ఆమె దయ ఎప్పటికీ నాపైనే.. తన కెరియర్ పై డీఎస్పీ ఎమోషనల్ కామెంట్స్!

కన్ఫామ్ ఐతే సక్సెస్ గ్యారెంటీనా?

సిబి చక్రవర్తి దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ తన 173 వ చిత్రాన్ని చేయబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో సూపర్ స్టార్ కి జోడిగా సీనియర్ నటి శోభన (Shobana) ను పరిశీలిస్తున్నారట. ఇదివరకే గతంలో శివ, దళపతి వంటి చిత్రాలలో వీళ్ళిద్దరూ కలిసి నటించారు. కొచ్చాడియాన్ సినిమాలో కనిపించినా అది రెగ్యులర్ మూవీ కాదు. అటు దళపతి చిత్రంలో ప్రేమించుకుని కొన్ని అనివార్య కారణాలతో వీళ్ళిద్దరూ విడిపోతారు. మళ్ళీ అప్పటినుంచి తెరపై కనిపించలేదు ఈ స్టార్ హీరోయిన్. ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.. అప్పుడప్పుడు సీనియర్ హీరోలతో నటిస్తూ మెయిన్ లీడ్ క్యారెక్టర్స్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం 55లోకి అడుగుపెట్టిన శోభన.. గత ఏడాది మలయాళం బ్లాక్ బాస్టర్ ఫిలిం తుడరుమ్ సినిమాలో మోహన్ లాల్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. ఒకవేళ ఇప్పుడు రజనీకాంత్ సరసన కూడా ఈమె ఫిక్స్ అయితే మాత్రం 35 ఏళ్ల తర్వాత మళ్లీ తెరపై ఆడియన్స్ ఎంతో ఇష్టపడే క్రేజీ కాంబో రిపీట్ అయినట్లే అని చెప్పవచ్చు.. ఒకవేళ మళ్లీ ఈ జోడి గనుక తెరపైకి కనిపిస్తే సక్సెస్ అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Related News

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

Big Stories

Advertisement
×