E-Paper
Advertisement

Smartphone rebranding: కస్టమర్లతో ఆడుకుంటున్న చైనా కంపెనీలు.. పేరు మార్చి సేమ్ ఫీచర్స్‌గల వేర్వేరు మొబైల్స్ లాంచ్

Smartphone rebranding: కస్టమర్లతో ఆడుకుంటున్న చైనా కంపెనీలు.. పేరు మార్చి సేమ్ ఫీచర్స్‌గల వేర్వేరు మొబైల్స్ లాంచ్
Advertisement

Smartphone rebranding| ప్రతి నెలా దేశంలో చాలా స్మార్ట్‌ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. రెడ్‌మి, రియల్‌మి, పోకో, వివో, ఐకూ వంటి బ్రాండ్లు చాలా ఎక్కువగా ఫోన్లు తీసుకొస్తున్నాయి. చాలా సార్లు ఈ ఫోన్ల ఫీచర్స్ దాదాపు ఒకేలా ఉంటాయి. కేవలం పేరు మాత్రమే మారుస్తారు. డిజైన్ కూడా చాలా సార్లు ఒకేలా కనిపిస్తుంది. దీంతో కస్టమర్లు గందరగోళానికి గురవుతుంటారు.

ఉదాహరణకు వివో కంపెనీ ఇటీవలే వివో T5x 5G లాంచ్ అయింది. ఈ ఫోన్ ఫీచర్స్ అచ్చం iQOO Z11x 5G లాగే ఉన్నాయి. స్పెసిఫికేషన్లు, ధరలు కూడా దాదాపు ఒకేలా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో వివో, అమెజాన్‌లో iQOO ఫోన్ ఎక్కువగా సేల్ అవుతున్నాయి. Redmi, Poco కూడా ఇలాగే ఒకే ఫోన్‌ మోడల్‌ని వేర్వేరు పేర్లతో విక్రయిస్తున్నాయి.

శాంసంగ్ కూడా ఇదే విధానం అనుసరిస్తోంది

Advertisement

ఇది చైనీస్ బ్రాండ్లకు మాత్రమే పరిమితం కాదు. Samsung కూడా ఇప్పుడు ఇలాంటి విధానం అనుసరిస్తోంది. Galaxy M17e ఫోన్ ఇటీవల లాంచ్ అయింది. ఈ ఫోన్ శాంసంగ్ పాత మోడల్ గెలాక్సీ F70e లాంటి ఫీచర్స్ కలిగి ఉంది. ఫీచర్లు, ధరలు రెండింటిలోనూ సరిగ్గా ఒకేలా ఉన్నాయి. ఇలాంటి ట్రెండ్ వల్ల స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీలో కొత్త ఆవిష్కరణలు తగ్గిపోతున్నాయని చాలా మంది అనుకుంటున్నారు.

ఎందుకు ఇలా చేస్తున్నారు?

కంపెనీలు వివిధ బ్రాండ్లతో వేర్వేరు కస్టమర్లను టార్గెట్ చేస్తాయి. ప్రతి బ్రాండ్ ఒక నిర్దిష్ట ధర రేంజ్ లేదా కస్టమర్ గ్రూప్‌‌ని టార్గెట్ చేస్తుంది. 2014లో భారత్‌లోకి వివో ఎంట్రీ ఇచ్చింది. అప్పటి నుంచి భారత మార్కెట్‌లో తన స్థానాన్ని బలపరుచుకుంది. 2020లో ఐకూ అనే సబ్-బ్రాండ్ తీసుకొచ్చింది. మొదట్లో iQOO ఫోన్లు అమెజాన్‌లోనే సేల్ అయ్యేవి. ఇప్పుడు ఇతర ప్లాట్‌ఫామ్‌లలో కూడా లభిస్తున్నాయి.

Advertisement

ఇలాంటి రీబ్రాండింగ్ వల్ల అన్ని ధర రేంజ్‌లలో కవర్ చేయగలుగుతారు. చైనాలో ఒక బ్రాండ్‌తో లాంచ్ అయిన ఫోన్ భారత్‌లో మరో బ్రాండ్ పేరుతో వస్తుంది. మార్కెట్‌ను త్వరగా విస్తరించడానికి ఇలాంటి వ్యూహాలు అనుసరిస్తారు.

ఫోన్ల ధరలు పెంపు

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనడం ఇప్పుడు మరింత ఖరీదైన వ్యవహారంగా మారనుంది. వివో, ఒప్పో, వన్‌ప్లస్, హానర్ వంటి కంపెనీలు కొన్ని మోడల్స్ ధరలు పెంచేశాయి. దీనికి ప్రధాన కారణం కాంపోనెంట్ల ధరలు పెరగడం. ముఖ్యంగా మెమరీ, స్టోరేజ్ చిప్స్ ధరలు గణనీయంగా పెరిగాయి.

AI టెక్నాలజీ డిమాండ్ పెరగడం వల్ల సర్వర్లు, డేటా సెంటర్లకు చాలా చిప్స్ అవసరం అవుతున్నాయి. దీంతో DRAM, NAND చిప్స్ ధరలు 80 శాతం కంటే ఎక్కువ పెరిగాయి. సప్లై తక్కువగా ఉండటంతో ధరలు మరింత పెరుగుతున్నాయి.

ధరల పెరుగుదల ప్రభావం

ఈ కారణాల వల్ల Oppo, వన్‌ప్లస్, వివో, హానర్ కంపెనీలు ఇటీవలే కొన్ని మోడల్స్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. బడ్జెట్, మిడ్-రేంజ్ ఫోన్లపై ఎక్కువ ప్రభావం పడుతుంది.

Also Read: ఆన్‌లైన్‌లో కొత్త ఐఫోన్ కొంటే పాత ఫోన్ డెలివరీ.. ఎలా గుర్తుపట్టాలంటే

కొనుగోలుదారులపై ప్రభావం

కొత్త ఫోన్లు కొనడానికి మధ్య తరగతి కస్టమర్లకు భారంగా ఉంటుంది. ఈ కారణంగా చాలా మంది ఫోన్ కొనడాన్ని వాయిదా వేస్తుంటారు. లేదా పాత ఫోన్‌నే ఎక్కువ కాలం ఉపయోగిస్తారు. 2026లో ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ధరలు మరింత పెరుగుతాయి. కాబట్టి రాబోయే నెలల్లో ఫోన్ కొనాలనుకుంటే జాగ్రత్తగా ప్లాన్ చేయాలి.

Related News

సెకండ్ హ్యాండ్ మొబైల్ కొంటున్నారా? మోసపోకూడదంటే ఈ 5 విషయాలు కచ్చితంగా చెక్ చేయండి!

ఓటీపీ షేర్ చేసి పొరపాటు చేశారా? మీ డబ్బు కాపాడుకోవడానికి.. వెంటనే ఈ 5 పనులు చేయండి!

స్మార్ట్‌వాచ్‌ vs ఫిట్‌నెస్ బ్యాండ్.. రెండింటిలో ఫీచర్లు ఒకటేనా? ఏది కొంటే మన డబ్బులు వృధా కావు?

రూ.లక్షలు పెట్టి ఏఐ ఫోన్ కొనాలా? లేక సాధారణ ఫోనే బెటరా? రెండింటికీ తేడా ఇదే!

క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నారా? ఈ తప్పులు చేయకండి.. లేదంటే ఖాతాలో డబ్బులు మటాష్!

ఇంటర్నెట్ లేకపోయినా.. BSNL బ్యాలెన్స్, వ్యాలిడిటీ క్షణాల్లో తెలుసుకోండిలా!

కనిపించకుండా పోయిన వస్తువులను ఇట్టే వెతికి పట్టుకోవచ్చు.. శాంసంగ్ నుంచి క్రేజీ డివైజ్!

అమెజాన్ దసరా ఆఫర్.. రూ. 45,000 లోపే యాపిల్ ఐప్యాడ్.. రూ. 20,000 లోపే టాప్ ఫోన్లు!

Big Stories

Advertisement
×