E-Paper
Advertisement

Oil Palm Factory: రైతులకు గుడ్ న్యూస్.. 300 కోట్లతో భారీ ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ ఏర్పాటు

Oil Palm Factory: రైతులకు గుడ్ న్యూస్.. 300 కోట్లతో భారీ ఆయిల్ రిఫైనరీ ఫ్యాక్టరీ ఏర్పాటు
Advertisement

Oil Palm Factory: స్వేచ్ఛ బ్యూరో: రాష్ట్రంలో మొదటిసారి ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సిద్దిపేట నియోజకవర్గం నర్మేటలో 300కోట్లతో నిర్మించామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ నెల 22న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించుకుంటున్నామన్నారు. సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకట్ స్వామి, వాకిటి శ్రీహరి లతో కలిసి మాట్లాడారు. ఇప్పటి వరకూ తెలంగాణ లో రిఫైనరీ లేదు.. ఇప్పుడు సిద్దిపేట లో ప్రారంభించుకుంటున్నామన్నారు. దీనితో అన్ని జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు చేయవచ్చు అన్నారు. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం రాగానే 300 కోట్లు కేటాయించి 16 నెలల్లోనే ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నామన్నారు.

రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు

ఉగాది సందర్భంగా మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్, మంత్రులు రైతుల ప్రదర్శన ప్రారంభిస్తారని, వ్యవసాయ నూతన ఉత్పత్తులు, ఆధునిక యంత్రాలు శాస్త్రవేత్తల ద్వారా 21,22,23 లలో రైతాంగ సదస్సు నిర్వహించడం జరుగుతుందన్నారు. నర్మెట సభా వేదిక నుంచి సీఎం 70 లక్షల మంది రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులు విడుదల చేస్తారని తెలిపారు. 70 లక్షల మందికి ఒకేసారీ ఖాతాలో డబ్బులు వేసే ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. 20 లక్షల మంది రైతులకు 20 వేల కోట్లు రైతు రుణమాఫీ చేశామన్నారు. గత సారి 9 రోజుల్లో 9 వేల కోట్లు విడుదల చేశామని, ఈసారి కూడా రైతుల ఖాతాలో 9వేల కోట్లు రైతు భరోసా నిధులు విడుదల అవుతున్నాయన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు బుధవారం నుంచి ప్రారంభించినట్లు తెలిపారు.

Advertisement

Also Read: Adulterated Pickles: కుళ్లిన కూరగాయలతో 70 డ్రమ్ముల పచ్చళ్ళు.. అన్న తమ్ముడు అరెస్ట్..!

యూరియా సరఫరాలో ఇబ్బందులు లేకుండాచూశాం

ఈ యాసంగిలో గత యాసంగి సీజన్ కంటే 30 వేల టన్నులు అధికంగా యూరియాను రైతులు కొనుగోలు చేశారని మంత్రి తుమ్మల తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మండలిలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ గత యాసంగిలో 10.24 లక్షల మెట్రిక్ టన్నులు రైతులు కొనుగోలు చేస్తే ఈ యాసంగి లో మార్చి 18 నాటికీ రైతులు 10.73 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశారన్నారు. రైతులు క్యూలైన్లలో నిలబడే పరిస్థితి రాకుడదనే యూరియా యాప్ ని తీసుకొచ్చినట్టు వివరించారు. యూరియా యాప్ ద్వారా రైతులకు అవసరమైనంత మేర, కోరుకున్న సమయంలో వారికి అందుబాటులో ఉండే డీలర్ నుండే యూరియా కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. భారత దేశంలోనే ఇటువంటి పద్దతిని అవలంబించి రైతులకు సౌకర్యవంతముగా యూరియా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

అనుకునంత మేర యూరియా సరఫరా..

Advertisement

గత వానాకాలంలో ముందస్తు నిల్వల ఏర్పాటు చేసుకోవడానికి ప్రభుత్వం రూ.1100 కోట్లతో మార్క్ ఫెడ్ ను సిద్దంగా ఉంచినప్పటికి అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితుల మూలంగా, రామగుండం కర్మాగారం, నాగార్జున ఫర్టిలైజర్స్ ఉత్పత్తిలో ఏర్పడిన అవాంతరాల వల్ల ఏప్రిల్, మే, జూన్ లలో అనుకునంత మేర యూరియా సరఫరా కాలేదన్నారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి, రాష్ట్రానికి కేటాయించిన దానికంటే ఎక్కువ ఎరువులను తెప్పించడం జరిగిందని తెలిపారు. 2024 ఖరీఫ్ కంటే 15వేల టన్నులు అధికంగా ఈ ఖరీఫ్ లో రైతులకు అందించడం జరిగిందని, అంతే గాక గత ఏడాది యాసంగి మొత్తంలో వాడిన దానికంటే ఇప్పటికే 30 వేల టన్నులు ఎక్కువ రైతులకు సరఫరా చేయగలిగాం అని తెలిపారు. అదేవిదంగా రైతులకు సౌకర్యవంతంగా ఎరువుల సరఫరా కోసం నూతనంగా ఫెర్టిలిజర్ యాప్ తీసుకువచ్చి ప్రయోగాత్మకంగా పరిశీలించామన్నారు.

Also Read: Minister Ponnam Prabhakar: ఆర్టీసీలో ఉచిత ప్రయాణంపై సపోర్ట్ చేస్తున్నారా?.. వ్యతిరేకిస్తున్నారా?

Related News

ప్రపంచ స్థాయి చదువులంటే ఇదేనా? ఫీజు బకాయిల పెండింగ్‌పై హరీశ్ రావు నిలదీత

1000 రోజుల పాలన కాదు.. 1000 అబద్ధాల పాలన.. కాంగ్రెస్‌పై రాంచందర్ రావు ఫైర్

సత్తుపల్లిలో భూవివాదం కలకలం.. కోర్టు ఉత్తర్వులు ఉన్నా తహసీల్దార్ నివేదిక రైతుల ఆగ్రహం!

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

పార్టీలో నుండి కవితను అందుకే తొలగించారు: ప్రశాంత్ రెడ్డి క్లారిటీ!

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ సీన్.. లగ్జరీ కారులో వచ్చి మేకల దొంగతనం కలకలం

ఆమె మా బోధన్ కోడలు.. కవిత పై మాజీ ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్‌లో ఓటర్ల వెరిఫికేషన్.. నోటీసులిచ్చినా దక్కని స్పందన!

Big Stories

Advertisement
×