E-Paper
Advertisement

జైలర్ 2 కోసం రజినీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కోలీవుడ్ లోనే హైయెస్ట్!

జైలర్ 2 కోసం రజినీ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కోలీవుడ్ లోనే హైయెస్ట్!
Advertisement

Rajinikanth: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా జైలర్ 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో రజనీకాంత్(Rajinikanth) నటించిన జైలర్ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా జైలర్ 2(Jailer 2) సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 15వ తేదీ విడుదల అయింది. ఈ సినిమా తమిళ తెలుగు భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది.

జైలర్ 2 రజిని రెమ్యూనరేషన్..

ఇక ఈ సినిమాకు తెలుగులో కూడా భారీగా కలెక్షన్ల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 500 కోట్ల కలెక్షన్ల దిశగా పరుగులు పెడుతుంది. ఇలా ఈ సినిమాకు ఈ స్థాయిలో కలెక్షన్లు వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాలో నటీనటుల రెమ్యూనరేషన్ కి సంబంధించిన వార్తలు కూడా బయటకు వచ్చాయి. అదేవిధంగా రజినీకాంత్ ఈ సినిమా కోసం తీసుకున్న రెమ్యూనరేషన్(Remuneration) మాత్రం హాట్ టాపిక్ గా మారింది. జైలర్ 2 సినిమా కోసం రజనీకాంత్ 110 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నారని అదేవిధంగా సినిమా లాభాలలో వాటా కూడా తీసుకున్నారని తెలుస్తోంది.

జైలర్ 2 లాభాలలో రజిని వాటా..

Advertisement

ఇలా ఈ సినిమా రెమ్యూనరేషన్ తో పాటు సినిమా లాభాలలో వాటా కలిపి మొత్తం ఈయన 180 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారని తెలుస్తోంది. ఇలా కోలీవుడ్ ఇండస్ట్రీలోనే రజనీకాంత్ హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్నారని చెప్పాలి. ఈ సినిమాలో ఇతర నటీనటులు కూడా కీలక పాత్రలలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించినందుకు గాను హృతిక్ రోషన్ 25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోగా, మోహన్ లాల్ 15 కోట్లు, అనిరుద్ 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు.

ఆలస్యంగా జైలర్ 3…

ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఏకంగా 35 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ 8 కోట్లు, విద్యాబాలన్ 6 కోట్లు, ఎస్ జె సూర్య మూడు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇలా ఈ సినిమా 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినట్టు తెలుస్తుంది. ఈ సినిమాని సన్ పిక్చర్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇలా జైలర్, జైలర్ 2 సినిమాలో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకోవడంతో ఈ సినిమాకు మూడో భాగం కూడా రాబోతుందని తెలుస్తోంది. ఇలా మూడవ భాగం గురించి జైలర్ 2 సినిమా క్లైమాక్స్ లో హింట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్ట్ తెరపైకి రావడానికి మరి కొంత సమయం పడుతుందని తెలుస్తుంది. ప్రస్తుతం రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్,అనిరుద్ పలు కమిట్మెంట్స్ తో బిజీగా ఉన్న నేపథ్యంలో జైలర్ 3 ఆలస్యమయ్య అవకాశాలు ఉన్నాయి.

Advertisement

Also Read: ఆదర్శ కుటుంబం ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ లాక్..ఎప్పుడు? ఎక్కడంటే?

Related News

సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న రామాయణ.. భారీ రన్ టైం లాక్!

జీరోతో మొదలై వందల కోట్ల ఆస్తి వరకు.. విజయ్ సేతుపతి ఆస్తుల చిట్టా!

పెళ్లయినా.. విజయ్ రష్మిక కోరిక తీర్చలేదా?

జైలర్ 2 విలన్ భార్య ఎవరో తెలిస్తే షాక్!

రావు రమేష్ కి సినిమా అవకాశాలు తగ్గడానికి గల కారణం ఏంటంటే?

అనడానికి ఏం అర్హత ఉంది.. బాడీ షేమింగ్ ట్రోల్స్ పై పాయల్ స్ట్రాంగ్ కౌంటర్!

ఆదర్శ కుటుంబం ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ లాక్..ఎప్పుడు? ఎక్కడంటే?

Big Stories

Advertisement
×