E-Paper
Advertisement

బంగ్లా జంటకు సౌదీలో ఉరి.. ఢాకాకు సమాచారం ఇవ్వకుండానే, అసలు ఏం జరిగింది?

బంగ్లా జంటకు సౌదీలో ఉరి.. ఢాకాకు సమాచారం ఇవ్వకుండానే, అసలు ఏం జరిగింది?
Advertisement

Saudi Arabian: బంగ్లాదేశ్ పాలకులకు ఏ మాత్రం సమచారం ఇవ్వకుండా ఆ దేశానికి చెందిన ఇద్దరు వ్యక్తులను ఉరి తీసింది సౌదీ అరేబియా ప్రభుత్వం. ఈ విషయం తెలియగానే ఢాకా పాలకులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. పవిత్ర నగరం మక్కా మసీదులో ఇద్దరు అసభ్యకరమైన చర్యకు పాల్పడడమే ఇందుకు కారణంగా చెబుతోంది సౌదీ ప్రభుత్వం.

బంగ్లా జంటకు సౌదీలో ఉరి

సౌదీ అరేబియాలోని మక్కా మసీదు సిటీలో బంగ్లాదేశీ జంట అనైతిక చర్యకు పాల్పడిందనే ఆరోపణలతో ఈనెల 14న ఉరి తీసింది సౌదీ అరేబియా ప్రభుత్వం. ఆ జంటను అక్కడి న్యాయస్థానం దోషిగా తేల్చింది . తజిర్ అనేది ఇస్లామిక్ చట్టాల్లో ఒకటి. దీని ప్రకారం వారు నేరానికి పాల్పడ్డారని న్యాయాధికారులు నిర్ధారించినట్టు సౌదీ అంతర్గత మంత్రిత్వశాఖ వెల్లడించింది. అయితే ఆ జంట పాల్పడిన అనైతిక చర్య ఏమిటో స్పష్టంగా తెలపలేదు.

సమాచారం ఇవ్వకపోవడంపై ఢాకా పాలకులు మండిపాటు

Advertisement

తమ పౌరులను ఉరి వేసిన విషయంపై తమకు సమాచారం ఇవ్వలేదని బంగ్లాదేశ్ పాలకులు చెబుతున్నారు. ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటన ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలకు దారి తీయడం మొదలైంది.  జెడ్డాలో బంగ్లాదేశ్ కాన్సులేట్ నివేదిక మేరకు మూడేళ్ల కిందట అంటే 2023 ఆగస్టులో ఈ జంటను అరెస్టు చేశారు. సైబర్‌ క్రైమ్ చట్టం కింద.. వ్యభిచారం ఆరోపణలపై ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరు ఒకే కంపెనీలో పని చేస్తున్నారు. సెప్టెంబర్ 30న సౌదీ అధికారులు పంపిన ఖైదీల జాబితాలో వీరి పేర్లు ఉన్నాయి. వారికి మరణశిక్ష విధించినట్లు ఎక్కడ ప్రస్తావించ లేదు.

ఇలాంటి నేరాలకు మరణశిక్ష విధించిన దాఖలాలు లేవని కాన్సులేట్ పేర్కొంది. మృతుడు నజ్రుల్ బ్రాహ్మణ్‌ బరియాకు చెందిన ఓ పేద రైతు కుటుంబానికి చెందినవాడు. అప్పు చేసి అతడ్ని 2022లో సౌదీకి పంపింది ఆ ఫ్యామిలీ. అక్టోబర్ 11న కుటుంబ సభ్యులతో మాట్లాడారు. స్వీటీ అక్తర్ తమ కుమారుడి భార్య కాదన్నది నజ్రుల్ తండ్రి చెబుతున్నారు. వారిద్దరు ఒకే చోట పని చేస్తున్నారని తమకు తెలుసన్నారు. మృతురాలు స్వీటీ అక్తర్‌ తంగైల్ ప్రాంతానికి చెందినది.

Advertisement

ALSO READ: వలసలపై ట్రంప్‌ సర్కార్ ఉక్కుపాదం.. ఏకంగా 3 లక్షల వీసాల రద్దు

తమ దేశ పౌరులకు మరణ శిక్ష అమలకు ముందు సమాచారం ఇవ్వకపోవడం అంతర్జాతీయ ఒప్పందాన్ని ఉల్లంఘించడమేనని బంగ్లాదేశ్ పాలకుల ఆరోపణ. అయితే మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సౌదీ అరేబియా బంగ్లాదేశ్‌కు అతిపెద్ద విదేశీ కార్మిక మార్కెట్. సుమారు 3.5 మిలియన్ల బంగ్లాదేశీ కార్మికులకు నిలయంగా ఉంది. వారంతా తమ స్వదేశానికి పెద్ద మొత్తంలో డబ్బు పంపుతున్నారు. అందువల్ల వలస కార్మికుల సంక్షేమం ద్వైపాక్షిక సమస్యగా మారింది. ఈ విషయంపై బంగ్లాదేశ్ మౌనం వహించడాన్ని బంగ్లాదేశీయుల్లో ఆగ్రహం రగిలింది. తమ పౌరులను రక్షించడంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తున్నారు.

Related News

వలసలపై ట్రంప్‌ సర్కార్ ఉక్కుపాదం.. ఏకంగా 3 లక్షల వీసాల రద్దు, ఎక్కువగా ఎవరంటే..

ఫ్రెంచ్ విప్లవ గడ్డపై మళ్లీ అగ్గి.. ఇది నిరసనా? అంతర్జాతీయ కుట్రా?

రష్యా డేటా సెంటర్లపై ఉక్రెయిన్ పంజా.. నిలిచిపోయిన డిజిటల్ సేవలు!

జైలు నుంచి పారిపోయి తన కవల సోదరుడి గుర్తింపుతో జీవనం.. యువతి సాయంతో పట్టుకున్న పోలీసులు

యెమెన్‌లో హూతీల క్షిపణి విధ్వంసం.. 53 మంది మృతి!

చర్చిలో తీవ్ర విషాదం.. ప్రార్థన చేస్తుండగా పాస్టర్‌పై పడ్డ భారీ శిలువ.. వీడియో వైరల్!

నోరు విప్పిన జేడీ వాన్స్.. భారత్ విషయంలో నోరు జారాను, అది సరైనది కాదని క్లారిటీ

Big Stories

Advertisement
×