E-Paper
Advertisement

Rajinikanth : తలైవర్ 173 కోసం డిఫరెంట్ లుక్, చాలా ఏళ్ల తర్వాత రజనీకాంత్ అలా

Rajinikanth : తలైవర్ 173 కోసం డిఫరెంట్ లుక్, చాలా ఏళ్ల తర్వాత రజనీకాంత్ అలా
Advertisement

Rajinikanth : ఈ రోజుల్లో చాలామంది హీరోలు ఒక సినిమా చేయడానికి దాదాపు రెండు నుంచి మూడు సంవత్సరాల పాటు టైం తీసుకుంటున్నారు కానీ ఒకప్పుడు చాలామంది దర్శకులు అతి త్వరగా సినిమాలను పూర్తి చేసేవాళ్ళు. హీరోలు కూడా ఒకేరోజులో రెండు మూడు సినిమాల షూటింగ్లో పాల్గొన్న రోజులు ఉన్నాయి. ఇకపోతే సూపర్ స్టార్ రజినీకాంత్ తన కెరీర్ లో ఇప్పటికీ 172 సినిమాలు పూర్తి చేశారు. ప్రస్తుతం 173 వ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

రజనీకాంత్ 173 వ సినిమాకు దర్శకుడుగా సుందర్ ఉండబోతున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. తర్వాత అధికారికంగా అనౌన్స్ చేశారు ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా పూర్తయిపోయాయి. ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మిస్తున్నారు. అయితే సినిమా షూటింగ్ వెళ్లే ముందు దర్శకుడు మారిపోయినట్లు వార్తలు వినిపించాయి. ఈ వార్తలను నిజం చేస్తూ దర్శకుడు సుందర్ ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసి సినిమా నుంచి తప్పుకుంటున్నట్లు కన్ఫర్మ్ చేసేసారు.

తలైవర్ 173 డిఫరెంట్ లుక్ 

Advertisement

తెలుగులో మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్ తో పనిచేస్తున్నట్లు తమిళ్లో కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ యంగ్ డైరెక్టర్స్ తో పనిచేయటానికి ఆసక్తి చూపుతున్నారు. అందులో భాగంగానే కార్తీక్ సుబ్బరాజ్, లోకేష్ కనగరాజ్, నెల్సన్ వంటి దర్శకులతో సినిమాలు చేసి మంచి సక్సెస్ లు అందుకున్నారు.

పార్కింగ్ సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయమయ్యాడు రామ్ కుమార్. రజనీకాంత్ 173 వ సినిమాకి రామ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నట్లు వార్తలు వచ్చాయి కానీ అధికారికి ప్రకటన రాలేదు.

Advertisement

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారట. అసలు గడ్డం లేకుండా క్లీన్ షేవ్ తో సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ సినిమాలో కనిపిస్తారు అని తెలుస్తుంది. రజనీకాంత్ ను ఈ లుక్ లో చూసి చాలా రోజులైంది. మామూలుగా అయితే సూపర్ హెయిర్ స్టైల్ మరియు గుబురు గడ్డంతో రజనీకాంత్ స్టైల్ ఉంటుంది ఈ సినిమాలో అలా కాకుండా డిఫరెంట్ గా ఉంటారట.

సక్సెస్ అందుకుంటారా? 

రజనీకాంత్ సినిమా చేయటం అనేది చాలామంది దర్శకులకు డ్రీమ్. అతని సినిమాలు చూస్తూ పెరిగిన చాలామంది దర్శకులు అతని డైరెక్టు చేయడం అంటే అసలైన అచీవ్మెంట్. మొత్తానికి ఆ అవకాశం రామ్ కుమార్ లభించింది. ఇప్పుడు దర్శకుడు రామ్ కుమార్ ఈ సినిమాతో ప్రూవ్ చేసుకుంటే స్టార్ డైరెక్టర్ గా నిలబడిపోయినట్లే.

Also Read: JanaNayagan : భగవంత్ కేసరి రీమేక్ అని కన్ఫర్మ్ అయినట్లే, ఆ పాత్రలో గౌతమ్ వాసుదేవ్

Related News

‘ఒడిస్సీ’ లాంటి ప్లానింగ్ మనకు సాధ్యమేనా నాగ్?

నోరు జారితే అంతే.. నెక్స్ట్ స్కిట్‌లో నో ఛాన్స్! జబర్దస్త్ సీక్రెట్ లీక్ చేసిన నటి సత్యశ్రీ

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

Big Stories

Advertisement
×