E-Paper
Advertisement

Raju Weds Rambai Trailer: సిన్సియర్ గా లవ్ చేయొద్దు.. ఇంట్లోవాళ్లతో దెబ్బలు పడొద్దు.. అదిరిపోయిన ట్రైలర్

Raju Weds Rambai Trailer: సిన్సియర్ గా లవ్ చేయొద్దు.. ఇంట్లోవాళ్లతో దెబ్బలు పడొద్దు.. అదిరిపోయిన ట్రైలర్
Advertisement

Raju Weds Rambai Trailer: ఈమధ్య చిన్న చిన్న సినిమాలే మంచి విజయాలను అందుకుంటున్నాయి. తాజాగా మరో చిన్న సినిమా ప్రేక్షకులకు అలరించడానికి సిద్దమవుతుంది. అఖిల్ రాజ్ ఉద్దేమారి, తేజస్వీ రావు జంటగా సాయిలు కాంపటి దర్శకత్వం వహిస్తున్న చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. డోలముఖి సబాల్టర్న్ ఫిల్మ్స్, మాన్సూన్ టేల్స్ బ్యానర్స్ పై వేణు ఉడుగుల , రాహుల్ మోపిదేవి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

తాజాగా రాజు వెడ్స్ రాంబాయి ట్రైలర్ ని కుర్ర హీరో అడివి శేష్ రిలీజ్ చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపాడు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. పల్లెటూరు నేపథ్యంలో నడిచే ప్రేమకథగా ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్ధమవుతుంది. రాజు.. డోలు కొట్టుకుంటూ బ్రతుకుతూ ఉంటాడు. అతను డోలు సౌండ్ అంటే ఆ ఊర్లో వారికి చాలా ఇష్టం. అలానే రాంబాయికి అయితే మరీ ఇష్టం. ఇక రాంబాయిని చూడగానే ప్రేమలో పడ్డ రాజు.. వెంటపడి ఆమెను కూడా ప్రేమలోకి దించుతాడు. వాళ్ల ఊరిలో ఒక అమ్మాయికి పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అవ్వడం వలనే ఆమెకు ప్రేమించినవాడిని ఇచ్చి పెళ్లి చేశారని తెలుసుకున్న రాజు, రాంబాయి తమకు కూడా పెళ్లి జరగాలంటే తాను ప్రెగ్నెంట్ కావాలని చెప్పడంతో ఇద్దరు ఫిజికల్ అవుతారు. ఇక రాంబాయి ప్రెగ్నెంట్ కాకముందే ఊర్లో, ఇంట్లో వీరి ప్రేమ విషయం తెలిసిపోతుంది. దీంతో రాజునూ పెళ్లి చేసుకుంటే చంపేస్తా అని తండ్రి.. పెళ్లి చేసుకోకపోతే నేనే చంపేస్తా అని రాజు.. రాంబాయిని కొడుతూ ఉంటారు. చివరకు ఆ బాధలు భరించలేక రాంబయి ఏం చేసింది.. ? రాజును రాంబాయి తండ్రి ఎందుకు వద్దు అంటున్నాడు.. ? చివరకు ఈ జంట పెళ్లి చేసుకున్నారా.. ? అనేది కథగా తెలుస్తోంది.

Advertisement

ట్రైలర్ మొదట్లోనే ప్రేమకు ప్రేమే శాశ్వత శత్రువు అనే లైన్ చూపించారు. ఈ లైన్ తోనే సినిమా నడుస్తుందని తెలుస్తోంది. ఏ ప్రేమను అమ్మాయి వాదులోకోలేదు. అటు ప్రియుడు.. ఇటు తండ్రి.. మధ్యలో నలిగిపోయే హీరోయిన్. మరి చివరకు ఏ ప్రేమను నిలబెడుతుంది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. హీరో హీరోయిన్లు చాలా న్యాచురల్ గా కనిపించారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. డైలాగ్స్ అయితే చాలా బాగా రాశారు. ట్రైలర్ తోనే సినిమాపై ఒక హైప్ క్రియేట్ అయ్యింది. ఇలాంటి ప్రేమ కథలు ఎన్ని వచ్చినా వీటిలో ఉండే మ్యాజిక్ ఇంకే జానర్ లో ఉండదు. నవంబర్ 21ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

‘స్పిరిట్’ వాయిదా.. ఫ్యాన్స్‌కు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన సందీప్ రెడ్డి వంగా!

గరివిడి లక్ష్మి సినిమాపై రవితేజ రివ్యూ.. ఏమన్నారంటే?

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

Big Stories

Advertisement
×