E-Paper
Advertisement

KVS NVS Notification: రూ.2 లక్షల జీతంతో టీచర్ ఉద్యోగాలు.. రేపటి నుంచే దరఖాస్తు ప్రారంభం, బంగారం లాంటి అవకాశం

KVS NVS Notification: రూ.2 లక్షల జీతంతో టీచర్ ఉద్యోగాలు.. రేపటి నుంచే దరఖాస్తు ప్రారంభం, బంగారం లాంటి అవకాశం

KVS NVS Notification: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. కేంద్రీయ విద్యాలయ సంగతన్, నవోదయ విద్యాలయ సమితి (కేవీఎస్ అండ్ ఎన్వీఎస్).. నుంచి పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. బీఈడీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, బీకామ్, ఎంకామ్, బీఈ, బీటెక్, ఇంటర్, గ్రాడ్యుయేట్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, పోస్టులు- వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు ఫీజు, తదితర విధానాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.

కేంద్రీయ విద్యాలయ సంగతన్, నవోదయ విద్యాలయ సమితి (కేవీఎస్ అండ్ ఎన్వీఎస్) నుంచి టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్ 14 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 4న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: త్వరలో తెలియజేయనున్నారు.

కేంద్రీయ విద్యాలయ సంగతన్, నవోదయ విద్యాలయ సమితి (కేవీఎస్ అండ్ ఎన్వీఎస్) నుంచి టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

విద్యార్హత: బీఈడీ, పోస్ట్ గ్రాడ్యుయేట్, బీకామ్, ఎంకామ్, బీఈ, బీటెక్, ఇంటర్, గ్రాడ్యుయేట్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అర్హత ఉన్న వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 50 ఏళ్ల వయస్సు మించరాదు. కనిష్ట వయస్సు 27 కంటే తక్కువగా ఉండరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 నవంబర్ 14

దరఖాస్తుకు చివరి తేది: 2025 డిసెంబర్ 4

ఉద్యోగ ఎంపిక విధానం: త్వరలో ప్రకటించనున్నారు.

అప్లికేషన్ విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. నెలకు ప్రారంభ వేతనమే రూ. 2లక్షలకు పైగా ఉంటుంది.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: kvsangathan.nic.in

నోటిఫికేషన్ కీలక సమాచారం:

మొత్తం ఉద్యోగ వెకెన్సీల సంఖ్య: త్వరలో ప్రకటించనున్నారు.

దరఖాస్తుకు చివరి తేది: 2025 డిసెంబర్ 4

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×