E-Paper
Advertisement

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?

బన్నీ ట్రిపుల్ రోల్‌పై కొత్త ట్విస్ట్.. ‘రాకా’ కథ మొత్తం మారిపోయిందా?
Advertisement

Raka Movie:’రాకా’…’రాకా’…’రాకా’…బన్నీ ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ కి ఈ పేరొక తారకమంత్రం అయిపొయింది.అవును.. డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘రాకా’ ప్రస్తుతం ఇండియాలో మోస్ట్ అవైటేడ్ మూవీగా మారిపోయింది.. భారీ బడ్జెట్‌తో, ఫాంటసీ జానర్‌లో వస్తున్న ఈ సినిమా వస్తుందని తెలిసినప్పటి నుండే ప్రేక్షకుల్లో, ముఖ్యంగా బన్నీ అభిమానుల్లో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఒక రేంజ్ లో పెరిగిపోయాయి.

కేవలం అట్లీ మేకింగ్ స్టైల్, అల్లు అర్జున్ క్రేజీ ఇమేజ్ మాత్రమే కాకుండా, ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్రల గురించి వినిపిస్తున్నక్రేజీ రూమర్స్ ఈ సినిమాపై హైప్‌ను మరింత పెంచేస్తున్నాయి.

Advertisement

అయితే సినిమా మొదలైనప్పటి నుండే ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్రల గురించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నానే ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో బన్నీ మునుపెన్నడూ చూడని విధంగా ఏకంగా ట్రిపుల్ రోల్‌లో కనిపించబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

ఈ ట్రిపుల్ రోల్స్‌లో భాగంగా తండ్రీ కొడుకుల సెంటిమెంట్ ఉంటుందని, మూడు డిఫరెంట్ షేడ్స్‌లో అల్లు అర్జున్ తన నటనతో అదరగొట్టడం ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు కూడా.మొత్తానికి
ఒకే సినిమాలో ముగ్గురు బన్నీలను చూడబోతున్నామని క్లౌడ్ నైన్ లోకి వెళ్ళిపోయారంతా.

Advertisement

అయితే తాజాగా ఈ ట్రిపుల్ రోల్స్ గురించిన మరో క్రేజీ రూమర్ వినిపిస్తుంది. ఇప్పటివరకు వినిపించిన తండ్రీ కొడుకుల సెంటిమెంట్ కాన్సెప్ట్‌కు భిన్నంగా, ఈసారి ఒక సరికొత్త రూమర్ టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం సినిమాలో కనిపించే ఆ ముగ్గురు బన్నీలు ఒకే కుటుంబానికి చెందిన రక్త సంబంధీకులు కాదని, కేవలం శారీరికంగా ఒకేలా కనిపించే అచ్చమైన ‘డోపల్ గ్యాంగర్’ కాన్సెప్ట్ ఆధారంగా ఈ పాత్రలను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

అంటే కనిపించే రూపాలు మూడూ ఒకేలా ఉన్నప్పటికీ, వారి మధ్య జన్యుపరంగా ఎలాంటి రక్త సంబంధం ఉండదన్న మాట. ఒకరికొకరు ఎలాంటి బంధుత్వం లేని ముగ్గురు వ్యక్తులు ఒకేలా కనిపిస్తూ కథలో ఎలాంటి పాత్రలు పోషిస్తారు అనే పాయింట్ ఇప్పుడు ప్రేక్షకులని ఆలోచనలో పడేస్తుంది.

సాధారణంగా సినిమాల్లో ద్విపాత్రాభినయం లేదా త్రిపాత్రాభినయం అంటే తండ్రీ కొడుకులు, కవలలు లేదా అన్నదమ్ములుగా చూపించడం చాలా కామన్. కానీ, ఎలాంటి బంధం లేని ముగ్గురు వ్యక్తులు ఒకే రూపంతో ఒకే కథలో ఎదురుపడితే ఆ డ్రామా ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

అట్లీ తన గత సినిమాల్లోనూ డిఫరెంట్ వేరియేషన్స్ మరియు సర్‌ప్రైజ్ ఎలిమెంట్స్‌ను గట్టిగా వాడుతుంటారు. ఇప్పుడు ‘రాకా’ చిత్రంలో కూడా అల్లు అర్జున్ లాంటి మాస్ అండ్ స్టైలిష్ హీరోతో ఈ ‘డోపల్ గ్యాంగర్’ కాన్సెప్ట్‌ను ప్రయోగిస్తున్నారంటే సినిమా నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ డ్రామా మరియు మైండ్ గేమ్‌లు ఏకంగా నెక్స్ట్ రేంజ్‌లో పండే అవకాశం ఉందని ట్రేడ్ సర్కిల్స్ లో గట్టిగానే వినిపిస్తుంది.
ఏది ఏమైనా ముగ్గురు బన్నీలు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆ విజువల్ ట్రీట్ అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయం. అయితే ఈ కొత్త రూమర్‌పై మేకర్స్ ఎలాంటి అప్ డేట్ వదులుతారో చూడాలి.

Tags

Related News

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

Big Stories

Advertisement
×