Shrimp Feed: రొయ్యల రైతులకు మరో షాక్. నిన్నటి నుంచి వెనామీ మేత కిలోపై 9, టైగర్ మేతపై 12 రూపాయల చొప్పున పెంపు అమల్లోకి వచ్చింది. రైతుల అనుమతి, ప్రభుత్వ సమ్మతి లేకుండానే ధరలు పెంచారని ఆక్వా సంఘాలు ఆరోపిస్తున్నాయ్. గతంలోనూ కంపెనీలు ధరలు పెంచగా ప్రభుత్వం జోక్యం చేసుకుని నిలిపివేసింది. కంపెనీల వాదన మాత్రం మరోలా ఉంది. సోయాబీన్, ఫిష్‌మీల్ వంటి ముడిసరుకుల కొరత, ధరల పెరుగుదలతో ఉత్పత్తి ఖర్చు పెరిగిందని చెబుతున్నాయ్. వాస్తవానికి ప్రభుత్వం రైతులపై భారం తగ్గించేందుకు మేత ధర తగ్గింపుపై కంపెనీలతో చర్చలు జరిపింది కూడా. ఆక్వా రైతుకు కీలకమైన మేత ధరను కంపెనీలు ఏకపక్షంగా నిర్ణయిస్తే నియంత్రణ వ్యవస్థ ఎందుకు పనిచేయడం లేదు? ప్రభుత్వ సూచనలకే విలువ లేకపోతే.. ఆక్వా రైతుకు రక్షణ ఎక్కడన్న ప్రశ్నలైతే వస్తున్నాయ్.