E-Paper
Advertisement

Suriya: కర్ణుడిగా సూర్య.. ఆరేళ్ళ కష్టం.. అంచనాలు పెంచిన డైరెక్టర్!

Suriya: కర్ణుడిగా సూర్య.. ఆరేళ్ళ కష్టం.. అంచనాలు పెంచిన డైరెక్టర్!
Advertisement

Suriya:తమిళ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న సూర్య, ఇప్పుడు భారతీయ పురాణ గాథల్లోని అత్యంత శక్తివంతమైన పాత్ర ‘కర్ణుడు’గా మన ముందుకు రాబోతున్నారనే వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది. బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా కలల ప్రాజెక్ట్ అయిన ఈ సినిమాపై తాజాగా వెలువడిన అప్‌డేట్స్ సినిమా ప్రేమికుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఒక గొప్ప యోధుడి కథను వెండితెరపై ఆవిష్కరించేందుకు రంగం సిద్ధమైంది. వివరాలు ఇలా వున్నాయి..

ఆరేళ్ల సుదీర్ఘ నిరీక్షణ.. పట్టాలెక్కనున్న విజువల్ వండర్:

బాలీవుడ్ సంచలన దర్శకుడు రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా గత ఆరేళ్లుగా ఈ ‘కర్ణ’ ప్రాజెక్ట్ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ మరియు సుదీర్ఘ పరిశోధన పూర్తయ్యాయి. బడ్జెట్ కారణాల వల్ల షూటింగ్ ప్రారంభం కావడంలో కాస్త ఆలస్యమైనా, ఇది ఒక అత్యున్నత ప్రమాణాలతో కూడిన విజువల్ వండర్‌గా ఉండబోతుందని దర్శకుడు స్పష్టం చేశారు. మరీ ముఖ్యంగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఇప్పటికే ఈ సినిమా కోసం ఆరు అద్భుతమైన పాటలను సిద్ధం చేయడం విశేషం. ఈ భారీ పౌరాణిక చిత్రంలో సూర్యకు జోడీగా జాన్వీ కపూర్ కథానాయికగా నటించనున్నట్లు సమాచారం.

సూర్య కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మక పాత్ర:

Advertisement

సూర్య తన కెరీర్‌లో ఎన్నో విభిన్నమైన మరియు ప్రయోగాత్మకమైన పాత్రలను పోషించారు, ఇప్పటి వరకు యాక్షన్ హీరోగా చుసిన సూర్యను పౌరాణిక పాత్ర లో చూడటం విశేషం. ఇలాంటి కర్ణుడి పాత్ర చేయడం ఆయనకు ఇదే మొదటిసారి. మహాభారతంలో దానవీర శూర కర్ణుడిగా పేరుగాంచిన ఆ యోధుడి వేదనను, ధైర్యాన్ని ప్రతిబింబించేలా సూర్య ఆహార్యం ఉండబోతోంది. సూర్య బాడీ లాంగ్వేజ్ మరియు ఇంటెన్సివ్ యాక్టింగ్ ఈ పాత్రకు నిండుదనం తీసుకువస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. ఇప్పటివరకు రూరల్ మాస్, క్లాస్ రోల్స్ చూసిన ఫ్యాన్స్‌కు, ఈ పౌరాణిక గెటప్‌లో సూర్యను చూడటం ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. అందుకే ఈ మూవీ అప్‌డేట్ కోసం సౌత్ ఇండియా మాత్రమే కాకుండా యావత్ భారత దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ALSO READ:ENE 2: ఈ నగరానికి ఏమైంది?2 నుండి తప్పుకున్న సుశాంత్.. ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా?

దర్శకుడు ఆరేళ్ల కష్టం..

Advertisement

దర్శకుడి ఆరేళ్ల కష్టం, ఏఆర్ రెహమాన్ సంగీతం, సూర్య నటన.. ఇవన్నీ కలిస్తే ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనిపిస్తోంది. పురాణ గాథలను నేటి తరం ప్రేక్షకులకు కనెక్ట్ చేసేలా రాకేశ్ ఓంప్రకాశ్ ఈ చిత్రాన్ని మలుస్తున్న తీరుపై భారీ అంచనాలు ఉన్నాయి. సూర్య అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ ప్రాజెక్ట్ గురించి చర్చిస్తూ పండగ చేసుకుంటున్నారు. మరి ఈ విజువల్ మ్యాజిక్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి..

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×