E-Paper
Advertisement

Rajinikanth Humanity: సూపర్ స్టార్ రజనీకాంత్ మంచి మనసు చూశారా.. స్వీపర్ పద్మకు సపోర్ట్

Rajinikanth Humanity: సూపర్ స్టార్ రజనీకాంత్ మంచి మనసు చూశారా.. స్వీపర్ పద్మకు సపోర్ట్
Advertisement

Rajinikanth Humanity: సూపర్ స్టార్ రజనీ కాంత్ మరో సారి మంచి మనసు చాటుకున్నారు. చెన్నైలోని టీ నగర్ ప్రాంతంలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మకు, విధి నిర్వహణలో రోడ్డుపై 45 తులాల బంగారు ఆభరణాలు ఉన్న ఒక సంచి దొరికింది. ఆమె దానిని వెంటనే పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకుంది. దీంతో దేశ వ్యాప్తంగా ఆమె ప్రశంసలు అందుకుంది. తాజాగా ఇదే విషయంపై సూపర్ స్టార్ రజనీ కాంత్ కూడా స్పందించారు. ఆ కార్మికురాలిని ఇంటికి పిలిపించి బంగారు గొలుసుతో సన్మానించారు. అంతే కాకుండా.. నెల నెలా పది వేల రూపాయలు సాయం అందిస్తానని భరోసా కూడా ఇచ్చారు. దీంతో మరో సారి రజనీ మానవత్వం నిండిన సూపర్ స్టార్ అనిపించుకున్నారు. తాజాగా దీనికి సంబంధించి ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కూడా పద్మను సన్మానించి, ఆమెకు రూ.1 లక్ష నగదును కూడా అందజేశారు.

Read also-Suriya: కర్ణుడిగా సూర్య.. ఆరేళ్ళ కష్టం.. అంచనాలు పెంచిన డైరెక్టర్!

నిజాయితీ ఏం చెబుతోంది..

Advertisement

ఇటీవల చెన్నైలో జరిగిన ఈ ఘటన దేశంలో నిజాయితీ ఇంకా బతికే ఉందని నిరూపించింది. సాధారణంగా పది రూపాయలు దొరికితేనే దానిని ఎవరూ చూడకుండా జేబులో పెట్టుకునే ఈ రోజుల్లో, లక్షల బంగారం దొరికితే తన బంగారు మనసుతో వాటిని పోలీసులకు అప్పగించింది. కోట్ల విలువ బంగారంలోనే కాదు.. నిజాయితీలో కూడా ఉంటుందని ప్రపంచానికి చాటి చెప్పింది. మహా భారతం ఆదిపర్వంలో చెప్పినట్లుగా బంగారం ఎక్కడుంటే అక్కడ కలి సంచారం ఉంటుందని, వారి కుటుంబాల్లో మనశ్శాంతి కరువవుతుందని ఆమె బాగా నమ్మినట్లుంది. అందుకే వాటిని చేరాల్సిన చోటుకే చేర్చింది. పాపులారిటీ కోసం పాకులాడే ఈ లోకంలో నిజాయితీతో కూడా పాపులర్ అవ్వోచ్చని ప్రూవ్ చేశారు. సమాజంలో ఉండే రోడ్లను చీపురుతో శుభ్రం చేసినట్లు.. మనుషుల్లో ఉండే అత్యాశను కూడా నిజాయితీతో శుభ్రపరచవచ్చని సమాజానికి తెలిసేలా చేసింది. లక్షల రూపాయల నగలను పోలీసులకు అప్పగించి కోట్లది మంది మనసు గెలుచుకుంది. అవినీతిలో కూరుకుపోయి విలావంతమైన చెత్తకుప్పల్లో నివసించే అనేక మంది రాజకీయ నాయకులకు ఈ ఘటన ఒక చెంపపెట్టులా మారింది.

Read also-Takshakudu: ఆనంద్ దేవరకొండ తక్షకుడు టీజర్ అప్డేట్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?

జైలర్ 2

Advertisement

సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘జైలర్ 2’ (Jailer 2) గురించి వస్తున్న వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారనే వార్త అభిమానుల్లో పూనకాలు తెప్పిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో షారుక్ ఖాన్ కేవలం అతిథి పాత్రకే పరిమితం కాకుండా, కథను మలుపు తిప్పే ఒక పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తారట. రజనీకాంత్ (ముత్తువేల్ పాండియన్) కష్టాల్లో ఉన్నప్పుడు అతనికి అండగా నిలిచే ఒక నమ్మకమైన స్నేహితుడిగా (Confidante) షారుక్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత మిథున్ చక్రవర్తి, రజనీ కాంబినేషన్ సెట్ అవ్వగా, ఇప్పుడు షారుక్ కూడా తోడవడంతో సినిమా రేంజ్ పాన్-ఇండియా స్థాయికి చేరింది.

Related News

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

Big Stories

Advertisement
×