E-Paper
Advertisement

రకుల్ పాప రూట్ మార్చిందిగా…. టాలీవుడ్‌లో చాన్సుల కోసమేనా?

రకుల్ పాప రూట్ మార్చిందిగా…. టాలీవుడ్‌లో చాన్సుల కోసమేనా?
Advertisement

Rakul Tollywood: రకుల్ ప్రీత్ సింగ్ ..ఇప్పుడంటే అవకాశాల్లేక, వెండితెర పై కనిపించక టాలీవుడ్ జనాలు మర్చిపోయారు కాని.. ఒకప్పుడు టాలీవుడ్ ని ఏ రేంజ్ లో షేక్ చేసిందో చెప్పక్కర్లేదు. 2011లో వచ్చిన ‘కెరటం’ సినిమాతో దూసుకొచ్చిన ఈ భామ 2013లో వచ్చిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చేసింది.ఆ తర్వాత లౌక్యం, కరెంట్ తీగ, రఫ్ సినిమాలతో పాగా వేసిన రకుల్ పండగ చేస్కో, టైగర్, బ్రూస్ లీ, కిక్ 2 వంటి సినిమాలతో స్టార్స్ సరసన నటించి ఇండస్ట్రీలో పాతుకుపోయింది.

నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ వంటి మూడు భారీ హిట్స్ 

Advertisement

అన్నిటికన్నా ముఖ్యంగా 2016 రకుల్ ని టాప్ హీరోయిన్ గా కూర్చోబెట్టేసింది.ఆ ఇయర్ లో వచ్చిన నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ వంటి మూడు భారీ హిట్ సినిమాలతో రకుల్ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపొయింది.ఇక 2017లో నాగచైతన్యతో రారండోయ్ వేడుక చూద్దాం, మహేష్ బాబుతో స్పైడర్, కార్తీతో ఖాకీ వంటి సినిమాలతో సత్తా చాటిన ఈ పంజాబీ అందం క్రమ క్రమంగా కొత్త హీరోయిన్ల రాక తో కనిపించకుండా పోయింది.ఇక చివరిసారిగా చెక్, కొండపొలం సినిమాల్లో కనిపించిన రకుల్, మంచి కథ దొరికితే మళ్లీ టాలీవుడ్‌లో మెరుస్తానని కలలు కంటుంది.

“టాలీవుడ్ భలే గ్రేట్.. బాలీవుడ్‌లో అంతా ఇన్-సెక్యూరిటీ”

Advertisement

అవకాశాలు వస్తే సత్తా చూపిస్తా అనడం వరకు భాగానే ఉంది కాని కాసింత అడుగు ముందుకు వేసి “టాలీవుడ్ భలే గ్రేట్.. బాలీవుడ్‌లో అంతా ఇన్-సెక్యూరిటీ” అని, అక్కడనున్న కుళ్ళు కుతంత్రాలు అసలు టాలీవుడ్ లో మచ్చుకైనా కనిపించవని అంటూ తెలుగు సినిమాని ఆకాశానికి ఎత్తడం తోనే నెటిజన్లు తమ మీమ్స్ కి పని చెబుతున్నారు.టాలీవుడ్ కాదు నా రేంజ్ బాలీవుడ్ అని ,అక్కడే పాతుకుపోతా అని బాంబే ఫ్లైట్ చెక్కేసిన నువ్వు ఇపుడు అక్కడ స్లో అయ్యేసరికి మళ్ళీ టాలీవుడ్ జపం చేస్తున్నావా అంటూ చెడుగుడు ఆడేస్తున్నారు.మాములుగా అవకాశాలు స్లో అయినప్పుడు ఇండస్ట్రీలని ఆకాశానికి ఎత్తడం చాలా సహజం అని, ఇక అందులో భాగంగానే టాలీవుడ్ మేకర్స్ ని బుట్టలో పడేసుకోవడానికే తెలుగు జపం చేస్తుందని, యాంటి ఫ్యాన్స్ అంటుంటే, ఇక్కడ ఉన్న సపోర్ట్ అసలు బాలీవుడ్ లో ఏమాత్రం ఉండదని, రకుల్ చెప్పింది నిజమే కదా అంటూ సపోర్ట్ చేస్తున్నారు రకుల్ ఫ్యాన్స్.

ఈ భామని మేకర్స్ ఎవరైనా కరుణిస్తారో !

ఇక రకుల్ విషయానికి వస్తే 1990 అక్టోబర్10న జన్మించిన ఈ భామ 2024 ఫిబ్రవరి 21న, గోవాలో నటుడు, నిర్మాత అయిన జాకీ భగ్నానీని పెళ్లి చేసుకున్న సంగతి తెల్సిందే. ఇక తెలుగు సినిమాలు తగ్గించిన రకుల్ హిందీలో యారియాన్, అయ్యారీ, దే దే ప్యార్ దే, మర్జావాన్, రన్‌వే 34, డాక్టర్ జీ, థ్యాంక్ గాడ్, ఛత్రీవాలీ, ఇండియన్ 2, దే దే ప్యార్ దే 2 వంటి సినిమాల్లో తళుక్కుమంది. చూడాలి మరి మళ్ళీ తెలుగు తెరపై కనిపించాలని ఉవ్విళ్ళూరుతున్న ఈ భామని మేకర్స్ ఎవరైనా కరుణిస్తారో !

also read:ఎన్టీఆర్ జిల్లా వేదికగా ‘ఊరువాడ’.. పోస్టర్ విడుదల చేసిన RAW NTR ఆర్గనైజేషన్!

Related News

ఈ జనరేషన్‌కు మరో బ్రహ్మానందం దొరికేశాడు.. కోనా వెంకట్ కామెంట్స్!

గ్లామర్ మాత్రమే కాదు.. చీరకట్టులోనూ త్రిష అందం అదుర్స్!

రజనీకాంత్‌కు తిరుగులేదుగా.. ‘జైలర్ 2’ కలెక్షన్ల లెక్క ఇదే!

గ్యాంగ్‌స్టర్ సినిమా అనుకుంటే.. చిరంజీవి సినిమాలో అసలు ట్విస్ట్ ఇదే!

రేవంత్ రెడ్డి, కేసీఆర్‌తో పరిచయాలున్నా.. ఆ పని మాత్రం చేయలేదు!

స్పెషల్ అట్రాక్షన్ గా రణబీర్ వాచ్.. రాముడు, హనుమంతుడితో ప్రత్యేక డిజైన్..

దాసరి సినిమా షూటింగ్‌లో అసలేం జరిగింది? దివ్యవాణి బయటపెట్టిన విషయాలు

రణబాలి విషయంలో నేను చెప్పిందే జరిగింది.. విజయ్ కామెంట్స్ వైరల్!

Big Stories

Advertisement
×