E-Paper
Advertisement

ఎన్టీఆర్ జిల్లా వేదికగా ‘ఊరువాడ’.. పోస్టర్ విడుదల చేసిన RAW NTR ఆర్గనైజేషన్!

ఎన్టీఆర్ జిల్లా వేదికగా ‘ఊరువాడ’.. పోస్టర్ విడుదల చేసిన RAW NTR ఆర్గనైజేషన్!
Advertisement

Ooru Vaada: జులై 18న అసలేం జరుగుతుంది …?గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలని ఊపేసిన ప్రశ్న ఇది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నాడు..అందులో భాగంగానే జులై 18న ఊరువాడ అనే ప్రోగ్రాం ని నిర్వహించబోతున్నాడు అంటూ సోషల్ మీడియా కోడై కూసింది.దీంతో అటు ఇండస్ట్రీ వర్గాల్లో ,ఇటు రాజకీయవర్గాల్లో తారక్ సీయం సీటే లక్ష్యంగా అడుగు వేయబోతున్నాడా ?తమిళనాట దళపతి విజయ్ లాగే పార్టీ పెట్టి ఎన్నికల్లో ఏమైనా బరిలోకి దిగాబోతున్నాడా అన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

దీంతో అలెర్ట్ అయింది తారక్ టీమ్.ఆసలు మాకు అలాంటి ఆలోచనే లేదని,ఆ ఊరు వాడ కార్యక్రమానికి,మాకు ఎలాంటి సంబంధం లేదని,పైగా మా పేరు చెప్పుకొని ఎవరైనా అనైతిక కార్యకలాపాలకి పాల్పడినా, డబ్బులు వసూలు చేసినా మాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేసింది.

Advertisement

 కార్యాచరణ ప్రకటించిన రా (RAW) ఎన్టీఆర్ ఆర్గనైజేషన్

అయితే అదంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ రా (RAW) ఎన్టీఆర్ ఆర్గనైజేషన్ గా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెల్సింది.ఇక జులై 18 న తాము అనుకున్న కార్యాచరణ ప్రకటించింది ఈ ఆర్గనైజేషన్.అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా వేదికగా ‘ఊరువాడ’.. అనే పోస్టర్ ని విడుదల చేసింది.ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రా ఎన్టీఆర్ ఆర్గనైజర్ సాయి రూప్ మాట్లాడుతూ, గత వారం రోజులుగా తాము మానసిక క్షోభను ఎదుర్కున్నామని, తనని వంద కోట్ల మోసగాడిగా చిత్రించడం వెనుక ఉన్న కుట్రలను ఖండించారు. ప్రతి ఒక్కరికీ ఒక కుటుంబం, బంధువులు ఉంటారని, ఈ అసత్య ప్రచారాల వల్ల తన కుటుంబ సభ్యుల నుంచి వచ్చిన ఫోన్ కాల్స్, వారి ఆవేదన తనను ఎంతో ఒత్తిడికి గురిచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

ఏదేమైనా, ఈ వివాదం కారణంగా జూనియర్ ఎన్టీఆర్ ప్రతిష్టకు గానీ, ఆయన అభిమానుల మనోభావాలకు గానీ ఎలాంటి చిన్న గాయమైనా జరిగి ఉంటే తాను బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని ప్రకటించారు. గతంలో ఒక ఆడియో ఫంక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ చెప్పిన “మంచి పనులు చేయండి” అనే మాటలను గుర్తు చేస్తూ, ఆయన నాటిన ఆశయాల విత్తనాన్ని ఎవరూ అనుమానించే స్థాయికి తీసుకురావద్దని కోరారు. తమ ప్రాణం ఉన్నంతవరకు తారక్ పేరు చెడగొట్టే ఎలాంటి తప్పును తాము చేయబోమని ఆయన స్పష్టం చేశారు.

మూడు విభాగాలుగా ఉండనున్న “ఊరువాడ” 

ఇక కోర్ కమిటీ సభ్యుడు రాజేష్ మాట్లాడుతూ, వివాదాలకు అతీతంగా తాము చేయబోయే సామాజిక సేవా కార్యక్రమాల రూపకల్పనను వివరించారు. భవిష్యత్తులో ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లేందుకు “ఊరువాడ” అనే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమం ముఖ్యంగా మూడు విభాగాలుగా ఉండనున్నట్టు తెలుస్తుంది. మొదటిది “సేవతో యువ జాగృతి — దీని ద్వారా యువతను చెడు వ్యసనాలకు దూరంగా ఉంచుతూ, సేవా మార్గం వైపు నడిపించేలా చైతన్యపరుస్తారు. రెండవది “మన ఊరు మన బాధ్యత” — గ్రామీణ ప్రాంతాల్లో కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఏదైనా ఒక ప్రధాన సమస్యను గుర్తించి, దానికి శాశ్వత పరిష్కారం చూపించడంతో పాటు రైతులకు అవగాహన కల్పించేలా రైతు సదస్సులు నిర్వహిస్తారు. ఇక మూడవది “ఊరి మాట పాలకుల దాకా” — గ్రామాల్లోని స్థానిక సమస్యలను ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తారు.ఇదీ ఈ కార్యక్రమ రూపకల్పన .

తారక్ ఈ కార్యక్రమంపై ఎలా రియాక్ట్ అవుతాడో !

ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ “ఊరువాడ”కార్యక్రమాన్ని ఎన్టీఆర్ జిల్లాలోని ఒక గ్రామం నుండి అధికారికంగా ప్రారంభం కానుండటం విశేషం.తమ మీద వస్తున్న ఆరోపణలని తిప్పి కొడుతూనే సమాజానికి పనికొచ్చే పనుకు చేస్తూ వెళ్తామని ప్రకటించారు.చూడాలి మరి నాకెలాంటి సంబంధం లేదని ఇప్పటికే ప్రకటించిన తారక్ ముందు ముందు ఈ కార్యక్రమంపై ఎలా రియాక్ట్ అవుతాడో !

Related News

రకుల్ పాప రూట్ మార్చిందిగా…. టాలీవుడ్‌లో చాన్సుల కోసమేనా?

చిన్న వయసులో గొప్ప సాయం.. నటి చేసిన పనికి ఫ్యాన్స్ కు షాక్..

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కు బిగ్ షాక్.. ఫెడరేషన్ నుంచి బహిష్కరణ..

ప్రియాంక చోప్రా బర్త్ డే ట్రీట్.. ‘వారణాసి’ సర్ప్రైజ్ అదిరిపోయింది..

న్యాయం కావాలి.. ఫెడరేషన్ పై నిర్మాతలకు జానీ మాస్టర్ కంప్లైంట్!

బన్నీ క్యాంప్ నుంచీ మరో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్.. ‘గుర్తుకొస్తున్నాయి’ వెనుక ఇంత కథ ఉందా?

క్యాన్సర్ తో పోరాడుతున్న టాలీవుడ్ హీరోయిన్.. హాస్పిటల్ బెడ్ పై!

Big Stories

Advertisement
×