Rakul Preet Singh: ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. రకుల్ కు తెలుగులో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. నేడు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించుకున్న ఎన్టీఆర్, అల్లు అర్జున్ వంటి హీరోలతో కూడా సినిమాలు చేసింది. ఆ సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధించాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఆ సినిమాలో రకుల్ నటించారు.
అలానే ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో చేసిన నాన్నకు ప్రేమతో సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఆ సినిమాలో రకుల్ కూడా మంచి పేరు సాధించుకుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ధ్రువ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఆ సినిమాతో కూడా మంచి పేరు రకుల్ కు వచ్చింది. అయితే ఇన్ని సూపర్ హిట్స్ సినిమాలు చేసిన రకుల్ ప్రస్తుతం తెలుగులో కనిపించకుండా పోయారు.
అయితే ఒక సినిమా సక్సెస్ అయినప్పుడు వరుసగా అవకాశాలు రావడం అనేది కామన్ గా జరుగుతుంది. ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా స్పైడర్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. ఏఆర్ రెహమాన్ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేస్తున్నాడు అన్నప్పుడు చాలామంది దీన్ని చాలా స్ట్రాంగ్ గా నమ్మారు.
స్టాలిన్ సినిమా తర్వాత తెలుగులో మురుగదాస్ సినిమా చేస్తున్నారు అంటే అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. సినిమాలో రకుల్ నటించారు. ఎన్నో ఉంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని సక్సెస్ సాధించలేకపోయింది.
ఈ సినిమా రెండు లాంగ్వేజెస్ లో విడుదలైంది. ఎక్కడ కూడా ఊహించిన సక్సెస్ రాలేదు. ఆ సినిమా తర్వాత పెద్దగా తెలుగులో కనిపించలేదు రకుల్. రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా నేను వరుసగా 8 హిట్ సినిమాలు చేశాను స్పైడర్ సినిమా తో నాకు పెద్ద డిజాస్టర్ సినిమా వచ్చింది అని రకుల్ చెప్పారు.
క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వైష్ణవ తేజ్ హీరోగా నటించిన సినిమా కొండ పొలం. ఆ సినిమాలో ఓబులమ్మ అనే పాత్రలో కనిపించింది రకుల్. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని సక్సెస్ సాధించలేదు. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఇండియన్ 2 సినిమా కూడా డిజాస్టర్ అయిపోయింది.
ఏదేమైనా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్పైడర్ సినిమా కేవలం రకుల్ కు మాత్రమే కాకుండా మహేష్ బాబుకి కూడా ఒక చేదు అనుభవాన్ని మిగిల్చింది. మురుగదాస్ కూడా ఒక సక్సెస్ఫుల్ సినిమా చేస్తాడు అని అతనికున్న ఫాన్స్ కూడా ఎదురు చూశారు. ఇక మురగదాస్ కం బ్యాక్ ఇస్తారా, లేదా అనేది చూడాలి. ఇక రకుల్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలకు పరిమితం అయిపోయినట్లు అనిపిస్తుంది.
Also Read: Raju Weds Rambai: స్టేజ్ పై ఏడ్చేసిన దర్శకుడు వేణు, ఎమోషనల్ అయిపోయిన సాయిలు